Latest Updates
-
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.!
చర్మానికి మాయిశ్చరైజింగ్ ఎలా సహాయపడుతుంది.
శరీరంలో చర్మం చాలా సున్నితంగా మరియు పెళుసుగా ఉంటుంది. మీ చర్మం కోసం జాగ్రత్తలు తీసుకొనేప్పుడు తగినంత ఎక్స్ ట్రా కేర్ తీసుకోవడం చాలా అవసరం. చర్మం సంరక్షణలో ఏది పడితే అది లోషన్లు కానీ, మాయిశ్చరైజర్లు కానీ అప్లై చేయకూడదు. సీజన్ బట్టి ముఖ చర్మంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది కాబట్టి, కాలాన్ని బట్టి, మాయిశ్చరైజర్స్, ఫేస్ క్రీములు లోషన్లు ఎంపిక చేసుకోవాలి.
ముఖ్యంగా చర్మంలో ఏర్పడే ఇన్ఫెక్షన్స్ మొదలు కొని రియాక్షన్స్ వరకూ అన్ని సమస్యలను చర్మం ఎదుర్కొంటుంది. చర్మంలో వివిధ రకాల కణాలు, కణజాలాలు కలిగి ఉంటుంది. నార్మల్ స్కిన్ పరిస్థితి బట్టి ఆయిల్ స్కిన్ మరియు డ్రై స్కిన్ మీద స్పందిస్తుంటుంది. ఒక వేళ మీది సెన్సిటివ్ స్కిన్ అయినట్లైతే పరిస్థితి బట్టి మీరు చాలా డిఫరెంట్ జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది.

మీ చర్మం తత్వం ఎలాంటిదైనా, సరే చర్మానికి కాలాన్ని బట్టి, అదనపు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. చర్మానికి మీరు ఏం అప్లై చేసిన చర్మం హైడ్రేట్ గా మారుతుంది . ముఖ్యంగా చర్మంను ఎల్లప్పుడూ తేమగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం.
ఎల్లప్పుడూ చర్మాన్ని హైడ్రేషన్ లో మరియు కాంతివతంగా ఉంచుకోవడానికి వివిధ కారణాలున్నాయి . చర్మం ఎల్లవేళల మాయిశ్చరైజర్ గా ఎందుకు ఉంచుకోవాలనేదానికి ఈ క్రింది కొన్ని కారణాలను తెలపడం జరిగింది.

రేడియంట్ స్కిన్: చర్మానికి తేమగా ఉంచుకోవడం వల్ల ఎల్లప్పుడు, చర్మం తేమగా మరియు కాంతివంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. ఒక మంచి మాయిశ్చరైజింగ్ ను ఉపయోగించి చర్మంను ఎప్పుడూ తేమగా ఉంచుకోవాలి . అలా రెగ్యులర్ గా చేసినప్పుడు, చర్మం కాంతివంతంగా మారుతుంది.
రసాయనిక ఉత్పత్తులను నివారించాలి: చర్మం కొన్ని రకాల రసాయనాలు పడవు. ముఖ్యంగా బయో కెమికల్స్ రియాక్షన్ ను ఇస్తాయి. మీ చర్మం సరిగా హైడ్రేషన్ చెందకుండా ఉన్నట్లైతే, అప్పుడు ఇటువంటి రియాక్షన్స్ చర్మానికి హాని కలిగి స్తాయి. అటువంటి దుష్ప్రభావాలను నివారించాలంటే ఎల్లప్పుడూ చర్మంను తేమగా ఉంచుకోవాలి.

కణజాలాలను మరమత్తు చేస్తుంది: ఎప్పుడైతే మీ చర్మానికి మాయిశ్చరైజ్ మరియు తేమగా ఉంచుకోవగలుగుతారో అప్పుడు, కణజాలాల మరమత్తు చాలా సులభం అవుతుంది . డ్యామేజ్ అయిన కణజాలల వల్ల చర్మానికి హాని కలుగుతుంది . స్మూత్ మరియు సాఫ్ట్ స్కిన్ కూడా టిష్యు డ్యామేజ్ ను రిపేర్ చేస్తుంది . అందుకు మీరు రెగ్యులర్ గా చర్మంను మాయిశ్చరైజింగ్ గా ఉంచుకోవాలి.
ముడుతలను నివారిస్తుంది: ఎప్పుడైతే మీ చర్మాన్ని తేమగా ఉంచుకోగలుగుతారో, అప్పుడు మీ ముఖంలో మరియు శరీరంలో తక్కువ ముడుతలను కలిగి ఉంటారు. చర్మంలో ముడుతలకు ముఖ్య కారణం డీహైడ్రేషన్. ఈ డీహైడ్రేషన్ తగ్గించుకోగలిగినట్లైతే మీ శరీరంలో ఎటువంటి ముడుతలుఏర్పడవు. మీ చర్మం సున్నితంగా మరియు సాఫ్ట్ గా ఉంటుంది.
ఇన్ఫెక్షన్ ను నయం చేస్తుంది: ఎప్పుడైతే చర్మం డీహైడ్రేషన్ కు గురిఅవుతుందో, అంటే చర్మానికి సరిపడా తేమ అందడం లేదని గ్రహించాలి. దాని వల్ల అనేక ఇన్ఫెక్షన్స్ ను ఎదుర్కోవల్సి వస్తుంది . మాయిశ్చరైజింగ్ మీ చర్మానికి చాలా మేలు చేస్తుంది మరియు అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది . డీహైడ్రేషన్ స్కిన్ వల్ల మొటిమలు మరియు ఇతర స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను కారణం అవుతుంది. అటువంటి చర్మ సమస్యలున్నప్పుడు, మీరు శరీరానికి తగినంత నీరు అవసరం అవుతుందని గ్రహించాలి. ఎప్పుడైతే మీ చర్మం తేమగా ఉంటుందో, అప్పుడు చర్మంలో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ, మొటిమల సమస్యలు కానీ ఉండవు.

డ్యామేజ్ స్కిన్ నివారిస్తుంది: చర్మం ఎప్పుడు తేమగా ఉంచుకొన్నట్లైతే , చర్మం చాలా సులభంగా తేలికపడుతుంది. డ్రై స్కిన్ వల్ల చర్మం మీద క్రాక్స్ మరియు ఇతర సమస్యలకు దారితీస్తుంది. డ్రై స్కిన్ ఉన్నప్పుడు చర్మం దురద మరియు చర్మం డ్యామేజ్ కు కారణం అవుతుంది. మీరు ఒక మంచి చర్మంను కోరుకుంటున్నట్లైతే, చర్మం ఎప్పుడు తేమగా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.



Click it and Unblock the Notifications
