Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
సమ్మర్ స్కిన్ కేర్: వేసవిలో కూడా కూల్ గా కనిపించడం ఎలా..?
వేసవిలో చర్మం ఎండతాకిడికి కమిలిపోవడం, దుమ్ముధూళి పేరుకుపోవడం, పొడిబారడం లేదంటే జిడ్డుగా తయారవడం వంటి సమస్యలెన్నో తలెత్తుతుంటాయి. వీటికి విరుగుడు ఫేషియల్స్ అని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ఫేషియల్ చేయించుకోవాలనే విషయంలో బోలెడు సందేహాలూ ఉంటాయి. వేసవిలో చర్మకాంతి దెబ్బతినకుండా రిపేర్ చేయడానికి ఎలాంటి ఫేషియల్స్ చేయాలో తెలుసుకుందాం...
రిపేర్ ఫేషియల్: పొడిచర్మం గల వారికి రిపేర్ ఫేషియల్ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎండకు చర్మం త్వరగా డీహైడ్రేషన్ అవుతుంది. దీనివల్ల చర్మం మరింత పొడిబారే అవకాశం ఉంది. అలాగే వదిలేస్తే త్వరగా ముడతలు రావడం, చర్మకణాలు దెబ్బతినడం వంటివి సంభవించవచ్చు. అందుకని 20 రోజులు లేదా నెల రోజులకు ఒకసారి రిపేర్ ఫేషియల్స్ చేయించుకోవడం వల్ల చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. హీలింగ్ ఎఫెక్ట్, స్కిన్ సెల్స్ రీ గ్రోత్ ఈ ఫేషియల్ వల్ల ప్రయోజనాలు.

కూలింగ్ ఫేషియల్: ఈ కాలంలో చెమట వల్ల ఆయిలీ స్కిన్ మరింత జిడ్డుగా తయారవుతుంది. అందుకని వీరు కూలింగ్ ఫేషియల్స్ వాడచ్చు. ఆక్సిజన్ ఫేషియల్ కూడా వీరికి బెస్ట్ ఆప్షన్.
ఫ్రూట్ ఫేషియల్: సాధారణ చర్మతత్త్వం గలవారు ఏ ఫ్రూట్ ఫేషియల్ అయినా ఉపయోగించవచ్చు. ఫ్రూట్ ఫేషియల్స్‌లో బనానా, మ్యాంగో, పీచ్, వాటర్‌మెలన్, బ్లాక్‌బెర్రీ... ఇలా అన్ని రకాల ఫ్రూట్ ఫ్లేవర్ ప్రొడక్ట్‌ను వాడవచ్చు.
చాక్లెట్ ఫేసియల్: వేసవిలో చర్మం ఎక్కువగా ట్యాన్ అవుతుంది. దీనికి విరుగుడుగా చాక్లెట్ ఫేషియల్ చేయించుకోవచ్చు. అలాగే ఆక్సిజన్, డీ-ట్యానింగ్, అరోమా ఫేషియల్స్‌నూ ట్రై చేయవచ్చు.
బేసిక్ ఫేసియల్:
క్లెన్సింగ్
స్క్రబ్బింగ్
ఆవిరిపట్టడం
బ్లాక్ హెడ్స్‌ను తొలగించడం
మసాజ్
ఫేస్‌ప్యాక్
ఈ పద్ధతిలో ఇంట్లో కూడా ఫేషియల్ చేసుకోవచ్చు. అయితే నాణ్యమైన సౌందర్య ఉత్పత్తులతో నిపుణుల ఆధ్వర్యంలో ఫేషియల్స్ చేయించుకుంటే సరైన ప్రయోజనాలను పొందుతారు.
ఫేషియల్ తర్వాత:
1. ఏ ఫేషియల్ అయినా సరైన ప్రయోజనం ఇవ్వాలంటే నాణ్యమైన ఉత్పత్తులను ఎంచుకోవాలి.
2. నిపుణుల పర్యవేక్షణలో ఫేషియల్ చేయించుకోవాలి.
3. ఫేషియల్ చేయించుకున్న 5 గంటల వరకు సబ్బు, ఫేస్‌వాష్‌లను ఉపయోగించకూడదు.
4. మేకప్ వేసుకోవాలనుకునేవారు ఫేషియల్ చేయించుకున్నాక 24 గంటల వ్యవధి ఇవ్వాలి.
5. చెమటను తుడుచుకోవడానికి టిష్యూ పేపర్స్‌ను ఉపయోగించాలి
6. బయటకు వెళ్లడానికి ముందు సన్‌స్క్రీన్ లోషన్‌ను వాడాలి.



Click it and Unblock the Notifications
