Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
చర్మ అందాన్నిపాడు చేసే బ్యాడ్ స్కిన్ హ్యాబిట్స్
ప్రతి మనిషికి కొన్ని అలవాట్లు ఉంటాయి. స్త్రీలకు ఒక విధమైన అలవాట్లుంటే, పురుషులకు ఒక విధనమైన అలవాట్లు ఉంటాయి. కొన్ని అవాట్లు మంచివైతే, మరికొన్ని అవాట్లు చెడువి అవుతాయి. అవాట్లలో మంచివి ఎప్పుడూ నిలిచిఉంచుకోవాలి అయితే, చెడుఅవాట్లకు ఎప్పుడూ దూరంగా ఉండాలి. చాలా మందికి ఉండే కొన్ని నిజమైన చెడు అలవాట్లు వారి చర్మ అందాన్ని పాడుచేస్తాయి. కాబట్టి ఫర్ ఫెక్ట్ గ్లో కోరుకునే ప్రతి ఒక్కరూ అటువంటి చెడు అవాట్లకు దూరంగా ఉండాలి.
ఈ చెడు అలవాట్లలో కొన్ని అలవాట్లు అంతర్గతంగా ఉన్నాయి. వీటిని నుండి బయటపడటం కొంచెం కష్టం అవుతుంది. జీవితంలో ప్రతి యొక్క అంశం చర్మం మీద ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు సరైన సమయానికి రాత్రిళ్లో నిద్రపోకపోతే అది మీ చర్మం డల్ గా కనబడేలా చేస్తుంది. అలాగే మీరు రోజుకు సరిపడా నీళ్ళు త్రాగపోతే, చర్మం పొడిబారుతుంది. కాబట్టి, ఆరోగ్యకరమైన జీవనశైలితోనే, ఆరోగ్యకరమైజ చర్మాన్ని పొందవచ్చు.
మీరు కాంతివంతమైన చర్మ సౌందర్యాన్ని పొందాలంటే, మీరు ఇప్పటి నుండి మీ అలవాట్లను మార్చుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా మీరు మీ అలవాట్లు ను మార్పు చేసుకొనే ప్రారంభంలో ముఖ్యంగా చర్మానికి హానికలిగించే అలవాట్లను మానుకోవడంతో ప్రారంభించండి. చర్మానికి హాని కలిగించే కొన్ని అలవాట్లు మీరు నిత్యం చేసేవైనా మీకు తెలియకపోవచ్చు. కాబట్టి, కొన్ని బ్యాడ్ స్కిన్ హ్యాబిట్స్ లిస్ట్ అందిస్తున్నాము. వాటిని వెంటనే మీరు మానుకోవడం ఉత్తమం..

చాలా తక్కువగా నీళ్ళు త్రాగడం
చర్మం తేమగా ఉంటేనే కాంతివంతంగా కనబడుతుంది. మీరు తక్కువగా నీళ్ళు త్రాగినప్పుడు, మీ చర్మం పొడి బారి మరియు రఫ్ గా ఉంటుంది. మరియు మొటిమలు, మచ్చలకు దారితీసి మీ చర్మంలో టాక్సిన్స్ చేరుతాయి.

ఎప్పుడూ కోపంతో ఉండటం
మీరు చీటికిమాటికి కోప్పడటం వల్ల మీ ముఖంలో అనేక ముడుతలకు దారితీస్తుంది. కాబట్టి ఎప్పుడూ నవ్వుతుండండి.

స్మోకింగ్
సిగరెట్ త్రాగడం వల్ల అనేక టాక్సిన్స్ ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మానికి కూడా చాలా హానికలిగిస్తాయి. స్మోకింగ్ వల్ల మీ చర్మం త్వరగా వయస్సైనవారిలా కనబడలా చేస్తుంది మరియు చర్మం ప్యాచ్ లుగా కనబడేలా చేస్తుంది.

సన్ స్ర్కీన్ లోషన్ రాయకపోవడం
చర్మానికి సన్ స్ర్కీన్ లోషన్ రాయకపోవడం కూడా చర్మ సంరక్షణలో ఒక లోపమే. సూర్యుని నుండి వెలువెడే యూవీ కిరణాలు మీ చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయి. మరియు ఇది ట్యాన్ కు గురిచేసి, ముడుతలకు కారణం అవుతుంది.

బ్లాక్ హెడ్స్ ను గిల్లడం
బ్లాక్ హెడ్స్ ఉండం వల్ల మీ చర్మం క్లియర్ గా కనబడనియ్యదు. దాంతో మీ ముఖ్యం ప్యాక్ మార్క్ లాగా కనబడుతుంది.

