Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్‌తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
తొలకరి జల్లులు...చర్మ రక్షణ...!

ఈ సీజన్ లో క్లీనింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ వంటి వాటికి న్యూట్రోజెనా డీప్ క్లీన్ ఫేషియల్ ఆయిలీ స్కిన్ కైనా, డల్ స్కిన్ కైనా ఇవి నప్పుతాయి. చర్మంలోని మృతకణాలను తొలగించి చర్మం కాంతి వంతంగా, మృదువుగా మారేలా చేస్తాయి.
మనం ముఖానికి ఇచ్చినంత ప్రాధాన్యత శరీరానికి ఇవ్వం. అలా కాకుండా కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని ‘సిటిఎన్' అంటే క్లీనింగ్, టోనింగ్ మరియు నర్సింగ్ ౩ పద్ధతులు ఆచరిస్తే చర్మానికి మంచి రంగుని, పటుత్వాన్ని, మెరుగయిన చాయను తీసుకొని రావొచ్చు. క్లీనింగ్ అంటే శుభ్రపరచుకోవటం.ఇది చర్మానికి పట్టిన మురికి, మృత కణాలు తీసేసి చర్మం శుభ్రపడెలా చేస్తుంది. టోనింగ్ మొహం మీద మృదువు గా మసాజ్ చెయ్యటం. ఇది రక్తప్రసరణని ,చర్మ రంధ్రాలు పెద్దవి కాకుండా జాగ్రత్త పరుస్తుంది. నర్సింగ్ అంటే చర్మ పోషణ. శరీరానికి పోషణ కోసం ఆహరం ఎలా తీసుకుంటామో చర్మానికి కూడా తగినంత పోషణ అవసరం.సామెత కూడా వుంది "ఇంటికి వంటికి ఎంత చేస్తే అంత అందంగా కనపడతాయి" ఇప్పుడు వర్షా కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.
వర్షాకాలంలో స్కిన్ కి చెప్పలేనంత హాని కలుగుతుంది. చర్మం ఒకసారి పొడిబారిపోయి బిగదీసుకుపోయినట్లుంటే ఇంకోసారి జిడ్డుపట్టి బంకలు సాగుతుంటుంది. శ్రద్ధ చూపకపోతే సమస్యలు ఎదురవుతాయి కాబట్టి తక్కువ గాఢతగల ఫేస్‌వాష్‌తో ముఖం కడుక్కుని, రెండు మూడు నిమిషాల తర్వాత అంటే ఆ తడి ఆరకముందే మంచి మాయిశ్చరైజర్‌తో సున్నితంగా మర్దించాలి. అలా చేయడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.
ఇది వర్షాకాలం కదా, సన్‌స్క్రీన్ లోషన్లతో పనేముందనుకోకుండా ఎండలో బయటకు వెళ్లడానికి పది, పదిహేను నిమిషాల ముందుగా ముఖానికి, మెడకు, చేతులకు తప్పనిసరిగా సన్‌స్క్రీన్ లోషన్ పూయండి. ఎండలోనే ఎక్కువ సమయం గడపవలసి వస్తే ప్రతి మూడుగంటలకూ ఒకసారి అప్లై చేస్తూ ఉంటే మీ ముఖసౌందర్యం దెబ్బతినదు.
వానలో తడిసిన తర్వాత కళ్ళను చల్లని నీటితో కడిగి మెత్తని వస్త్రంతో తుడుచుకోవాలి. స్నానానికి ముందు కాళ్లు, చేతులకు డెట్టాల్ సబ్బు రాసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండుమూడుసార్లు చేయాలి. మహిళలు సున్నిపిండిలోనూ చిటికెడు పసుపు చేర్చి వాడాలి. నీటిలో వేపాకుల్ని వేసి మరగబెట్టి స్నానంచేసే నీటికి కలుపుకోవాలి. ఔషధగుణాలున్న సబ్బునే వాడాలి.
టేబుల్ స్పూన్ పాలలో రెండు బాదం పలుకులు ముందురోజు రాత్రి నానబెట్టి, మరుసటి రోజు ఉదయం పొట్టుతీసి మెత్తగా చేయాలి. ఇందులో నాలుగు చుక్కల నిమ్మరసం, కొద్దిగా తేనె కలిపి ముఖానికి పట్టించాలి. 25 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఈ విధంగా 3 రోజులకు ఒకసారి చేస్తే 10 రోజులకల్లా చర్మంలో నిగారింపు వస్తుంది.
ప్రతి రోజూ రెండు సార్లు స్నానం చేయడం మంచిది. అందుకు ఉపయోగించే సోపులు యాంటి ఫంగల్ సోప్ అయ్యుంటే మరీ మంచిది. అయితే ఇటువంటి సోపులు ముఖానికి వేసుకోకూడదు. మైల్డ్ ఫేష్ వాష్ ముఖానికి చాలా మంచిది. ఇది ఇంట్లో వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు, కొద్దిగా పెసరపిండి, రోజ్ వాటర్ మరియి పాలు తీసుకొని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత శుభ్రం చేసేసుకోవాలి.
తేమని కాపాడుకోవాలి: చర్మం కోల్పోయిన తేమని వేజ్లైన్ తో తయారు చేసిన ద్రవాలతో కాని క్రీంలతో కాని కాపాడుకోవటం. వీటివల్ల చర్మ మృదుత్వం నిలబడుతుంది .ఈ మాయిశ్చరైజర్స్ క్రమం తప్పకుండా వాడి చర్మ సౌందర్యాన్ని ఇనుమడింప చేసుకోవచ్చు.
ఆహారం: మంచినీళ్ళు ఎక్కువ తాగటం కూడా వర్షాకాలంలో చర్మాన్ని రక్షిస్తుంది. ఈ కాలంలో దాహం లేకపోవటం వలని నీళ్ళు తాగాలని ఉండదు, అందువల్ల శరీరానికి సరిపడా నీరు అందక, శరీర కణాలు వాటి రక్షణకి ఉన్నకొద్ది నీరు ఉపయోగించటం వల్ల చర్మానికి తేమ తగ్గి దురద ,చర్మ రంగులో మార్పులు గోచరిస్తాయి. అందువల్ల రోజుకి 8 నుంచి 10 గ్లాసుల నీళ్ళు తప్పక తాగాలి. పళ్ళ రసాలు కూడా తీసుకోవటం మంచిది.



Click it and Unblock the Notifications