Latest Updates
-
చెట్టినాడ్ శనగ కుర్మా..చపాతీతో తింటుంటే కిక్కే కిక్కు! -
రక్తహీనతకు చెక్,చర్మానికి గ్లో..పోషకాల గని బీట్ రూట్ తో కమ్మని హల్వా చేసుకోండిలా.. -
రోజుకు ఒక స్పూన్ పీనట్ బటర్ తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే! -
స్పైసీ, క్రంచీ చికెన్ మిక్చర్..ఆహా ఏమి రుచి అనాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మీ ప్రియమైనవారు మిమ్మల్ని అవమానించారా? ఈ ట్రిక్ పాటిస్తే అవమానించినోళ్లే నోరు మూసుకొని పోతారు! -
తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం హరిది..అమృతంలా ఉంటుంది..ఇలా సింపుల్ గా చేసేయండి -
క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై..ఈ స్పెషల్ మసాలాతో చేస్తే ప్లేట్ మొత్తం క్షణాల్లో ఖాళీ! -
సర్వ పాపాలను తొలిగించే తొలి ఏకాదశి.. మీ కుటుంబ సభ్యులకు ఈ మెసేజ్ లతో విషెస్ చెప్పండి -
తగ్గేదేలే.. పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో పోటీ.. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న వైరల్ వీడియో -
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్‌పై ఓ లుక్కేయండి.!
పెళ్లి కళ కొట్టొచ్చేట్టు...ముచ్చటైన మోముకోసం...!

చర్మ సంరక్షణ చాలా అవసరం: ముహోర్తానికి కొద్దివారాల ముందుగానే చర్మ సంరక్షణపై దృష్టి పెట్టాలి. పెళ్లికూతురు. కాలాన్నిబట్టి, ఒంటితీరును బట్టి అందుకనుగుణమైన చర్యలు తీసుకోవాలి. ఉదాహరణకి: వేసవికాలమైతే ఎండలో బయటికెళ్ళేముందు ముఖానికి, మెడకు, చేతులకు సన్ స్క్రీన్ లోషన్ పట్టించాలి.
పొడిచర్మం గలవారయితే క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ తో చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ముఖం కడుక్కోవడానికి సాధారణ సబ్బుకాకుండా సోప్ ఫ్రీ క్లెన్సర్స్ ను వాడాలి. జిడ్డు చర్మం కలవారు ఫేస్ వాష్ జెల్ తో ముఖం కడుక్కుంటుండాలి. ఆల్కహాల్ ఫ్రీ టోనర్ వాడితే మంచిది. మామూలు చర్మమైతే బాడీ లోషన్ వాడితే సరిపోతుంది.
మొటిమలకూ చెక్ పెట్టండి: ముఖంపై మొటిమలు వుంటే కొంచెం ముదురు ముకంగా కనిపించే ప్రమాదం ఉంది. కళావిహీనంగా కూడా కనపడతారు. నెయ్యి, నూనె, కొవ్వుపూర్తిగా మానేయక్కరలేదుగానీ, కూరగాయలు, పళ్లు సమృద్దిగా ఉండే సమతులాహారం తీసుకుంటే మొటిమలు ముఖమ్మీద దాడి చేయకుండా కాపాడుకోవచ్చు. మైదా, చక్కెర, అతిగా పాలిష్ చేసిన బియ్యం మొటిమలకు నేస్తాలు. కాబట్టి వాటికి దూరంగా వుంటే మంచిది.
నిద్రను నిర్లక్ష్య చేయకూడదు: కనీసం రోజుకు ఏడు నుచి ఎనిమిది గంటలపాటు ఆదమరిచి నిద్రపోయే వారి ముఖంలో పెళ్లికళ కొట్టవచ్చినట్లు కనపడుతుంది. మెడికేటెడ్ ఫేస్ వాష్ తో కనీసం రెండుమూడు సార్లు ముఖం కడుక్కుంటుండాలి. మనం వాడే ఫేస్ వాష్ లో శాలిసిలిక్ యాసిడ్ వుంటే మరీ మంచిది.
