Latest Updates
-
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.!
స్వీట్ ట్వంటిలో తీసుకొనే జాగ్రత్తలే.. దీర్ఘకాల సౌందర్యానికి పునాదులు..!
చర్మ సంరక్షణలో రొటీన్ గా తీసుకోవల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సాధారణంగా మహిళలు 20-25లోపు ఉండే వారు వారి కెరీర్ మీద మరియు లక్ష్యాల మీద చాలా బిజీగా ఉంటారు. అప్పుడప్పుడే చదువులు పూర్తి చేసి, కెరీర్ బాట పడుతారు. మంచి ఉద్యోగం సంపాదించాలి. జీవితంలో స్థిరపడాలనే ఆలోచన వారిలో బలంగా ఉండటం చేత వారు వారి చర్మ సంరక్షణ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోరు.
కాబట్టి అటువంటి వారు ముఖ్యంగి 20-25లోపు ఉన్న మహిళలలు తమ కెరీర్ తో పాటు ఆరోగ్యానికి అందానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం. అందుకు కొంత సమయాన్ని కేటాయించడం కూడా అవసరమే. ఈ వయస్సులో కెరీర్ తో పాటు ఆరోగ్యం మరియు సౌందర్యం గురించి తీసుకొనే జాగ్రత్తలే ధీర్ఘ కాలం నిలిచి ఉంటుంది. అలా దీర్ఘకాలం పాటు మీరు మంచి సౌందర్యంతో కనబడాలంటే కొన్ని చర్మ సంరక్షణ చిట్కాలు కొన్ని మీకోసం...

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా కనబడుతారు: మీరు ఒక ప్రకాశవంతమైన మరియు ఆరోగ్యకరమైన చర్మం పొందడం కోసం అవసరమైన మరియు ముఖ్యమైన ఖనిజాలు మరియు విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల మీ శరీరానికి మరియు చర్మ సౌందర్యానికి మంచి పునాది వంటిది.

క్రమం తప్పకుండా వ్యాయామం: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరం మొత్తం, మరియు చర్మకణాలకు రక్త ప్రసరణ బాగా జరిగి మీరు ఎల్లప్పుడు ఆరోగ్యంగా మెరిసే చర్మంతో మెరిసిపోతుంటారు.

మంచి ఫేష్ వాష్ ను కొనుక్కోండి: ముఖాన్ని శుభ్రపరచుకోవడానికి ఒక మంచి ఫేష్ వాష్ ను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. ఫేస్ వాష్ కూడా అది మీ చర్మ తత్వాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలి.

మాయిశ్చరైజర్: అందమైన చర్మ ఎల్లప్పుడు మాయిశ్చరైజ్(తేమగా)ఉంటుంది. పొడి చర్మం మిమ్మల్ని ఎప్పుడు డల్ గా మరియు ముడుతలతో ఉండేలా చేస్తుంది. కాబట్టి ఒక మంచి నాణ్యత కలిగిన మాయిశ్చరైజర్ ను మీ ఎంపిక చేసుకొని ప్రతి రోజూ మాయిశ్చరైజర్ అప్లై చేయడం చాలా అవసరం.

దినం మార్చి దినం స్క్రబ్ చేయడం చాలా అవసరం: ఇలా డే బై డే స్ర్కబ్బింగ్ చేయడం వల్ల చర్మంలో పేరుకు పోయిని మురికిని తొలగించడంతో పాటు డెడ్ స్కిన్ తొలగిస్తుంది. కాబట్టి ఈ తేలికపాటు స్ర్కబ్బింగ్ ను ఉపయోగించి అందంగా తయారవ్వండి.

బ్యూటీ ట్రీట్మెంల్ లు చాలా చెడ్డవి: అందంగా కనబడటం కోసం బ్యూటీ పార్లర్లకు తరచూ వెళుతూ..బ్యూటీ ట్రీట్మెంట్లు తీసుకోవడం మీ చర్మానికి చాలా హాని కలిగిస్తుంది. కాబట్టి సాధ్యం అయినంత వరకూ బ్యూటీ ట్రీట్మెంట్లకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. సహజ పద్దతులను ఇంట్లోనే ప్రయత్నించండి. దాంతో దీర్ఘకాల సౌందర్యాన్ని పొందగలుగుతారు.

సమర్థవంతమైన SPF తో ఉన్న సన్ బ్లాక్ ను ఉపయోగించండి: సూర్య కిరణాలు మీ చర్మ సౌందర్యానికి హాని కలిగిస్తాయి. సూర్యకిరణాల్లో యూవీ కిరణాలు చర్మం మీద పడటం వల్ల చర్మం కమలడం మరియు నల్లగా మారడం వంటి సమస్య ఎదుర్కొంటుంటాం కాబట్టి మంచి క్వాలీటి ఉన్న సన్ స్ర్కీన్ లోషన్ ఉపయోగించడం వల్ల సూర్య కిరణాల నుండి ఏర్పడే హానిని తగ్గిస్తుంది. మన చర్మానికి రక్షణ కల్పిస్తుంది.

సాధ్యమైనంత వరకూ నేచురల్ గా ఉండటానికి ప్రయత్నించండి: సాధ్యమైనంత వరకూ సహజంగా నేచురల్ గా ఉండటానికి ప్రయత్నించడం వల్ల మరింత అందగా కనబడుతారు. దానికి తోడు అతి తక్కువ మేకప్ కు ప్రాధాన్యత ఇవ్వండి.

మేకప్ తో ఎప్పుడూ నిద్రపోకండి: నిద్రకుపోవడానికి ముందు మీరు వేసుకొన్న మేకప్ ను పూర్తిగా తొలగించాలి. మీరు నిద్రించే సమయంలో మీ చర్మానికి ఊపిరి సలపనియ్యండి. విశ్రాంతిని అందించండి.

ఎల్లప్పుడూ మంచి నాణ్యమైన ఉత్పత్తులను ఉపయోగించండి: ఎక్స్ పైర్డ్ ఉత్పత్తులు మరియు లో క్వాలిటీ ఉత్పత్తులను ఉపయోగించకండి. మీ చర్మ కంటే ఏదీ విలువైనది కాదు. కాబట్టి మేలైన బ్యూటీ ప్రొడక్ట్స్ కు ప్రాధాన్యతను ఇవ్వండి. వాటి లేబుల్స్ ను క్షుణంగా చదివిన తర్వాతే వాటిని వాడటానికి ప్రయత్నించండి.
20ఏళ్ళ వయస్సులో రొటీన్ గా చర్మ సంరక్షణ కోసం జాగ్రత్తలు తీసుకోవడానికి ఇది ఒక మంచి సమయం. ఈ వయస్సులో మీరేం చేస్తారో అదే మిమ్మల్ని యవ్వనంగా మరియు అందంగా ఉంచడానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications
