Latest Updates
-
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే!
అలసిన చర్మాన్ని కాంతివంతం చేయడానికి 10 బెస్ట్ టిప్స్
రోజంతా పనిచేసి అలసిపోయినప్పుడు, మీ ముఖం చూడటానికి చాలా డల్ (నిర్జీవం)గా ఉంటుంది. మరియు ముఖంలో తాజాదనం మొత్తం తగ్గిపోయినట్లు కనిపిస్తుంది. మీకు సరైన నిద్రలేకపోయినా మీర ముఖం చూడటానికి డల్ అలసటగా మరియు చర్మంలో కాంతి తగ్గిపోతుంది. అలసిన చర్మానికి కారణాలు అనేకం. అనేక చర్మం సమస్యలు: ముడుతలు, డార్క్ స్పాట్స్ మొదలగునవి. అలసట చెందిన మీ చర్మానికి విశ్రాంతి కలిగించి, చర్మాన్ని బ్రైట్ గా మరియు ప్రకాశవంతంగా మరియు తాజాగా మార్చుకోవాలి. అలసిన చర్మాన్ని ప్రకాశవంతం గా మార్చుకోవడానికి అనేక మార్గాలున్నాయి.
బాగా అలసిన మీ చర్మాన్ని రోజుకు 3-4సార్లు శుభ్రం చేసుకోవడం వల్ల మీరు తాజా మరియు ప్రకాశవంతంగా కనిపిస్తారు. చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ముఖంలో ఉండే మురికి తొలగిపోతుంది. మొటిమలను తగ్గిస్తుంది మరియు మిమ్మల్ని ఫ్రెష్ గా కనబడేలా చేస్తుంది. అలాగే మీరు కొన్ని ఫేస్ మాస్క్ లు వేసుకోవడం వల్ల కూడా అలసిన చర్మం ను నివారించవచ్చు. ఉదాహరణకు, ఫేస్ మాస్క్ ద్వారా చర్మానికి తగినంత తేమను అంధించడంతో పాటు ఎక్కువ తాజాదనంతో ఉండేలా చేస్తుంది.
చర్మాన్ని తేమగా ఉంచే ఫేస్ మాస్కుల్లో పెరుగు, పసుపు, పాలు, క్రీమ్ మరియు రోజ్ వాటర్ వంటివి బాగా సహాయపడుతాయి. ఈ ఫేస్ ప్యాక్ లు మీ చర్మాన్ని బిగువుగా చేస్తాయి. అలసిన చర్మాన్ని తిరిగి పునరుత్తేజం చేసి, ముఖంలో కాంతిని నింపుతాయి. అంతే కాదు, మీరు తీసుకొనే డైట్ కూడా అలసిన చర్మాన్ని తాజాగా మార్చుతుంది. అధికంగా ఉప్పు తినడం వల్ల శరీరంలో నీరు తగ్గిపోయి డీహైడ్రేషన్ కు గురిచేసి, మీ చర్మాన్నిచాలా త్వరగా పొడిబారేలా చేసి, డల్ గా మార్చుతుంది. ముఖ్యంగా మీరు అధిక ఉప్పు తినడం వల్ల కళ్ళు కూడా ఎప్పుడూ ఉబ్బినట్లు కనబడుతాయి . కాబట్టి, ఉప్పు తీసుకోవడాన్ని తగ్గించి, కళ్ళ చుట్టూ ఉబ్బును తగ్గించండి . దాంతో కళ్ళ చుట్టూ చర్మ బిగువుగా ఉండేందుకు సహాయపడుతుంది. మీ చర్మం తాగాజా ఉండాలన్నా, చర్మ ఎల్లప్పుడూ తేమగా ఉండాలన్నా మీరు ఎక్కువగా నీళ్లు త్రాగాలి. అలాగే ప్రతి రోజూ రాత్రి మంచి నిద్రపొందాలి . నిద్రలేమి వల్ల మీ శరీరం అలసిపోయినట్లు చేయడమే కాదు, మీ చర్మం కూడా డల్ మరియు టయర్డ్ గా కనబడేలా చేస్తుంది . మరి మీ టయర్డ్ స్కిన్ ను ప్రకాశవంతంగా మార్చుకోవడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి...

ఫేస్ వాష్:
ప్రతి రోజూ 3-4సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖం శుభ్రం చేసుకోవడానికి సోపు వాడకుండా ఫేస్ వాష్ ను ఉపయోగించండి. ముఖం శుభ్రం చేయడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించండి.

ఎక్స్ ప్లోయేట్:
ఎక్సఫ్లోయేట్ చేయడం తప్పనిసరి. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది మరియు కొత్తగా ప్రకాశించే చర్మాన్ని రివీల్ చేస్తుంది. వారానికి ఒకసారి పాటించగలిగే ఒక బెస్ట్ స్కిన్ కేర్ చిట్కా ఇది.

బంగాళదుంప/కీరదోసకాయ స్లైస్:
మీ కళ్ళు బాగా అసినట్లు మరియు కళ్ళు ఉబ్బుగా కనబడుతుంటే, మీరు మరింత ఎక్కువగా డల్ గా కబడుతారు . అందుకు ఈ రెండు వెజిటేబుల్స్ చాలా గొప్పగా సహాయడపడుతాయి. కళ్ళలో రెడ్ నెస్ మరియు కళ్ళ ఉబ్బును నివారిస్తాయి. మీకు డార్క్ సర్కిల్స్ ఉన్నట్లైతే పొటాటో స్లైస్ ఉపయోగించి కంటిక్రింద నల్లటి వలయాలను తగ్గించుకోండి.

హైడ్రేటింగ్ క్రీమ్స్:
మీ అలసిన చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి ఇది ఒక ఉత్తమ మార్గం మరియు తాజాగా చేస్తుంది. రాత్రి సమయంలో హైడ్రేటింగ్ క్రీమ్స్ ను అప్లై చేసి, మరుసటి రోజు ఉదయం తాజాగా కనబడేలా ప్రయత్నించండి . క్రీమ్ తో మాయిశ్చరైజ్ చేయడం వల్ల చర్మం తాజాగా మరియు ఫ్రెష్ గా ఉంటుంది.

ఫేస్ మాస్క్:
మీరు కొన్ని హోం మేడ్ హైడ్రేటింగ్ పేస్ మాస్క్ ను అప్లై చేయండి . ఇది అలసిన చర్మాన్ని చాలా సున్నితంగా తగ్గిస్తుంది. పాలు, పెరుగు లేదా క్రీమ్, పసుపు , రోజ్ వాటర్ మరియు నిమ్మరసం వంటివి మిక్స్ చేసి, ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి. ఫేస్ మాస్క్ వేసుకొన్న అరగంట తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం రంగు తాజాగా మరియు ప్రకాశవంతంగా మారుతుంది.

రోజ్ వాటర్:
ఒక్క నిముషంలో అలసిన చర్మం ప్రకాశవంతంగా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కాటన్ బాల్స్ ను రోజ్ వాటర్ లో డిప్ చేసి అలసిన ముఖ చర్మం మీద మర్ధన చేయాలి. అలా చేయడం వల్ల చర్మాన్ని తాజాగా మరియు ప్రకాశవంతంగా మరియు క్లీన్ గా ఉంచుతుంది.

ఉప్పు తీసుకోవడానికి తగ్గించాలి:
కొన్నిసార్లు మీ ఆహారంలో అధిక ఉప్పు వినియోగం కారణంగా మీ కళ్ళు ఉబ్బినట్లుగా మారతాయి. మీ కళ్ళు చుట్టూ చర్మాన్ని బిగించి కంటి బ్యాగ్స్ తగ్గించడానికి మీరు ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. కళ్ళ చుట్టూ ఉండే నల్లని వలయాలు మరియు ముడుతలు తగ్గటానికి బంగాళాదుంప ముక్కలు లేదా దోసకాయ ముక్కలు ఉపయోగించవచ్చు.

నీరు ఎక్కువగా తీసుకోవాలి :
నీరు ఎక్కువగా తీసుకోవటం అనేది ఆరోగ్యకరమైన శరీరం మరియు హైడ్రేటెడ్ చర్మాన్ని నిర్వహించడానికి గొప్ప పరిష్కారం. అలాగే మీరు దీనికి ప్రత్యామ్నాయంగా మీ ముఖ చర్మము ఛాయను ప్రకాశవంతం చేయడానికి కొబ్బరినీరును ఉపయోగించవచ్చు.

ఆహారం:
స్ట్రాబెర్రీస్, బ్రోకోలి, ఆకుకూరలు మరియు నిమ్మకాయ వంటి ఆహారపదార్ధములను తీసుకోవడం ద్వారా మన చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చును. సమతుల్యమైన ఆరోగ్యకర ఆహారాలని తీసుకోవడం ద్వారా మన చర్మ సౌందర్యం పై ఎన్నో అద్బుతమైన ఫలితాలు పొందవచ్చు.

రాత్రిపూట సరిపడా నిద్ర అవసరము :
తగినంత నిద్ర లేకపోతె చర్మం ఒత్తిడి మరియు అలసటకు గురి అవుతుంది. ఒక క్రమ పద్ధతిలో నిద్ర ఉంటె మీ చర్మం ఆరోగ్యంగాను మరియు యవ్వనంగాను ఉంటుంది. మీరు నిద్ర పోయినప్పుడు ఆరోగ్యకరమైన చర్మ కణాల ఉత్పత్తి జరుగుతుంది. అంతే కాకుండా ముడుతలు మరియు వృద్ధాప్యంలను నిరోధిస్తుంది.



Click it and Unblock the Notifications