కంటి కింద వలయాలతో కళావిహీనంగా: అమ్మాయి ముఖం ఎంత బాగున్నా కళ్ల కింద నల్లటి వలయాలు వుంటే ఆ ముఖంలో ఏదో లోపమున్నట్టుగానే కనపడుతుంది. అసలు నల్లటి వలయాలు ఎందుకు వస్తాయంటే రక్తహీనత వల్ల. కాబట్టి వైద్యుని సలహాతో ఐరన్, విటమిన్ బి12 వున్న ఆహార పదార్థాలు లేదా టాబ్లెట్లు వాడితే వలయాలు రాకుండా వుంటాయి. కళ్లకింద చర్మంపై మాయిశ్చరైజింగ్ క్రీమ్ తో సున్నితంగా మర్దనా చేయడం వల్ల అక్కడ చర్మం పొడారి పోయినట్లు కాకుండా నవనవలాడూ ఉంటుంది.
ముడతలతో ముప్పే: కొంతమంది అమ్మాయిలు పెళ్లి కుదరంగానే ఉద్యోగం మానేసి ఇంట్లో తిని కూర్చుంటారు. కొద్ది రోజులకు ముందయితే ఫరవాలేదు కాని, మరీ ఎక్కువ రోజుల అలా సోమరిగా వుంటే స్థూలకాయం వచ్చే ప్రమాదముంది. ఒంటిపైన నడుం వద్ద, పొట్ట మీద చర్మం ముడతలు పడుతుంది. దాని వల్ల ముదురు వయసు వారిలా కనపడతారు కాబట్టి ఊరికే ఇంటిలో కూర్చోకుండా చిన్న చిన్న ఎక్సర్ సైజ్ లు చేయడం మంచిది.
వేళ్లపైనా, గోళ్లపైనా కూడా శ్రద్ద చూపాలి. చాలా మంది అమ్మాయిల ఒంటిపైన చూపించిన శ్రద్ధ గోళ్లపైన, వేళ్లపైన చూపరు. దానివల్ల వేలికొసలు పగిలి గోళ్లు పెళుసుబారినట్లుగా, బండబారినట్లుగా మోటుగా, అసహ్యంగా కనిపిస్తాయి. కాబట్టి వేళ్లు, గోళ్లపైన కూడా తగినంత శ్రద్దపెట్టక తప్పదు. చీటికిమాటికి చేతులు కడుక్కునే అలవాటుంటే వెంటనే దానికి స్వస్తి చెప్పండి. స్నానం చేయగానే వెంటనే మాయిశ్చరైజింగ్ క్రీమ్ తీసుకుని చేతులకు, కాళ్లకు (గోళ్లతో సహా) పట్టించి సున్నితంగా రాయాలి. మసాజ్ చేసేటప్పుడు కింది నుంచి పైకి చేయాలి. నిద్రపోయేముందు మరోసారి మాయిశ్చరైజర్ పట్టించాలి.
నిగనిగలాడే మేనికాంతులకు: మేనికాంతి మెరుగుపడాలంటే రెండు స్పూన్ల మీగడలో చిటికెడు పచ్చి పసుపు వేసి ఒంటికి మర్దనా చేయాలి. ఇలా ప్రతి రోజూ చేస్తుంటే చర్మం నిగారింపుగా కాంతివంతంగా కనపడుతుంది. అందుకే చాలా మంది ఇళ్లల్లో పెళ్లికూతురికి నలుగు పెట్టి స్నానం చేయించడం రివాజుగా వస్తోంది. వీటన్నింటితోపాటు అణకువ, వినయం పెళ్లికూతురికి తరగని ఆస్తి అయితే చెరగని చిరునవ్వు పెట్టనినగ.



Click it and Unblock the Notifications