Latest Updates
-
భార్య వేధింపులు భరించలేక టెక్కీ ఆత్మహత్య: అసలేం జరిగింది? -
సమ్మర్ లో దొరికే అరుదైన పండు..బీపీ కంట్రోల్, జీర్ణక్రియ నుంచి కాలేయ సంరక్షణ వరకు బోలెడు ప్రయోజనాలు -
నారద జయంతి: వ్యతీపాత యోగంతో ఈ రాశుల వారికి రాజయోగం.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
ఇలా టమాటా రసం చేస్తే పళ్లెంలో అన్నం నిమిషాల్లో ఖాళీ అవ్వాల్సిందే! -
హైదరాబాద్ టెక్కీ రాసిన 19 పేజీల నోట్… ఆ ఒక్క నిర్ణయం వెనుక ఉన్న భయంకరమైన నిజం ఇదే! -
సమీరా రెడ్డి చేసిన గోవా స్పెషల్ మ్యాంగో కొబ్బరి కర్రీ..అన్నంలోకి అమృతమే..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
మేషరాశిలో బుధాస్తమయం: ఈ 26 రోజులు డిజిటల్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండండి! -
ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనయోగం.. పట్టిందల్లా బంగారం కాబోతోంది..! -
పుచ్చకాయ తింటూ ఈ 3 తప్పులు చేస్తే మీ ప్రాణాలకే ముప్పు! -
నారద జయంతి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి!
మొటిమల తొలగింపుకు 20 బెస్ట్ హోంమేడ్ ఫేస్ మాస్క్
సాదారణంగా యవ్వనంలో హార్మోన్ల మార్పులు మరియు అసమానతల వలన మొటిమలు రావటం జరుగుతుంది. యవ్వనంలో మొటిమలు కలిగి ఉంటె చర్మం పట్ల సరైన శ్రద్ధ వహించాలి. టీనేజ్ లో మొటిమల గుర్తులు మరియు మచ్చలు వెంటాడుతూ ఉంటాయి. అందమైన చర్మం కొరకు ఆరోగ్య ఔత్సాహికుడు డానా స్మిత్ చెప్పిన ఈ సాధారణ చిట్కాలను అనుసరించండి.

# 1: గంధం మాస్క్
కావలసిన వస్తువులు:
గంధపు పొడి
రోజ్ వాటర్
పద్దతి:
1. గంధపు పొడి,రోజ్ వాటర్ ను బాగా కలిపి ముఖానికి రాయాలి.
2. ఒక గంట కంటే ఎక్కువ సేపు ఉంచుకోండి.
3. తర్వాత నీటితో పూర్తిగా శుభ్రం చేసుకోవాలి.

# 2: మెంతి పేస్ట్
కావలసిన వస్తువులు:
మెంతి ఆకులు
పద్దతి:
1. మెంతి ఆకులను పేస్ట్ గా చేసి ముఖానికి రాయాలి.
2. 30 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి.

# 3: కూలింగ్ ప్యాక్
కావలసిన వస్తువులు
మెంతులు
పద్దతి:
1. నీటిలో మెంతులు వేసి బాగా మరిగించి చల్లారిన తర్వాత ఆ నీటిని ఉపయోగించండి.
2. ఆ నీటిని మీ ముఖంనకు రాయండి. మీ ముఖం ఆరిన తర్వాత మాత్రమే తుడవాలి.

# 4: ఆలివ్ నూనె మేజిక్
కావలసిన వస్తువులు:
ఆలివ్ నూనె
పద్దతి:
1. ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి రోజు ఆయిల్ మసాజ్ చేయండి.
2. ఇది చర్మం ఆకృతిని మృదువుగా ఉంచటానికి తేమ లక్షణాలు కలిగి ఉంటుంది. మొటిమల మచ్చలు యొక్క ప్రాముఖ్యతను తగ్గిస్తుంది.

# 5: కలబంద రసము
కావలసిన వస్తువులు:
కలబంద రసము
పద్దతి:
1. కలబంద మొక్క రసం మొటిమల మచ్చల మీద పోరాటం మరియు నయం చేయటంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
2. కాలక్రమేణా చెడు మొటిమల యొక్క గుర్తులు చెరిపివేయడానికి ఒక క్రమ పద్ధతిలో రసం రాస్తూ ఉండాలి.

# 6: తేనె చికిత్స
కావలసిన వస్తువులు:
తేనె
పద్దతి:
1. మచ్చలు ఉన్న ప్రదేశంలో తేనెను రాయాలి.
2. కొంత సమయం వరకు అలా ఉంచి తర్వాత ముఖంను శుభ్రం చేసుకోవాలి. తేనేలో బాక్టీరియా లక్షణాలు ఉన్న కారణంగా మచ్చలు తగ్గటానికి సహాయపడుతుంది.

# 7: నిమ్మకాయ పరిష్కారం
కావలసిన వస్తువులు:
నిమ్మరసం
పద్దతి:
1. మచ్చలు ఉన్న ప్రదేశంలో నిమ్మ రసం రాసి ఆరిన తర్వాత ముఖంను శుభ్రం చేసుకోవాలి.

# 8: రోజ్ వాటర్ టోనర్
కావలసిన వస్తువులు
రోజ్ వాటర్
పద్దతి:
1. మీ వద్ద రోజ్ వాటర్ లేకపోతే మరిగే నీటిలో కొన్ని గులాబీ రేకులను వేసి తయారు చేసుకోవచ్చు.
2. ఇలా తయారుచేసిన రోజ్ వాటర్ ను మీ ముఖంపై రాయాలి.

# 9: శుభ్రపరచడానికి బంగాళాదుంప
కావలసిన వస్తువులు:
బంగాళాదుంప
పద్దతి:
1. కొన్ని బంగాళాదుంపలను తీసుకోని తురిమి పేస్ట్ చేయాలి.
2. ప్రభావిత ప్రాంతంలో బంగాళాదుంప పేస్ట్ ను రాసి బాగా ఆరిన తర్వాత ముఖంను శుభ్రం చేసుకోవాలి.

# 10: హైడ్రేట్
ప్రతి రోజు సాధ్యమైనంత ఎక్కువ నీటిని త్రాగాలి. తగినంత ఆర్ద్రీకరణ మీ చర్మాన్ని మెరుగుపర్చడానికి మరియు ఆ మచ్చలు పోవటానికి సహాయం చేస్తుంది.

# 11: కూరగాయల జూస్ త్రాగండి
కూరగాయలలో పోషకాలు మరియు ప్రోటీన్ల గొప్ప వనరులు ఉన్నాయి. కాబట్టి కూరగాయల జూస్ ను ఒక వారంలో కనీసం 3-4 సార్లు త్రాగండి. మీకు ఒక ఆరోగ్యకరమైన ఛాయ ఇవ్వడానికి సహాయపడుతుంది.

# 12: గ్రీన్ టీ
గ్రీన్ టీ శరీరం నుండి టాక్సిన్లు తొలగించడానికి ఒక సహజ మార్గంగా ఉంది. అందువలన మచ్చలు మరియు నిస్తేజంగా ఉన్న చర్మాన్ని వదిలించుకోవటానికి ప్రతిరోజు 1-2 కప్పుల గ్రీన్ టీ త్రాగండి.

# 13: టమోటో థెరపీ
కావలసిన వస్తువులు:
టమోటో
పద్దతి:
1. టమోటా స్లైస్ తో మీ ముఖాన్ని బాగా రుద్దండి.
2. కొంత సమయం అయిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేయండి.

# 14: ఐస్ క్యూబ్
కొన్ని ఐస్ క్యూబ్ లను తీసుకోని ప్రతి రోజు మచ్చల మీద సున్నితంగా రుద్దాలి.

# 15: క్రమం తప్పకుండా వ్యాయామం
ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల మీరు అధిక బరువు తగ్గటమే కాకుండా మొటిమల నియంత్రణకు సహాయపడుతుంది.

# 16: తేయాకు మొక్క తైలం
తేయాకు మొక్క తైలం తీసుకొని ప్రభావిత ప్రాంతాల్లో రాయాలి. రాత్రిపూట రాసి వదిలివేయాలి. మంట మరియు ఎరుపుదనం తగ్గటానికి సహాయపడుతుంది.

# 17: మీ ముఖంను శుభ్రంగా ఉంచండి
ఆరుబయట నుండి వచ్చిన తర్వాత మీరు ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయుట వల్ల బాక్టీరియా మరియు ధూళి వదిలించుకోవటం కొరకు సహాయపడుతుంది.

# 18: మేకప్ తొలగించండి
మీరు మేకప్ వేసుకున్నప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే దానిని శుభ్రం చేసుకోవాలి. చాలా కాలం ఒకే ఉత్పత్తిని ఉపయోగించకూడదు. ఆయిల్ ఆధారిత ఉత్పత్తులను ఉపయోగించడం మానుకోండి.

# 19: మీ ముఖాన్ని స్పృశించడం మానుకోండి
మీరు నిరంతరం ముఖాన్ని తాకడం ద్వారా మొటిమల గురించి చింతిస్తూ ఉంటే మరింత పెరుగుతాయి. అంతేకాకుండా అది మచ్చలు మరియు వాపుకు దారి తీస్తుంది. కాబట్టి పరిస్థితిని నివారించేందుకు మీ ముఖాన్ని స్పృశించడం మానుకోండి.

# 20: బేకింగ్ సోడా
కావలసిన వస్తువులు:
బేకింగ్ సోడా
నీరు
పద్దతి:
1. ఒక గిన్నెలో బేకింగ్ సోడా,నీరు కలిపి పేస్ట్ లా తయారు చేయాలి. ఈ పేస్ట్ ను ముఖం మీద రాయాలి.
2. 20 నిమిషాల తర్వాత మోస్తరు నీటితో మీ ముఖంను కడగాలి.



Click it and Unblock the Notifications