జిడ్డుచర్మం కలవారు తినాల్సిన మరియు తినకూడని ఆహారాలు

యవ్వనంలో ఉండే చాలా మంది స్త్రీ, పురుషులు ఆయిల్ స్కిన్ తో బాధపడుతుంటారు. ఎక్కువగా, చర్మం క్రింద ఉండే తైల గ్రంథులు టీనేజ్ వయస్సులో ఉండే వారిలో చాలా ఎక్కువగా ఉండి మొటిమలు మరియు బ్లాక్ హెడ్స్ సమస్యలకు దారితీస్తుంది. ఇది వయ్వనంలో ఉండే వారిలో సాధారణంగా కనిపించే ఒక సహజ సమస్య, ఈ సమస్యను నివారించడానికి ఆహారం చాలా పెద్ద పాత్ర వహిస్తుంది. సరైన డైట్ ను పాటించడం వల్ల ఆయిల్ స్కిన్ కు చెక్క పెట్టవచ్చు. మరియు ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల ఈ అనారోగ్యకరమైన డైట్ వల్ల చర్మ ఆయిలీగా మారుతుంది.

కాబట్టి, మీరు ఆయిల్ స్కిన్ కలిగి ఉన్నట్లైతే, జిడ్డుచర్మంతో పోరాడగలిగే శక్తి ఆహారానికి మాత్రేమే ఉంది. సరైన ఆహారానియమాలు పాటించి, ఆరోగ్యకరమైన ఆహారం తినడం ద్వారా చర్మంలో జిడ్డుతత్వాన్ని తగ్గించుకోవచ్చు. అలా కాకుండా మీరు ఫ్యాటింగ్ ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అతి త్వరగా మీ ముఖం ఫ్రైయింగ్ పాన్ లా కనబడుతుంది. నూనెగ్రంథులను తగ్గించుకోవడానికి జిడ్డు తత్వాన్ని నివారించడానికి డైట్ ముఖ్య పాత్ర వహిస్తుంది.

చాలా మందిలో జిడ్డుగల చర్మం కోసం తీసుకొని ఆహారాలు గురించి కొన్ని ప్రాథమిక దురభిప్రాయాలున్నాయి. అన్ని ఆయిలీ ఫుడ్స్ మీ చర్మానికి తప్పనిసరిగా హాని కలిగించకపోవచ్చు. ఆయిల్ ఫుడ్స్ లో కూడా కొన్ని మంచివి, మరికొన్ని చెడువి ఉన్నాయి. కొన్ని రకాల ఆయిల్ అంటే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటివి చర్మానికి చాలా మంచిది. మరియు చర్మంలోని టాక్సిన్స్ శరీరం నుండి బయటకు నెట్టివేయబడుతాయి . అదే విధంగా కొన్ని రకాల పండ్లు మరియు కూరగాయలు కూడా చర్మానికి మంచివి కావు. మీరు మీ చర్మ తత్వాన్ని బట్టి తెలివిగా ఎంపిక చేసుకోవడం అవసరం.

ఆయిల్ స్కిన్ (జిడ్డు చర్మ తత్వం ఉన్నవారు కొన్ని తినాల్సిన మరియు కొన్ని తినకూడని ఆహారాలు క్రిందివిధంగా ఉన్నాయి...

ఆయిల్ స్కిన్ నివారించే ఫుడ్స్:

కీరదోసకాయ : తినవచ్చు

కీరదోసకాయ : తినవచ్చు

కీరదోసకాయలో 95శాతం నీరు ఉండటం వల్ల దీన్ని హాపిగా తినవచ్చు. అందువల్ల చర్మం హైడ్రేషన్ తో (తేమ)గాఉంటుంది. దాంతో చర్మం, శరీరంలోని టాక్సిన్స్ మరియు ఎక్సెస్ ఆయిల్ ను తొలగిస్తుంది.

