Latest Updates
-
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
వర్షాకాలంలో అందం... చందం...!

మార్కెట్ లో దొరికే క్లెన్సర్లకన్నా పాలు ఈ కాలం ఉత్తమం. రోజుకు రెండు సార్లు పాలతో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాతే మేకప్ మొదలు పెట్టాలి. ఈ కాలంలో ఫౌండేషన్ వాడకం అంతగా నప్పదు. వర్షానికి కరిగి మచ్చలుమచ్చలుగా మారుతుంది. దాని కంటే నేరుగా పౌడర్ ని ఉపయోగించడమే మేలు. తడిచినా ఇబ్బంది ఉండదు.
వాటర్ ఫ్రూఫ్ రకం మస్కారాలు... ఐలైనర్ లు బజారులో దొరుకుతాయి. వాటితో పాటు రంగులు కూడా ముదురు గోధుమ రంగు లేత గులాబీ రంగుల్లో ఉన్నవాటినే వాడాలి. వర్షానికి కరిగిపోయినా పెద్ద తేడా తెలియదు. ఇవే రంగులు లిప్ స్టిక్ ఎంపికకూ వర్తిస్తాయి.
స్నానం చేసే నీటిలో కొద్దిగా పన్నీరు కలిపి స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చర్మం శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. రోజుకు రెండు సార్లు స్నానం తప్పనిసరి. పగటి పూట ఎండ పెద్దగా వుండదు కాబట్టి సూర్య కిరణాల వేడి అంతగా వుండదు. రాత్రి పడుకోబోయే ముందు తప్పనిసరిగా క్రీమి మాయిశ్చరైజర్ ఉపయోగించి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
నూనెలతో రూపొందించిన మాయిశ్చరైజర్లకన్నా వాటర్ బేస్డ్ రకం మంచివి. ఈ కాంలో లేయర్ రకం శిరోజాలంకరణ మంచిది. శిరోజాలతో రకరకాల అలంకరణ ప్రయత్నించే కాన్నా అలా వదిలేస్తేనే మేలు. ఐపెన్సిల్ వాడకం కన్నా త్రెడింగ్ అయితే చక్కగా ఉంటుంది. పెన్సిల్ కరిగి చారలు చారలుగా కనిపిస్తుంది.
పుదీనా లేదా విటమిన్ సితో తయారు చేసిన సౌందర్య సాధనాలు మాత్రమే వాడాలి. చందనం పొడిలో కొద్దిగా పన్నీరు, కాసిన్ని పాలు కలిపి ముద్దగా చేసుకొని ముఖానికి పట్టించుకొని ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. వారానికి రెండు మూడు సార్లు ఈ విధంగా చేయాలి.
టమోటాతో తయారు చేసిన ఫేషియల్ ను ముఖానికి పట్టించి 20నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడితే ముఖానికి మంచి మెరుపు వస్తుంది. ఇది చర్మం లోపలి పొరల్లో దాకా వెళ్లి శుభ్రం చేస్తుంది
డెనిమ్ జీన్స్ కన్నా... తేలికగా ఉండే కాటన్ కాఫ్రీ రకం దుస్తులు మేలు. వర్షాకాలంలో శిరోజాల సంరక్షణలో మరింత జాగ్రత్త తీసుకోవాలి. తలను తరచూ శుభ్రం చేసుకోవాలి. లేదంటే చుండ్రు సమస్య వేధిస్తుంది. తలస్నానానికి ఉపయోగించే షాంపూ, సబ్బు తరచూ మార్చకూడదు. జుత్తు జిడ్డుగా ఉండే వారు గోరు వెచ్చని నూనెతో వారానికి రెండు సారల్లు మసాజ్ చేసుకోవడం తప్పనిసరి.
లెదర్ షూలను వీలైనంత తక్కువగా వాడాలి. ఎందుకంటే తేమ చేరి పాదాలకు ఇన్ ఫెక్షన్ సోకే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications
