Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
చర్మరంగులోని మార్చే గృహ నివారణోపాయాలు
వజ్రాలు ఆడపిల్లకు మంచి స్నేహితులని మీరు భావిస్తున్నట్టైతే తిరిగి ఆలోచించండి! స్వచ్చమైన మేని ఛాయ, తాజా చర్మ౦ కంటే వేరేమీ ప్రతిష్టాత్మకమైనది లేదు. కాని కొన్ని సార్లు చర్మపు రంగు వంటి కొన్ని లోపాలు మీలో అసమానమైన, మచ్చల చర్మాన్ని కల్గించవచ్చు. ఈ సమస్యను అధిగమించడానికి బజారులో అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాని ఏదైనా రసాయన చికిత్సను ఎంపిక చేసుకొనే ముందు, ఇంట్లోనే సెలూన్ తరహా సౌందర్యాన్ని అందించే కొన్ని సులువైన చికిత్సలను గురించి మీకు చెప్పనివ్వండి.
చర్మం రంగు అంటే స్వతహాగా చర్మం రంగు మారి దీని వలన అసమానమైన చర్మపు రంగుకు దారి తీయడం. ఈ చర్మపు రంగు మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. చర్మపు రంగు జన్యు పరంగా సిద్ధించి ఉండవచ్చు. ఎండలో ఎక్కువగా తిరగడం, ఒత్తిడి, మొటిమల మచ్చలు, హార్మోనుల స్థాయిలోని హెచ్చుతగ్గులు లేదా కాలుష్యం వంటి వాతావరణ మూలకాలు, దీనికి ఇతర కారణాలై ఉండవచ్చు.

దీనికి మీరేం చేయాలి!
ఎక్కువగా ఎండలో తిరగకండి.
ఎస్ పి ఎఫ్ 30 ఉన్న సన్ స్క్రీన్ లోషన్ ను ప్రతి రోజు వాడండి.
ఒక వేళ మీరు బయట ఉన్నట్టయితే ప్రతి మూడు గంటల కొకసారి సన్ స్క్రీన్ లోషన్ ను తిరిగి పూయండి.
రాత్రి వేళ్ళలో ఖచ్చితమైన సంరక్షణను పాటించండి. ట్రెటినోయిన్ లేదా కోజిక్ వంటి ఆమ్లాలు ఉన్న క్రీమును వాడండి.
1. కేరెట్ గుజ్జును, ముల్తానా మట్టితో (ఫుల్లర్ మట్టి) కలిపి ఒక చిక్కటి గుజ్జుగా తయారు చేయండి. ఒక విటమిన్ సి బిళ్ళను పొడి చేసి కలపండి. మీ ముఖం పైన పూసి, కడగడానికి ముందు ఇరవై నిముషాల పాటు ఉంచండి. ఇలా ప్రతి వారం చేయండి.
2. 4 టీ స్పూనుల పాల పిండిని తీసుకొని, హైడ్రోజన్ పెరాక్సైడ్ తో కలిపి పేస్ట్ లా చేయండి. దీనికి గ్లిసరిన్ కలిపి చర్మం రంగు మారిన ప్రదేశాలలో పూయండి. దీనిని 15-20 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత చల్లటి నీటితో కడగండి. హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్లిసరిన్ ఔషధాల దుకాణాల్లో సులువుగా లభ్యమౌతాయి.
3. ఒక బంగాళదుంపను తోలు తీసి కొన్ని చుక్కల నీటిని దాని పైన వేయండి. చర్మం పైన మచ్చలుగా ఉన్న ప్రాంతంలో రుద్దండి. బంగాళదుంప రసం చర్మం పై ఉన్న మచ్చల రంగును తగ్గించేందుకు దోహదం చేస్తుంది.
4. ఓట్ మీల్ పొడిని, పెరుగుతో కలిపి కొన్ని చుక్కల నిమ్మరసం, టమోటా రసం కూడా కలపండి. ఆశించిన ఫలితాలను సాధించడానికి వారానికొకసారి దీనిని ప్రభావిత ప్రాంతాలలో పూయండి.
5. తులసి ఆకులను, నిమ్మరసంతో కలిపి చర్మం రంగులోని మచ్చలను తగ్గించడానికి ప్రభావితప్రాంతాలలో పూయండి.
6. ఆలివ్ ఆయిల్ లో కలిపిన పంచదారతో మీ శరీర౦ పై రుద్దండి. పంచదార పూర్తిగా కరిగే దాక రుద్దాలి. దీన్ని మీ చేతులు, కాళ్ళు, మెడ, శరీరంలోని ఇతర ప్రభావిత ప్రాంతాలలో వాడవచ్చు.
7. నిమ్మరసం, తేనే, బాదం నూనె ప్రతీదీ ఒక టీ స్పూన్ తీసుకోండి. సహజసిద్ధమైన మెరిసే చర్మం కోసం దీనిని మీ ముఖంపై పదిహేను నిమిషాల పాటు మర్దన చేయండి.
8. తగినన్ని మంచి నీళ్ళు తాగడం వలన మీ శరీరంలోని మలినాలు తొలిగిపోతాయి. తద్వారా అన్ని చర్మ సమస్యల నుండి విముక్తి కలుగుతుంది
9. పచ్చి బొప్పాయిను పచ్చి పాలతో కలిపి పది నిమిషాల పాటు ముఖంపై మర్దన చేయండి. ఈ లేపనం .మీ చర్మం పైన మచ్చలకు ప్రభావవంతమైన చికిత్స.
10. మజ్జిగతో మొహాన్ని కడగడం వలన కూడా నల్ల మచ్చలను తగ్గించుకోవచ్చు.
ఈ సులువైన గృహ నివారాణోపాయాల ద్వారా చర్మపు రంగులోని అసమానతలను తగ్గించకోవడానికి ప్రయత్నించండి. క్రమబద్దమైన చర్మ సంరక్షణ, ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం, మీ తరుఫున కొన్ని చర్మసంరక్షణ జాగ్రత్తలు మీ చర్మం లోని సహజ మెరుపును కాపాడుకోవడానికి సాయపడతాయి.



Click it and Unblock the Notifications