సిట్రస్ పండ్లు:

సిట్రస్ పండ్లు:

సిట్రస్ పండ్లు ఆరెంజ్, నిమ్మ మరియు పైనాపిల్ వంటివి డిటాక్సిఫైయింగ్ గుణాలు(ప్రక్షాళను లక్షణాలు)కలిగి ఉంటాయి. ఈ పండ్లలోని విటమిన్ సి, చర్మంలోని టాక్సిన్స్ మరియు అదనపు నూనెను తొలగించడానికి బాగా సహాయపడుతుంది.

ఫ్లూయిడ్ మరియు జ్యూస్ తాగవచ్చు:

ఫ్లూయిడ్ మరియు జ్యూస్ తాగవచ్చు:

ద్రవాలు మరియు జ్యూసులు వంటివి తాగడం ఉత్తమం. ఎందుకంటే వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. చర్మంలోని జిడ్డును తొలగించుకోవడానికి ఎక్కువగా నీరుఉండే ద్రవాలు, జూసులు తాగడం ఒక ఉత్తమైన మార్గం. సూపులు మరియు జ్యూసులు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆయిల్ ఫ్రీ స్కిన్ పొందవచ్చు.

గ్రీన్ వెజిటేబుల్స్ తినవచ్చు:

గ్రీన్ వెజిటేబుల్స్ తినవచ్చు:

మీ చర్మం నుండి టాక్సిన్స్ మరియు ఆయిల్ ను బయటకు నెట్టివేయాలనుకుంటే ఫైబర్ అధికంగా ఉన్న గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి . గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ డైటరీ ఫైబర్ ను పుష్కలంగా అంధిస్తుంది. మరియు ఈ వెజిటేబుల్స్ లో కూడా మినిమమ్ ఆయిల్ లేదా ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది.

పల్స్(ధాన్యాలు):

పల్స్(ధాన్యాలు):

ధాన్యాలలో అమినో యాసిడ్స్ ఉండటం వల్ల ఇవి అధనపు షుగర్ ను చేర్చవు దాంతో చర్మంలో ఆయిల్ బ్యాలెస్ అవుతుంది. కాబట్టి ధాన్యాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు.

కోల్డ్ వాటర్ ఫిష్ తినవచ్చు:

కోల్డ్ వాటర్ ఫిష్ తినవచ్చు:

కోల్డ్ వాటర్ ఫిష్ లో ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలం. ఈ ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ చర్మంలోని టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేస్తాయి. మరియ మీ చర్మానికి తగినంత తేమను అంధించి మాయిశ్చరైజ్ గా ఉంచుతాయి.

గ్రేఫ్ ఫ్రూట్ తినవచ్చు:

గ్రేఫ్ ఫ్రూట్ తినవచ్చు:

గ్రేప్ ఫ్రూట్ లో అధికంగా నీటి శాతం మరియు విటమిన్ సి మరియు డైటరీ ఫైబర్ ఉండి, చర్మంలోని అదనపు ఆయిల్ ను సోక్ చేస్తుంది. కాబట్టి ఆయిల్ స్కిన్ గల వారికి ఇది ఫర్ ఫెక్ట్ ఫుడ్ గా పరిగిణించవచ్చు.

పచ్చికూరలు తివనవచ్చు:

పచ్చికూరలు తివనవచ్చు:

సలాడ్స్ మరియు పండ్లు తాజాగా ఉన్నవి సాధ్యమైనంత వరకూ తినాలి. ఆహారాలు తయారుచేయడానికి కొంత నూనెలు అవసరం అవుతాయి. కానీ పచ్చికూరల తినడం వల్ల ఎటువంటి నూనెలు మరియు ఫ్యాట్స్ కలిగి ఉండవు.

చాక్లెట్ తినడాన్ని నివారించాలి:

చాక్లెట్ తినడాన్ని నివారించాలి:

ప్లెయిన్ కోక మీ చర్మానికి మేలు చేయవచ్చు. కానీ తియ్యగా ఉండే కో మరియు పాలతో తయారుచేసిన చాక్లెట్స్ మీ చర్మాన్ని మరింత ఆయిలీగా మార్చుతాయి.

