Latest Updates
-
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.!
వాలెంటైన్ డే అందానికి అందమైన చిట్కాలు...

1. నిమ్మరసం, మజ్జిగ సమభాగాలు కలిపి ముఖానికి మర్దన చేయడం వల్ల ఎండకు నల్లబడిన ముఖము స్వచ్ఛముగా కనిపిస్తుంది. ఆవ నూనెలో శనగపిండి, పసుపు కలిపి రాసిన చర్మము కాంతివంతంగా అవుతుంది.
2. బాగా కాగబెట్టిన పాలలో కొద్దిగా నిమ్మ రసం కలిపితే ఆ మిశ్రమం చక్కని బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఆ మిశ్రమాన్ని మెడకు, చేతులకు పట్టించి ఎండనివ్వాలి. ఆ తరువాత దాన్ని వెచ్చని నీటితో కడిగితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
3. కుంకుమ పువ్వు అత్యంత ఖరీదే అయినా ప్రపంచ స్థాయిలో సౌందర్య సాధనంగా ప్రసిద్ధిపొందింది. ఈ పువ్వుతో తయారయిన పేస్టును ముఖము, చేతులపైన రాసుకుంటే చర్మానికి మృదుత్వము, బంగారు మెరుపును తెస్తుంది.
4. స్నానానికి బాగా వేడిగా లేదా చల్లగా ఉన్న నీళ్ళను వాడటం దాదాపుగా ఆపేయాలి. గోరు వెచ్చని లేదా మామూలుగా చల్లగా ఉండే నీళ్ళను వాడటం క్షేమం.
5. వంటింట్లో దొరికే పసుపు, మన పెరడు లో దొరికే వేపఆకు చూర్ణం, కుంకుమ పొడి చెరో చెంచా చొప్పును తీసుకొని పచ్చిపాలలో వేసి కలిపి ముఖానికి ఇతర చర్మభాగాలకు రాస్తే నల్ల మచ్చలు, దద్దుర్లు వంటివి పోతాయి. దాంతో చర్మం చల్లగాను, హాయిగాను, మేలి చాలయతో మెరుస్తుంది.
6. మంచి గందం పొడి, పాలతో పేస్ట్ లా తయారు చేసుకొని ముఖానికి, మెడకు మర్ధన చేసినట్లైతే చర్మం సున్నితంగా ఉంటుంది. అంతే కాకుండా గంధం పేస్ట్ చర్మాన్ని చల్లబరుస్తుంది. చర్మం పొడిబారడం, పొరలుగా రావడం వంటివి జరగవు.



Click it and Unblock the Notifications
