Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వృద్ధాప్యలక్షణాలను నివారించి చర్మ సౌందర్యం పెంచే చందనం
సాండిల్ ఉడ్ లేదా చందనంను సౌందర్య ఉత్పత్తిగా కొన్ని వేల సంవత్సరాల నుండి ఉపయోగిస్తున్నారు. చందనం పట్టు వేసుకుంటే చలువ చేసి, తల నొప్పి తగ్గుతుందని మన బామ్మలు వైద్యం చేస్తుండేవారు. ఆరోగ్యానికే కాకుండా, అందానికి సైతం చందనం వాడుకలో ఉంది. పరిమళాలీనే చంద నం, భారతీయుల మనసుల్లో ఒక ప్రముఖస్థానాన్ని ఆక్రమించే ఉంది. పూజల తరువాత నుదుట పెట్టుకు నే తిలకంగానో, వేసవిలో ఎండ వేడిమి తట్టుకునేందుకు లేపనంగానో అందరూ వాడుతున్నాము. చందనం లోని యాంటి సెప్టిక్ గుణాల వల్ల, రకరకాలుగా దాన్ని ఉపయోగించుకుంటున్నాము. చందనం వేసవిలో సూర్యరశ్మిలోని అల్ట్రా మయొలెట్ కిరణాలు నుంచి చర్మానికి రక్షణ కలిగిస్తుంది. అందుకని చందనం కలిసిన సన్‌లోషన్స్ వాడుతున్నారు. సౌందర్యసాధనంగా చందనం గురించి తెలుసుకుందాం.
చందనంను సౌందర్యం కోసం వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. దీన్ని ఒక ప్రకృతి ప్రసాధించిన వరాల్లో ఇది ఒకటిగా సౌందర్య సాధానాల్లో ఒక నేచురల్ పదార్థంగా దీన్ని ఉపయోగిస్తున్నారు. ది.చందనాన్ని చాలామంది వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. టాల్కం పౌడర్లు, సబ్బులు, అగరుబత్తులు, ఫేస్‌క్రీములు మరియు హ్యాండ్ వాష్ వంటి వాటి తయారీలో చందనం విరివిగా వినియోగించబడుతోంది. అదే సమయంలో మెరుగైన అందాన్ని ఇవ్వడానికి కూడా చందనం ఉపయోగపడుతుందని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. చందనంలో సువాసన భరితంతో ఎక్కువ సమయం నిల్వ ఉంటుంది. అందుకే వాటిని రూమ్ ఫ్రెష్నర్స్ లో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు.
బ్యూటీ ఉత్పత్తుల్లో చందనం ను ఉపయోగించినప్పుడు, దీనితో పాటు మనం మరికొన్ని హోం మేడ్ ప్రొడక్ట్స్ ను కూడా ఉపయోగించుకోవచ్చు. చర్మ సంరక్షణలో బాగంగా దీన్ని ఇతర వస్తువులతో ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అంతే కాదు చర్మంకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని రకాల చర్మ తత్వాలకు నప్పుతుంది. మరియు సురక్షితం కూడా. అందుకు అనేక శాండిల్ ఉడ్ పౌడిల్ ఉడ్ పౌడర్ మరియు సాండిల్ ఉడ్ ఆయిల్స్ లో ఉపయోగిస్తున్నారు. మరి ఈ శాండిల్ ఉడ్ చర్మానికి ఎలా ప్రయోజనం చేకూర్చుతుందో ఒకసారి చూద్దాం...

యాంటీ టానికంగ్ : సన్ టానింగ్ వల్ల చర్మం తర్వాత నల్లగా మారడం మరియు వయస్సు మీదపడుతున్నట్లు అనిపించడం. ఈ సమస్యలను నివారించడానికి చందనం ఉత్తమ ఎంపిక . చందనంను తేనె, నిమ్మరసం మరియు పెరుగు మిశ్రమంతో మిక్స్ చేసి ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి . ఇది చర్మాన్ని స్మూత్ గా ఉంచడంతో పాటు టానింగ్ ఎఫెక్ట్ ను నివారిస్తుంది.
యాంటీ ఏజింగ్ : చర్మం రంధ్రాలను నివారించడంలో ఫేస్ ప్యాక్ లో చందనం ఉపయోగించడం ఉత్తమం. చర్మ సంరక్షణ చిట్కాల్లో చందనం బాగా సహాయపడుతుంది. చర్మం మీద ఎటువంటి వృద్ధాప్య లక్షణాలు కనబడినయకుండా చేయాలంటే, గుడ్డు సొనలో తేనె, చందనం మరియు ఆలివ్ ఆయిల్మిక్ చేసి ముఖానికి అప్లై చేసి తర్వాత శుభ్రం చేసుకోవాలి.
చర్మం నునుపుగా మార్చుతుంది: శాండిల్ వుడ్ ఆయిల్ మసాజ్ చేయడం వల్ల చర్మం సాఫ్ట్ గా మారుతుంది.ఆయిల్ మసాజ్ చేసిన రెండు గంటల తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ప్రిక్లీ హీట్ తగ్గిస్తుంది: వేసవిలో ఎండవేడిమి నుండి ప్రిక్లీ హీట్ నుండి శాండిల్ వుడ్ రక్షిస్తుంది. చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది. అందుకే వేసవిలో దీన్ని ఎక్కువగా లేపనగంగా రాసుకుంటారు. వేడికి గురైన ప్రదేశంలో శాండిల్ వుడ్ లేపనం రాసుకుంటే, ఉత్తమ ఫలితం ఉంటుంది.
మొటిమలు నివారిస్తుంది : ముఖంలో మొటమలు మచ్చలను నివారించడానికి చందనం గొప్పగా సమాయపడుతుంది. అందువో అనేక బ్యూటి ఉత్పత్తుల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మొటిమలను తక్షణం నివారించాలంటే, పసుపు లేదా కుంకుమ పువ్వులో చందనం మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
చర్మ దరుద నుండి ఉపశమనం: చర్మ దురదతో బాధపడుతున్నారా? చందనంను లేపనంగా రాయడం వల్ల మంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. అందుకు నిమ్మరసం, పసుపు, చందనం మిక్స్ చేసి, లేపనం రాసి, అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.
చర్మం ప్రకాశవంతంగా మార్చుతుంది: నేచురల్ గా మనకు అందుబాటులో ఉండే వస్తువులు మనకు నేచురల్ అందాన్ని ప్రసాధిస్తాయి. అటువంటి వస్తువుల్లో చందనం ఒకటి. చందనంతో బాదం, పాలు, తేనె, నిమ్మరసం లేదా పసుపు మిక్స్ చేసి ప్యాక్ వేసుకొని అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.



Click it and Unblock the Notifications