Latest Updates
-
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది!
మొటిమలను నివారించడానికి హెర్బల్ రెమెడీస్
ఈ సీజన్‌లో డ్రై స్కిన్ వాళ్ళకు చర్మం పొడిబారి, ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంట్లోనే తయారుచేసుకునే ఈ ఫేస్‌ప్యాక్ వేసుకుంటే సమస్య క్రమేపీ తగ్గుతుంది. సాధారణంగా ఇంట్లో పండ్లు మరియు వెజిటేబుల్స్ తోటి ఫేస్ ప్యాక్ వేసుకోవడం కామన్. అయితే హెర్బల్స్ తోటి కూడా ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల శీతాకాలంలో చర్మాన్ని రక్షించుకోవచ్చు. పరిసరాల్లో మనం సాధారణంగా పెచ్చుకొనే మొక్కల ఆకులను తీసి పేస్ట్ చేసి ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వలన నేచ్యురల్ గ్లో ఇనుమడింప చేస్తుంది మరి ఈ టాప్ 5 హెర్బల్స్ తోటి ట్రై చేసి చూడండి...

1. నిమ్మపండు- ప్రకృతిలో సహజంగా సీజన్ మొత్తంలో లభించేది నిమ్మపండు. నిమ్మపండులో సిట్రస్ ఆమ్లఉంటుంది కాబట్టి ఇది పింపుల్స్, స్కార్స్ వంటివి పోగొట్టి పేస్ ఎప్పుడూ ఫ్రెష్ గా ఉండేటట్లు చేస్తుంది. నిమ్మ ఆకులు, నిమ్మ పౌడర్ పెరుగు లేక కీరకాయ రసంతో కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ లా వేసుకొని 20 నిమిషాలు పాటు అలాగే ఉంచుకొని తర్వాత రోజ్ వాటర్ తో ఫేష్ వాస్ చేసుకోవాలి.
2. పొదీనా- ఏ సీజన్ లో అయినా పుదీనా దొరుకుతుంది. పుదీనాతో ఎల్లవేళలా ముఖంను చల్లగా ఉంచుతుంది. పుదీనా బ్యాక్టీరియాను చంపుతుంది. చర్మం లోపల దాగిఉన్న దుమ్ము, దూళి, క్రిములను వెలికితీస్తుంది.
3. తులసి- ముఖ్యంగా కఫం పడుతున్న వ్యాధులపై తులసి అద్భుతంగా పనిచేస్తుంది. రక్తంతో కూడిన దగ్గు, కఫం పడుతున్నప్పుడు తులసి ఆకులు నాలుగు చొప్పున ప్రతిగంట గంటకూ తింటే దగ్గు, ఇతర సమస్యలు తగ్గుముఖం పడతాయి. కడుపులోని క్రిములను పారదోలే శక్తి తులసికి ఉంది. తులసిని వాడితే క్రిములు తొలగడమే కాక రక్తహీనత కూడా నివారించబడుతుంది.
4. కొత్తమిర- ఆహార పదార్థాల మీద అలంకరించుకోవడానికని భావిస్తే పొరబాటే. మనం తీసుకునే అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరల వంటకాల్లో విరివిగా వేసి తీసుకోవచ్చు. కొత్తిమీర నిండా విటమిన్లు, ఖనిజ లవణాలున్నాయి. అంతేకాదు సమృద్ధిగా ఐరన్ కూడా లభిస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. పొగతాగడం, అలాగే కిమోథెరపీ(రసాయనాలతో చికిత్స చేయడం) వల్ల కలిగిన నష్టం తగ్గించడానికి ఇది పోరాడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించడంలో, రక్త నాళాల్లో ఆటంకాలను తొలగించడంలోనూ కొత్తిమీర ఉపయోగపడుతుంది.
5. వేపాకు: వేపాకు రసం ముఖవర్చస్సుకు మరింత తోడ్పాటునందిస్తుంది. ముఖంపై వ్యాపించే మొటిమలతో పాటు నల్లటి మచ్చల నివారణకు వేపాకు సారం బేషుగ్గా పనిచేస్తుంది. వేపాకు రసంలో చందనాన్ని జోడించి ముఖానికి ఆప్లై చేయండి. అరగంట తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరిస్తే సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
6. తేనె: తేనెలో చిటికెడు దాల్చిన చెక్క పొడిని జోడించి రాత్రి పడుకోబోయే ముందు ఈ మిశ్రమాన్ని ముఖంపై లేయర్ లా వేసుకుని అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ్యడం వ్లల ముఖం పై పేరుకున్న జిడ్డు, మొటిమలు తగ్గుతాయి.
7. టమోటో: ముందగా టొమాటో తొక్క తీసి గుజ్జు చేసుకోవాలి. ఆ తర్వాత మెత్తగా ఉడికించిన అన్నంలో టొమాటో గుజ్జు, రెండు టీ స్పూన్ల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం కోమలంగా ఉండి నిగారింపు పెరుగుతుంది. ఇలా నెలకు రెండుసార్లు చేస్తే బాగుంటుంది.



Click it and Unblock the Notifications