ఎక్కువగా ఎక్స్ ఫ్లోయేట్ చేయడం
ప్రతి రోజూ స్ర్కబ్బింగ్ లేదా ఎక్స్ ఫ్లోయేట్ చేయడం వల్ల అది చర్మానికి ఆరోగ్యకరం కాదు. ఎక్కువగా స్ర్కబ్బింగ్ చేయడం వల్ల అది మీ చర్మాన్ని మరింత పొడిగా మార్చుతుంది.

టోనర్ ఉపయోగించకపోవడం
స్ర్కబ్బింగ్ చేసుకొన్న తర్వాత మీరు టోనర్ ను ఉపయోగించడం మర్చిపోతే చర్మరంధ్రాలు మరింత పెద్దగా కనబడే అవకాశం ఉంది . ఇది మరిన్ని మొటమిలకు మరియు బ్లాక్ హెడ్స్ కు దారితీస్తుంది.

కూరగాయలను తినకపోవడం
ఫ్రెష్ గా ఉన్న వెజిటేబుల్స్ మీకు చర్మానికి చాలా బెస్ట్. మీరు వెజిటేబుల్స్ తినడం మానేస్తే, మీరు ఎప్పటికి ప్రకాశించే చర్మ సౌందర్యాన్ని పొందలేరు.

సరైన నిద్రలేకపోవడం
ప్రతి ఒక్క అమ్మాయికి తగినంత నిద్ర ఖచ్చితంగా అవసరం అవుతుంది. తగినంత నిద్రపోవడం వల్ల మీ చర్మ కణాలు ప్రకాశవంతంగా మారుతాయి. మీరు సరైన నిద్రను పొందకపోతే, చర్మం డల్ గా మరియు డార్క్ సర్కిల్స్ తో అందవిహీనంగా మారుతుంది.

ఆల్కహాల్
ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడా మీ చర్మానికి మంచిది కాదు. ఆల్కహాల్ మిమ్మల్ని ఉబ్బుగా ఉండేట్లు కనబడేలా చేస్తుంది మరియు త్వరగా వయస్సైన వారిలా కనబడేలా చేస్తుంది.

జంక్ ఫుడ్
జంక్ ఫుడ్ లో ట్రాన్స్ ఫ్యాట్స్ మరియు టాక్సిన్స్ ఉన్నాయి. మీరు ప్రకాశించే చర్మాన్ని కోరుకుంటున్నట్లైతే, మీరు జంక్ ఫుడ్స్ తీసుకోవడం మానేయాలి.

బ్యాడ్ మేకప్
ఎక్కువగా మేకప్ వేసుకోవడం లేదా చెడుగా మేకప్ వేసుకోవడం వల్ల మీ చర్మ అందాన్నిపాడు చేస్తుంది. మేకప్ వల్ల మీ చర్మానికి తగినంత గాలి చొరబడనియ్యదు. దాంతో మీ చర్మం కఠినంగా మరియు డల్ గా కనబడుతుంది. దాంతో స్కిన్ డ్యామేజ్ అవుతుంది.

మొబైల్ ఫోన్స్ కు వ్యసనపరులుగా మారడం
24/7మీరు మొబైల్ కే పరిమితం అయితే, హానికరమైన రేడిషన్ మీ చర్మ అందాన్ని పాడు చేస్తుంది. మొబైల్ చేతుల్లో పెట్టుకొని మాట్లాడం లేదా ఇయర్ ఫోన్స్ తో మాట్లాడటం, చర్మ అందానికి మేలు చేస్తుంది.

ముఖాన్ని రాత్రిళ్ళో కడుక్కోకపోవడం
చర్మం క్రింద ఉండే నూనె గ్రంథులు నిరంతరం నూనె ఉత్పత్తి చేస్తుంటాయి. కాబట్టి, రాత్రిళ్ళో నిద్రించే ముందు ముఖం శుభ్రం చేసుకోవడం వల్ల ఇది చర్మం మీద జిడ్డు మరియు మురికిని తొలగిస్తుంది.

ఐ క్రీమ్ వాడకపోవడం
మీ కళ్ళక్రింది భాగంలో చర్మం చాలా పలచగా మరింత సున్నితమైనదిగా ఉంటుంది. కాబట్టి, కళ్ళక్రింద క్రీమ్ ను అప్లై చేయడం మంచి అలవాటు.



Click it and Unblock the Notifications
