Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
పొడి చర్మం నివారించే అత్యుత్తమ హోం రెమడీస్
పొడి చర్మం లేదా పొరలుపొరలుగా ఉండే చర్మం. ఈ సమస్య సాధారణంగా వింటర్ లో ఎక్కువగా ఉంటుందని చాలా మంది ఫిర్యాదు చేస్తుంటారు. వింటర్ లో చలి, పొడి గాలులు వల్ల నునుపుగా మరియు సిల్కీగా ఉన్న చర్మం కాస్తా పొడిగా మారుతుంది. మరియు ఇతర కారణాలలైన ఏజింగ్, పోషకాల లోపం మరియు జన్యు ప్రవర్తన వంటి కారణాల చేత కూడా పొడి చర్మానికి దారితీస్తుంది.
పొడి చర్మం నివారించడానికి అనుసరించాల్సి హెల్తీ డైట్: క్లిక్ చేయండి
ఈ సమస్య చాలా మందికి వింటర్ సీజన్ లో వస్తే మరికొందరికేమే ఎప్పుడు వారి వెంటాడుతుంటుంది. ఎన్ని చిట్కాలు పాటించినా, ఎన్ని క్రీములు వాడిన ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. పొడి చర్మం నివారించుకోవడానికి మార్కెట్లో అనేక లోషన్స్, మాయిశ్చరైజింగ్ క్రీములు ఉన్నాయి. అయితే అన్నీ కూడా ఎక్కువ ధర కలిగి ఉంటాయి. ఫలితం కూడా తాత్కాలికంగా ఉంటుంది. అయితే నేచురల్ హోం రెమడీస్ చవకైనవి మాత్రమే కాదు, ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి మరియు మంచి ఫలితాలను అంధిస్తాయి. ఇవి మీచర్మానికి తగినంత తేమను అంధించి, మీ చర్మానికి తిరిగి పూర్వ అనుభంను తీసుకొస్తాయి.
పొడి చర్మం: హోం మేడ్ నేచురల్ ఫేస్ ప్యాక్: క్లిక్ చేయండి

ఆలివ్ ఆయిల్:
ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి మరియు కండీషన్ గా పనిచేసి, మీ మొత్తం చర్మానికి తేమను అందిస్తుంది.
* ఆలివ్ ఆయిల్ ను కొన్ని చుక్కలు చేతిలోనికి తీసుకొని మొత్తం శరీరం అంతా మర్దన చేసుకోవాలి. అరగంట తర్వాత స్నానం చేస్తుంది. ఇది పొడి చర్మాన్ని నివారిస్తుంది.

పాలు:
పాలు: పాలలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు మరియు చర్మాన్ని సున్నితంగా మార్చే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది డ్రై అండ్ దురద చర్మాన్ని నివారిస్తుంది. మరియు ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది. చర్మ సామర్థ్యంను పెంచుతుంది మరియు మాయిశ్చరైజ్ గా పనిచేస్తుంది. అలా మీ చర్మ రంగును కూడా మెరుగుపరుస్తుంది.
* బాగా శుభ్రం చేసిన వస్త్రంను పాలలో డిప్ చేసి తర్వాత శరీరం మరియు ముఖంను శుభ్రంగా తుడుచుకోవాలి. అలాగే మరో వస్త్రంను వేడినీటిలో డిప్ చేసి, నీరు పిండిసే తర్వాత శరీరంను క్లీన్ గా తుడవాలి . ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

తేనె:
తేనె: తేనె ఒక ఉత్తమ మాయిశ్చరైజర్ గా భావిస్తారు. ఇందులో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబైల్, మరియు హ్యుమెక్టా లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి గొప్ప మాయిశ్చరైజ్ గా పనిచేస్తుంది. దాంతో చర్మం సున్నితంగా మరియు స్మూత్ గా మార్చుతుంది . మరియు తేనెలో విటమిన్స్ మరియు మినిరల్స్ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
*స్నానం చేయడానికి ముందు మీ శరీరం మొత్త తేనెను అప్లై చేసి పది నిముషాలు అలాగే వదిలేసి, తర్వాత స్నానం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

పెరుగు:
పెరుగు: పెరుగు ఒక అద్భుతమైన స్కిన్ హైడ్రేటిగ్ ఏజెంట్. మరియు యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండి పొడి మరియు దురదపెట్టే చర్మాన్ని నివారిస్తుంది . పొడి చర్మం మరియు దురదకు గురిచేసే బ్యాక్టీరియా లేదా క్రిములను నాశనం చేసే ల్యాక్టిక్ యాసిడ్ ఇందులో పుష్కలంగా ఉంటుంది.
*తాజాగా ఉన్న పెరుగు తీసుకొని, ముఖం, చేతులు మరియు కాళ్ళకు అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. 10నిముషాలు అలాగే ఉంచి తర్వాత స్నానం చేసుకోవాలి. పెరుగులోని నాణ్యమైన గుణాలు డ్రై స్కిన్ తొలగిస్తుంది మరియు మీ చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. దీన్ని ప్రతి రోజూ ఒక సారి చేస్తే సరిపోతుంది.