డీప్ ఫ్రై చేసి ఆహారాలు అవాయిడ్ చేయాలి:

డీప్ ఫ్రై చేసి ఆహారాలు అవాయిడ్ చేయాలి:

ఫ్రైడ్ చికెన్, పొటాటో, ఫిస్ వంటివి చర్మానికి చాలా హాని చేస్తాయి. డీఫ్ ఫ్రై చేసిన ఆహారాలలో ఎక్కువ నూనెలు ఉంటాయి. ఇవి శరీరంలోని త్వరగా గ్రహించబడి. చర్మరంద్రాల ద్వారా బయటకు అదనపు ఆయిల్ వచ్చేలా చేస్తాయి.

పాలిష్డ్ సెరల్స్ నివారించాలి:

పాలిష్డ్ సెరల్స్ నివారించాలి:

పాలిష్ చేసిన తెల్లని గోధులమలు, పాస్తా వంటివి నివారించాలి. ఇవి చర్మానికి హాని తలపెడుతాయి. వీటిలో ఫైబర్ తొలగించిబడి ఉంటాయి. ఇంకా ఇవి బ్లడ్ షుగర్ స్థాయిలను విరుగుడుగా ఉండి క్రమంగా ఆయిల్ స్కిన్ కు దారితీస్తుంది కాబట్టి, పాలిష్ పెట్టిన ఆహారాలను అవాయిడ్ చేయండి.

షుగర్ డ్రింక్స్ తాగడం మానేయాలి:

షుగర్ డ్రింక్స్ తాగడం మానేయాలి:

అధికంగా షుగర్ ఉన్న పానీయాలు, ఆహారాలు తీసుకోవడం వల్ల నూనెగ్రంథులు ఎక్కువగా ఉత్పన్నం అవుతాయి. దాంతో ఎక్కువ నూనెలో చర్మంలో ఉత్పత్తి అయ్యి, చర్మాన్ని జిడ్డుగా మార్చుతాయి. కాబట్టి, షుగర్ మిక్స్ చేసిన కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్ మరియు బెవరేజస్ ను నివారించండి.

డైరీప్రొడక్ట్స్ నివారించాలి:

డైరీప్రొడక్ట్స్ నివారించాలి:

బటర్, క్రీమ్, చీజ్ మరియు ఇతర పాల ఉత్పత్తులు చాలా ఆయిల్ తత్వం కలిగి ఉంటాయి. కాబట్టి మీరు ఆల్రెడీ జిడ్డు చర్మ తత్వంతో బాధపడుతుంటే కనుక, డైరీ ప్రొడక్ట్స్ ను అవాయిడ్ చేయండి. లోఫ్యాట్ పెరుగు తీసుకోవడం వల్ల చర్మానికి కొంత మేలు జరగవచ్చు.

ఫ్రైడ్ చిప్స్ నివారించాలి:

ఫ్రైడ్ చిప్స్ నివారించాలి:

ఫ్రై చేసి చిప్స్, వివిధ రకాలైన స్నాక్స్ తినడానికి చాలా గొప్పగా ఉంటాయి. కానీ వాటిలో సాచురేటెడ్ ఫ్యాట్స్ కలిగి ఉంటాయి. వాటిలో ఉండే నూనెలు, జిడ్డు మీ చర్మాన్ని మరింత ఆయిలీగా మార్చుతుంది.

ఫ్యాటీ రెడ్ మీట్ తినడం మానేయాలి:

ఫ్యాటీ రెడ్ మీట్ తినడం మానేయాలి:

రెడ్ మీట్ ఫ్యాటింగ్ ఆహారంగా పరిగణించడబడుతుంది. మాంసం లో సంతృప్త కొవ్వులు చర్మం అధిక oiliness దారితీస్తుంది. ఫ్యాట్ కలిగిన మాంసాహారం తినడం కంటే కొవ్వు తొలగించిన మాంసాహారాన్ని తీసుకోవడం ఉత్తమం.

Desktop Bottom Promotion