డ్రై స్కిన్ పోగొట్టే బేస్ట్ నేచురల్ హోం మేడ్ వింటర్ ఫేస్ ప్యాక్స్

ప్రస్తుతం వింటర్ సీజన్. ఈ శీతాకాలంలో చలితో పాటు, అనేక చర్మ మరియు బ్యూటీ కేర్ సమస్యలను తీసుకొస్తుంది. ఈ వింటర్ సీజన్ లో చాలా మంది ఎదుర్కొనే సమస్య చర్మ సమస్యలు అందులో ముఖ్యంగా డ్రై స్కిన్(పొడి చర్మం), చర్మం పగుళ్ళు. ఈ చర్మ సమస్యలు నివారించడానికి చర్మం మరియు శరీరానికి అవసరం అయ్యే విటమిన్స్ మరియు మినిరల్స్ ను చేర్చుకోవల్సి ఉంటుంది.

శీతాకాలంలో డ్రై స్కిన్ నివారణకు కొన్ని మాయిశ్చరైజర్స్ ను ఉపయోగించి సమస్యను నివారించవచ్చు. అలాగే అన్ని రకాల వింటర్ స్కిన్ ప్రాబ్లమ్స్ ను వింటర్ ఫేస్ ప్యాక్స్ తో కూడా నివారించవచ్చు. వింటర్ ఫేస్ ఫ్యాక్స్ చర్మానికి మాయిశ్చరైజ్ గా ఉపయోగపడుతుంది మరియు ఇది పొడి చర్మన్ని నిర్మూలిస్తుంది . ఈ వింటర్ ఫేస్ ప్యాక్స్ విటమిన్ ఇ అధికంగా ఉంటాయి కాబట్టి ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి. వింటర్ సీజన్ లో మే చర్మాన్ని రక్షించే కొన్ని హోం మేడ్ వింటర్ ఫేస్ ప్యాక్స్ కొన్నింటిని మీకోసం ఈ క్రింది స్లైడ్ ద్వారా అంధిస్తున్నాం.

హోం మేడ్ వింట్ పేస్ ప్యాక్స్ అండ్ ఫేస్ మాస్క్స్

అరటిపండు-మజ్జిగ:

అరటిపండు-మజ్జిగ:

బాగా పండిన అరటిపండును మెత్తగా పేస్ట్ చేసి, తర్వాత, అంతే మోతాదులో పెరుగు లేదా చిక్కటి మజ్జిగను మిక్స్ చేయాలి. బటర్ కు బదులుగా వెన్నతీసిన పాలు కూడా మిక్స్ చేయవచ్చు . ఈ రెండు పదార్థాలను బాగా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. బట్టర్ లేదా వెన్న తీసిన పాలు లేదా క్రీమ్ నేచురల్ మాయిశ్చరైజర్స్ గా పనిచేస్తుంది మరియు డ్రై స్కిన్ నివారిస్తుంది. బనానా ఫేస్ ప్యాక్ గా బాగా ఉపయోగపడుతుంది మరియు మాయిశ్చరైజ్ చేస్తుంది.

అవొకాడో ఆలివ్ ఆయిల్:

అవొకాడో ఆలివ్ ఆయిల్:

బాగా పండిన అవొకాడోను తీసుకొని అందులోని గింజలను తొలగించి, స్పూన్ తో అవొకాడోను మెత్తగా చేయాలి. తర్వాత దానికి ఒక చెంచా ఆలివ్ ఆయిల్ ను చేర్చి బాగా మిక్స్ చేసి, ఆ పేస్ట్ ను ముఖం మొత్తానికి అప్లై చేయాలి . తర్వాత 10-15నిముషాలు ఎండిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. అవొకాడోలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఆలివ్ ఆయిల్ చర్మంలోనికి చాలా సులభంగా చొచ్చుకొని పోయి. చర్మాన్ని శుభ్రం చేస్తుంది. ఆలివ్ ఆయిల్ అవొకాడో విటమిన్ ఇను తీసుకొని చర్మాన్ని మాయిశ్చరైజ్ గా మార్చుతుంది.

తేనె రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్:

తేనె రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్:

ఒక చెంచా తేనె మరియు ఒక చెంచా రోజ్ వాటర్ తీసుకొని బాగా మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. 10నిముషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి . తేనె చర్మానికి నేచరల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. రోజ్ బాటర్ చర్మఛాయను మెరుగుపరుస్తుంది . ఈ ఫేస్ ప్యాక్ వింటర్ డ్రై స్కిన్ కు చాలా మేలు చేస్తుంది.

క్యారెట్ , తేనె వింటర్ మాస్క్:

క్యారెట్ , తేనె వింటర్ మాస్క్:

రెండు చెంచాలా క్యారెట్ పేస్ట్ కు ఒక చెంచా తేనె మిక్స్ చేసి, ఈమిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి . ప10-15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయడం వల్ల ఇది డార్క్ స్కిన్ లైట్ చేస్తుంది. మరియు డ్రై స్కిన్ నివారిస్తుంది.

పెరుగు మరియు తేనె ఫేస్ ప్యాక్:

పెరుగు మరియు తేనె ఫేస్ ప్యాక్:

రెండు చెంచాలా తేనె, నాలుగు చెంచాల పెరుగును ఒక బౌల్లో తీసుకొని, ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి ముఖం మరియు మెడకు బాగా అప్లై చేయాలి. ఈ ప్యాక్ బాగా ఎండిన తర్వాత అంటే 20నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

గుడ్డు, ఆలివ్ ఆయిల్ ఫేస్ ప్యాక్:

గుడ్డు, ఆలివ్ ఆయిల్ ఫేస్ ప్యాక్:

గిన్నెలో గుడ్డు పగుల గొట్టి వేసి, అందులో ఒక చెంచా తేనె మరియు ఒక చెంచా ఆలివ్ ఆయిల్ వేసి వీటిని బాగా మిక్స్ చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ ను ఫేస్ ప్యాక్ గా వేసుకొని, 15నిముషాలు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి .

Story first published: Friday, December 20, 2013, 15:57 [IST]
Desktop Bottom Promotion