Latest Updates
-
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్ -
దసరా స్పెషల్ కట్టె పొంగలి..ఇలా చేస్తే చల్లారినా కూడా గట్టిగా మద్ద అవ్వదు! -
దసరా నాడు అపరాజితా దేవి పూజ ఎలా చేయాలి? శుభ ముహూర్తం, మంత్రాలు, శమీ పూజ డీటెయిల్స్.. -
దసరా స్పెషల్ రెడ్ చికెన్.. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ సీక్రెట్ మసాలా వేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే! -
హ్యాపీ విజయదశమి 2026..మీ బంధుమిత్రులకు దసరా విషెస్ చెప్పండిలా.. -
దసరా స్పెషల్..పాకం పట్టే పనిలేకుండా ఈజీగా బెల్లం గవ్వలు చేసుకోండిలా..గుల్ల గుల్లగా భలే రుచిగా.. -
గోధుమ రవ్వ vs బొంబాయి రవ్వ..షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి ఏ ఉప్మా మంచిది? -
మిగిలిపోయిన అన్నంతో హోటల్ స్టైల్ క్రిస్పీ వడలు.. -
కర్ణాటక స్పెషల్ మసాలా చిత్రాన్నం..కేక ఉంటది ట్రై చెయ్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్
మీరు అందం విషయంలో ఏమాత్రం రాజీ పడరా?
సాధారణంగా అందం విషయం ఎవ్వరూ రాజీ పడరు. ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని కోరుకుంటారు. ముఖంలో మొటిమలు, డార్క్ స్పాట్స్, ముడుతలు లేని అందమైన మెరిసే చర్మం ఉండాలని కోరుకుంటారు. మీకు బోరింగ్ లుక్ ను ఇచ్చే అవాంఛితంగా ఏర్పడ్డ నల్ల ఈ మచ్చలను తొలగించడానికి బ్లీచింగ్ సహాయపడుతుంది. ప్రధాన కారకం ఏంటంటే బ్లీచింగ్ కు సరైన ఎంపికే ప్రధాన సమస్యగా ఉన్నాయి. కొంత మందికి బ్లీచింగ్ లో వివిధ రకాలున్నాయన్న విషయం కూడా తెలియదు. మరి స్కిన్ టోన్ కు సరిపోయే బ్లీచింగ్ ఏంటో తెలుసుకోవాలంటే..మొదట బ్లీచింగ్ లో రకాలు తెలుసుకోండి..
బ్లీచింగ్ లో రకాలు:
పౌడర్ బ్లీచ్- హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు అమ్మోనియా లిక్విడ్ తో బ్లీచింగ్ పౌడర్ జోడించడం ద్వారా జరుగుతుంది.
క్రీమ్ బ్లీచ్ - ఈ బ్లీచింగ్ క్రీమ్ దీన్ని బ్యూటీ పార్లర్స్ లో ఎక్కువగా ఉపయోగించే ఈ క్రీమ్ బ్లీచ్ యే మందుల దుకాణంలోనైనా దొరుకుతుంది లేదా కెమికల్ షాపుల్లోనూ అందుబాటులో ఉంది.
మీరు ఎలా వాడాలి? మీరు ఏ కారణం చేత దీన్ని ఉపయోగిస్తున్నారో నిర్ణయించుకోవాలి.
డార్క్ స్పాట్స్ మరియు చిన్న చిన్న మచ్చలు యొక్క తొలగింపు కోసం, డార్క్ స్పాట్స్ ఉన్న ప్రదేశంలో మాత్రమే ఈ బ్లీచింగ్ ను ఉపయోగిస్తారు. దీనికి పౌడర్ బ్లీచ్ ను ఉపయోగించాలి.
ఒక వేళ స్కిన్ బ్రైటనింగ్(ముఖం కాంతివంతగా పొందడం) కొరకు అయితే , క్రీమ్ బ్లీచ్ ను ఉపయోగించాలి . మీ ముఖం మీద విస్తృతమైనదిగా అప్లై చేయాలి. మీరు నిర్దిష్ట ప్రాంతంలో(అనగా చిన్న చిన్న మచ్చలు మరియు మచ్చలు ఉన్న ప్రదేశం చుట్టు) ఉపయోగించదలచుకుంటే క్రీమ్ బ్లీచ్ ఉపయోగించడం సురక్షితం. బ్లీచింగ్ ను దీర్ఘకాలం పాటు కొనసాగించకూడదు, మీకు కావల్సిన చర్మ సౌందర్య పొందినప్పుడు బ్లీచింగ్ ను నిలిపివేయాలి. లేకపోతే , మీరు ప్రమాదకరమైన ఫలితాలను చూడాల్సి వస్తుంది. అతిగా ఉపయోగించినప్పుడు ఇది ప్రమాదకరం.
రసాయనాల సమ్మేళనం కంటే ఇంట్లో హోం మేడ్ బ్లీచింగ్ లు ఎల్లప్పుడూ ఉత్తమమైన ఎంపిక..
హోం మేడ్ ఫేషియల్ బ్లీచింగ్ లు: ఈ హోం మేడ్ బ్లీచింగ్ లను వారంలో ఒకసారి ఉపయోగించాల్సి ఉంటుంది.

తేనె: 1 టేబుల్ స్పూన్
క్రీమ్: 1 ½ టేబుల్ స్పూన్
నిమ్మరసం : 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం:
ఈ మూడింటిని ఇక మిక్సింగ్ బౌల్లో వేసి, బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఈ బ్లీచ్ ను ముఖానకి అప్లై చేయాలి. ఇది ఎండిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పసుపు : చిటికెడు
నిమ్మ రసం :కొన్ని చుక్కల
రోజ్ వాటర్: కొన్ని చుక్కల
తయారీ విధానం:
ఈ పదార్థాలన్నింటిని, ఒక మిక్సింగ్ బౌల్లో వేసి, బాగా మిక్స్ చేసి మీ ముఖానికి అప్లై చేయాలి. తడి ఆరి బాగా ఎండిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పాలు: 2 టేబుల్ స్పూన్లు
నిమ్మకాయ రసం:1 టేబుల్ స్పూన్
తయారీ విధానం:
ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పాలు మరియు నిమ్మరసం సమంగా కలుపుకోవాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి, ఈ మిశ్రమంతో ముఖం మీద బాగా రుద్దాలి. ఇది పొడిబారిన తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

గంధం పొడి: 2 టేబుల్ స్పూన్లు
నిమ్మకాయ రసం: 2 టేబుల్ స్పూన్లు
దోసకాయ రసం: 2 టేబుల్ స్పూన్లు
టమోటా రసం: 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం:
పైన సూచించిన పదర్థాలన్నింటిని మిక్సింగ్ బౌల్లో వేసి, బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. ఇది బాగా తడి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications
