Latest Updates
-
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.!
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
మనదేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన దోశ వెరైటీలు ఉంటాయి. దేని ప్రత్యేకత దానిదే. అలా ప్రకాశం జిల్లా ఒంగోలు అనగానే భోజనప్రియులకు ఠక్కున గుర్తుకొచ్చే పేరు పంతులు గారి పులిబొంగరం దోసె. పంతులు గారు అనే ఒక సామాన్య వ్యక్తి తనదైన శైలిలో ఈ దోశను తయారు చేసి ఒంగోలు ప్రజలకు రుచి చూపించారు. పులిబొంగరం అంటే మామూలు దోసె కాదు. ఇది కాస్త మందంగా, మెత్తగా, లోపల దూదిలా ఉంటూనే, బయట కరకరలాడుతూ భలే రుచిగా ఉంటుంది. పులి అంటే పుల్లగా (బాగా పులిసిన పిండితో చేయడం వల్ల) అని అర్థం. 45 ఏళ్ల చరిత్ర కలిగిన ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

పులిబొంగరం దోశ తయారీకి కావాల్సిన పదార్ధాలు
-దోశ పిండి
-పచ్చి శెనగపప్పు
-పచ్చిమిర్చి
-ఉల్లిపాయ
-కరివేపాకు
-కొత్తిమీర
-పసుపు
-ఉప్పు
-అల్లం
-నూనె లేదా నెయ్యి
పులిబొంగరం దోశ తయారీ విధానం
-పులిబొంగరం దోశలు తయారుచేసేకోడానికి ప్రత్యకమైన దోసె పిండి అంటూ ఏదీ ఉండదు. రెగ్యులర్ గా దోశలు వేయడానికి వాడే పిండినే 3 రోజులు పులియబెట్టిన తర్వాత వాడతాం.
-రెగ్యులర్ దోశ పిండిని గ్రైండ్ చేసుకున్నాక 3 రోజుల పాటు బాగా పులియనివ్వాలి.
-3 రోజుల తర్వాత దోశ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి సన్నని తరుగు, కరివేపాకు తరుగు, చిన్న అల్లం ముక్కలు, అరగంట సేపు నీళ్లలో నానబెట్టిన పచ్చిశెనగపప్పు, కొత్తిమీర తరుము, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఇవన్నీ పిండిలో బాగా కలిసేలా కలుపుకోండి.
-కలుపుకున్న పిండి గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోండి. పులిబొంగరం దోశలు వేసుకోడానికి పిండి రెడీ అయిపోయింది.
-ఇప్పుడు దోశలు వేసుకోడానికి స్టవ్ మీద దోశ పెనం పెట్టి దానిమీద ఆయిల్ వేసి ఉల్లిపాయతో మొత్తం పెనం మీద నూనెను స్ప్రెడ్ చేయాలి. పెనం వేడెక్కాక 2 గరిటల దోశ పిండిని వేసి దోశను మందంగా పరుచుకోవాలి. చుట్టూ ఆయిల్ వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండువైపు తిప్పుకొని కాల్చుకన్నాక ప్లేట్ లోకి తీసుకోవాలి.
-అంతే ఒంగోలు ఫేమస్ పులిబొంగరం దోశ రెడీ.
-ఈ వేడి వేడి పులిబొంగరం దోసెను పల్లీ చట్నీ (వేరుశెనగ పచ్చడి), ఎర్ర కారం (ఉల్లి-ఎండుమిర్చి కారం), లేదా అల్లం పచ్చడితో కలిపి తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