మిల్క్ క్రీమ్:
మిల్క్ క్రీమ్: ఇందులో లాక్టిక్ యాసిడ్స్ డ్రై స్కిన్ నివారిస్తుంది . ఈ మిల్క్ క్రీమ్ లోని సున్నితమైన అంశం చర్మం యొక్క పిహెచ్ లెవల్స్ ను పెంచుతుంది. మరియు మిల్క్ క్రీమ్ ఎక్స్ లెంట్ మాయిశ్చరైజర్.
*మిక్క్ క్రీమ్ లో కొన్ని చుక్కలు నిమ్మరసం మరియు రెండు టీస్పూన్ల మిల్క్ క్రీమ్ లో మిక్స్ చేసి మీ చేతులకు మరియు కాళ్ళకు మర్ధన చేసుకోవాలి. అరగంట తర్వాత స్నానం చేసుకోవాలి.

కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె: కొబ్బరి నూనె పొడి చర్మం నివారించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది . ఇందులో మంచి ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉన్నాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి . మరియు చర్మం నుండి తేమను కోల్పోకుండా, మాయిశ్చరైజ్ గా పనిచేస్తుంది.
*నిద్రించడానికి ముందు గోరెవెచ్చకొబ్బరి నూనెను మీ శరీరానికి మొత్తానికి మర్దన చేయాలి. తర్వాత మరుసటి రోజు ఉదయం శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే మీ చర్మం సున్నితంగా మరియు నునుపుగా తయారవుతుంది.

అవొకాడో:
అవొకాడో: అవొకాడోలో ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి .ఇవి చర్మం లోపలి నుండి మెరుగుపరుస్తుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ ఎ కంటెంట్ చర్మ నిర్వహణకు సహాయపడుతుంది మరియు పొడి చర్మాన్ని నివారిస్తుంది.
*అవొకాడోను మెత్తగా గుజ్జులా చేసి, మీ పొడి చర్మం మీద మొత్తం అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత 10నుండి 15నిముషాలు అలాగే ఉంచి, తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి రోజూ రెగ్యులర్ గా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఓట్ మీల్:
ఓట్ మీల్: డ్రై స్కిన్ నివారించడానికి ఓట్ మీల్ ను మీరు ఉపయోగించుకోవచ్చు . ఓట్ మీల్లోని అధిక ప్రోటీన్ కంటెంట్ చర్మానికి రక్షణ కవచంలో ఉంటుంది. ఇది చర్మం నుండి తేమను కోల్పోకుండా నివారిస్తుంది మరియు చర్మానికి తగినంత తేమను అందివ్వడానికి సహాయపడుతుంది. మరియు ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మొత్తం శరీర మరియు చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
*గోరు వెచ్చని నీటిలో ఓట్ మీల్ ను పోసి, అందులోనే కొద్దిగా ల్యావెండర్ ఆయిల్ కూడా వేసి, 15-20నిముషాలు నానిన తర్వాత స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి స్నానం చేస్తే, నునుపైన చర్మ సౌందర్యం పొందవచవ్చు.

బాదం ఆయిల్:
బాదం ఆయిల్: బాదం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక ఉత్తమ మాయిశ్చరైజర్ గా మరియు పొడి చర్మానికి లూబ్రికేటర్ గా పనిచేస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ చర్మం మరియు మొత్తం శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో జిడ్డు తక్కువగా ఉండి, చర్మంలోని చాలా తేలికగా చొచ్చుకొనిపోతుంది.
*కొన్ని చుక్కల బాదంనూనెను చేతిలోని తీసుకొని మీ మొత్తం శరీరానికి అప్లై చేసి, మర్దన చేసుకోవాలి. అరగంట తర్వాత స్నానం చేసుకోవాలి . తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇలా రోజుకు ఒక సారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

అలొవెరా:
అలొవెరా: కలబంద చర్మంను సున్నితంగా మరియ నునుపుగా మార్చే మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం పొడిబారడాన్ని, దురదను, మరియు పొరలును నివారిస్తుంది. ఈ సింపుల్ రెమడీ మీ చర్మానికి మాయిశ్చరైజర్ గాపనిచేస్తుంది. చర్మంలో ఎటువంటి మలినాలున్నా తొలగిస్తుంది.
*ఆలొవెరా ఆకును కట్ చేసి తాజాగా ఉండే జెల్ ను మీ పొడి చర్మానికి అప్లై చేయాలి. చేసిన తర్వాత 10-15నిముషాలు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి రోజూ రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications











