Latest Updates
-
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.!
నిగారింపు అయిన చర్మానికి కూరగాయలతో ఫేషియల్స్...

1. వేసవిలో ఎండ వేడికి ముఖం నిస్తేజంగా మారటం, కళ్ళు మంట పుట్టడం వంటి సమస్యలు ఎదురౌతాయి. అటువంటప్పుడు పొట్టు తీసిన బంగాళాదుంపని సగం వరకు చక్రాల్లా కట్ చేసి నుదురు, కళ్ళపై పెట్టుకోవాలి. మిగిలిన సగభాగాన్ని గుజ్జులా చేసి కొంచెం తేనె చేర్చి ముఖానికి రాసుకోవాలి. ఈ ప్యాక్ పూర్తిగా ఆరాక చల్లని నీటితో శుభ్రంగా కడిగేసుకొవాలి. ఇలా చేయడం వల్ల కళ్లకు స్వాంతన నివ్వడమే కాక, చర్మంపై జిడ్డును తొలగించి తేజోవంతంగా చేస్తుంది.
2. పొదీన ఆకుల్నిమెత్తగా పేస్ట్ చేసి దానికి రోజ్ వాటర్ చేర్చిముఖానికి రాయాలి. ఇది మాయిశ్చరైజర్ లా పనిచేయడమే కాకుండా, మెటిమలు, బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది.
3. ముల్లంగిని మొత్తని పేస్టులా చేసుకొని రసం వేరుచేయాలి. దీనికి రెండు * ముల్లంగిని మెత్తని గుజ్జులా చేసి రసం వేరుచేయాలి. దీనికి రెండు టీస్పూన్ పెరుగు చేర్చి ముఖానికి, చేతులకు రాసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ ఎండకు వడలిపోయిన చర్మానికి కొత్త తేజస్సునందిస్తుంది.
4. క్యాబేజీ ఆకులను పేస్ట్ చేసి రసాని వేరుచేయాలి. దీనికి రెండు చెంచాల శనగపిండి, చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాని ముఖానికి రాసుకొని పావుగంటయ్యాక తడి దూదితో తొలగించాలి. ఇది చర్మంపై పేరుకొన్న మురుకిని తొలగించి కాంతివంతంగా మార్చుతుంది.
5. జిడ్డు చర్మంగల వారికి కీరదోస చక్కని పరిష్కారం. దీనిని మెత్తగా గుజ్జులా చేసి రసాన్ని వేరుచేయాలి. ఇందులో పావుచెంచా నిమ్మరసం, చెంచా రోజువాటర్ చేర్చి అరగంటపాటు ఫ్రిజ్ లో పెట్టాలి. ఈ మిశ్రమాని రోజుకు రెండుసార్లు ముఖం, మెడ భాగాల్లో రాసుకొని చల్లని నీటితో శుభ్రపరచాలి. ఈ చల్లని ప్యాక్ మించి క్లెన్సర్ లా పనిచేసి, అలసిన చర్మానికి సాంత్వననిస్తంది.
6. పొడి చర్మం గలవారు ఒక నారింజ పండు, ఐదారు కర్జూరాలను తీసుకొని గింజలు తీసివేయాలి. ఈ రెండింటిని మిక్సీలో వేసి ముద్దలా చేయాలి. దీనిని ముఖం చేతులకు రాసుకొని మునివేళ్లతో వృత్తాకారంగా మర్దన చేయాలి. పావుగంట తర్వాత ఈ ప్యాక్ ను తడిదూదితో తొలగించాలి. ఇది చర్మ కణాలకు తగిన తేమనందించి చాలా సేపటి వరకు చర్మ పొడిబారకుండా చేస్తుంది.



Click it and Unblock the Notifications
