Latest Updates
-
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో?
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై
కాలీఫ్లవర్‌తో కర్రీస్ కంటే ఎక్కువగా స్నాక్స్, వేపుళ్లు చాలా ఇష్టంగా తింటాం. గోబీ మంచూరియా, గోబీ ఫ్రై ఇలా పప్పు, సాంబార్, రసంలోకి సైడ్ డిష్‌గా టేస్ట్ అదిరిపోతుంది. అయితే ఈ సారి మరింత స్పైసీగా మిరియాల పొడి తగిలించి కొత్తగా ట్రై చేయండి.. కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై క్రంచీగా, సాఫ్ట్‌గా ఉంటూ స్నాక్స్‌లోకి కూడా అదిరిపోతుంది. కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం..

కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు
కాలీ ఫ్లవర్- మీడియం సైజు(ఒకటి)
ఉప్పు- రుచికి సరిపడా
పసుపు- అర టీస్పూన్
నూనె- రెండు టేబుల్ స్పూన్లు
జీలకర్ర- టీస్పూన్
ఉల్లిపాయలు- రెండు మీడియం సైజు
కరివేపాకు- రెండు రెబ్బలు
అల్లంవెల్లుల్లి పేస్ట్- టీస్పూన్
పుదీనా ఆకులు- కొద్దిగా
టమాటాలు- మూడు(మీడియం సైజు)
కారం- టేబుల్ స్పూన్
ధనియాల పొడి- రెండు టీస్పూన్లు
మిరియాల పొడి- ఒకటిన్నర టీస్పూన్
కొత్తిమీర- కొద్దిగా
కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై తయారీ విధానం
ముందుగా మీడియం సైజు కాలీఫ్లవర్ తీసుకుని పురుగులు లేకుండా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని కడిగి పెట్టుకోవాలి.
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి!
ఇప్పుడు స్టవ్‌పైన వెడల్పాటి గిన్నెలో నీళ్లు తీసుకుని మరగనివ్వాలి. ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కాలీఫ్లవర్‌ను వేసుకుని వేడినీళ్లలో కాసేపు నాననివ్వాలి.
ఆ లోపు స్టవ్వైన వెడల్పాటి పాన్ పెట్టుకుని అందులో నూనె వేసి కాగనివ్వాలి. ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
నూనె కాగిన తర్వాత జీలకర్ర. ఉల్లిపాయలు వేసి దోరగా వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు వేయాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి.

ఇప్పుడు అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. పుదీనా ఆకులు వేసి టమాటాలు మెత్తగా అయ్యేవరకు మగ్గనివ్వాలి.
టమాటాలు మగ్గిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలను వేసి వేగనివ్వాలి. కాలీఫ్లవర్ ముక్కలు బాగా మగ్గిన తర్వాత కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి ఉడకనివ్వాలి.
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి!
వేపుడు దగ్గరగా అయిన తర్వాత ధనియాల పొడి వేసి కలపాలి. చివరిగా మిరియాల పొడి వేసి మరికాసేపు వేగనివ్వాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఘాటుగా ఉంటూ క్రంచీగా ఉండే కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై పప్పు, సాంబార్‌లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. వర్షాకాలంలో సాయంత్రం స్నాక్స్‌గానూ దీనిని ప్రిపేర్ చేసుకుంటే ఈ వేపుడుకి వాహ్వా అనాల్సిందే.. రొటీన్ గోబీ మంచూరియా, గోబీ ఫ్రైలకి బదులుగా దీనిని తప్పనిసరిగా ట్రై చేయండి..
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications