Latest Updates
-
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026
అందాన్ని పెంచుకోవడానికి ఫుడ్ ఫేస్ ప్యాక్స్
సంవత్సరం మొత్తంలో శరీర సౌందర్యాన్ని కాపాడుకోవడంలో మరియు అందాన్ని మెరుగుపరుచుకోవడానికి వివిధ రకాల ఫేస్ ప్యాక్ లను మనం వేసుకుంటాము. ఫేస్ ప్యాక్ వేసుకోవడం కొరకు వివిధ రకాల ప్రొడక్ట్స్ ను కూడా ఉపయోగిస్తుంటారు . అయితే కెమికల్స్ కలిసిన ఫేస్ ప్యాక్స్ కాకుండా, నేచురల్ రెమెడీస్ తో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మానికి హాని కలిగించకుండా ఎఫెక్టివ్ ఫలితాలను పొందవచ్చు .
చర్మంను ప్రకాశవంతంగా, అందంగా మార్చడంలో కొన్ని పండ్లు మరియు ఆహారాలు గ్రేట్ గా సహాయపడుతాయి. వీటిని ఉపయోగించుకోవడం వల్ల చర్మం ఫ్రెష్ గా కనబడుతుంది. ఈ క్రింది లిస్ట్ లో ఇచ్చిన ఆహారాలతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మొటిమలు తొలగిపోతాయి మరియు స్కార్స్ కూడా కనబడకుండా చేస్తుంది.
ఈ క్రింది లిస్ట్ లో ఇచ్చిన ఆహార పదార్థాలతో ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం వల్ల చర్మ రంద్రాలు తెరచుకొనేలా చేస్తాయి, చర్మాన్ని శుభ్రపరిచి, తగినంత తేమను అందిస్తాయి.
శీతాకాలంలో పొడి చర్మం కలిగిన వారు, నేచురల్ పదార్థాలతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల, చర్మానికి గొప్ప ప్రయోజనం చేకూరుతుంది. చర్మానికి తగినంత తేమ అందేలా చేస్తాయి. కెమికల్ బేస్డ్ ఫేస్ మాస్క్ లను వేసుకోవడం కంటే, నేచురల్ పదార్థాలతో ఫేస్ మాస్క్ ల వల్ల స్కిన్ ఇరిటేషన్ తగ్గించుకోవచ్చు.
గుర్తుంచుకోవల్సిన మరో ముఖ్యమైన విషయం, ఈ క్రింది లిస్ట్ లో ఏపదార్థాను ఫేస్ మాస్క్ గా ఉపయోగించినా, వాటిలోని విత్తనాలను తొలగించి ఫేస్ మాస్క్ వేసుకోవాలి. లేదా మెత్తగా పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల స్కిన్ స్క్రబ్బింగ్ గా కూడా ఉపయోగపడుతుంది. ఫేస్ మాస్క్ కు ఉపయోగపడే వండర్ఫుల్ ఫుడ్స్ ఏంటో ఒకసారి చూద్దాం...

గుడ్డు
మీచర్మ తత్వం పొడిగా ఉంటే, చర్మంను తేమగా ఉంచుకోవాలనుకుంటున్నట్లైతే, గుడ్డుసొనను బాగా బీట్ చేసి, ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి. ఆయిల్ చర్మం కోసం ఎగ్ వైట్ లో కొద్దిగా నిమ్మరసం లేదా తేనె మిక్స్ చేసి మాస్క్ వేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.

లెమన్ ఫేషియల్
నిమ్మరసం చర్మానికి బ్లీచ్ లా పనిచేస్తుంది. చర్మంలోని అవాంఛిత రోమాలను తొలగిస్తుంది. నిమ్మరసంను ఫేస్ మాస్క్ వేసుకొన్న తర్వాత ఆలివ్ ఆయిల్ ను ముఖానికి అప్లై చేస్తే, చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

మస్టర్డ్
ఆవాలను కూడా చర్మ సౌందర్యంలో భాగంగా ఉపయోగించుకోవచ్చు.అయితే, దీన్ని ఫేస్ ప్యాక్ గా వేసుకొనేటప్పుడు, చిన్న ప్యాచ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ఇరిటేషన్ లేకపోతే, దీన్ని ఫేస్ ప్యాక్ గా వేసుకోవచ్చు. ఆవాల పేస్ట్ లో కొద్దిగా పాలు వేసి, ఫేస్ ప్యాక్ గా వేసుకోవచ్చు.

పెరుగు
చర్మంను శుభ్రపరచడంతో పాటు, చర్మరంధ్రాలను బిగుతుగా చేస్తుంది. చిక్కగా ఉండే పెరుగును ముఖానికి పట్టించి 20 నిముశాలు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

మెయోనైజ్
ఫేస్ ప్యాక్ గా మరో బెస్ట్ ఫుడ్ మోయోనైజ్ . మెయోనైజ్ ఫేస్ ప్యాక్ ఏ సీజ్ లో అయినా వేసుకోవచ్చు.

ఓట్ మీల్
డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించుకోవడానికి ఓట్ మీల్ ను ఫేస్ ప్యాక్ గా వేసుకొని, స్క్రబ్ చేయవచ్చు.

పాలు
పచ్చిపాలను ఫేస్ ప్యాక్ గా వేసుకోవాలి. లేదా అరకప్పు మిల్క్ పౌడర్ లో సరిపడా నీళ్ళు పోసి, పేస్ట్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. చర్మం తేమగా, కాంతివంతంగా మార్చుతుంది.

అరటిపండ్లు
స్కిన్ ఫేస్ మాస్క్ కు అరటిపండు ఒక మంచి పదార్థం. ఎందుకంటే, బనానా ఫేస్ ప్యాక్ చర్మాన్ని తేమగా మరియు సాఫ్ట్ గా ఉంచుతుంది. అంతే కాదు స్కిన్ ను టైట్ చేస్తుంది.

పసుపు ఫేస్ ప్యాక్
పసుపును పెరుగుతో చేర్చి పేస్ట్ లా చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మార్చుతుంది. చర్మం మొదటి పొరలో దాగి ఉన్న బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

చాక్లెట్
చాక్లెట్ కూడా చర్మానికి చాలా మేలు చేస్తుంది. సున్నితమైన చర్మతత్వం కలవారు. చాక్లెట్ కు ఫేస్ ప్యాక్ కు దూరంగా ఉండాలి. సెన్సిటివ్ స్కిన్ ను మరింత డ్రైగా మరియు దురదగా మార్చుతుంది.

గుమ్మడి ఫేషియల్
గుమ్మడి చర్మానికి అవసరం అయ్యే విటమిన్స్ ను అందిస్తుంది. ఇది చర్మానికి మంచి కంప్లెక్షన్ ను అందిస్తుంది . ముఖం జిడ్డును నివారిస్తుంది. ముఖంగా వింటర్లో ఎక్కువ ఫలితం అందిస్తుంది.

గ్రీన్ టీ మరియు తేనె
గ్రీన్ టీ స్కిన్ సాఫ్ట్ ఏజెంట్ గా పనిచేస్తుంది, తేనె బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది . అందువల్ల, ఈ రెండు ఫుడ్స్ యొక్క కాంబినేషన్ తో ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల కాంప్లెక్షన్ పెంచుకోవచ్చు.

ద్రాక్షమరియు తేనె
గ్రీన్ లేదా పర్పుల్ గ్రేప్స్ ను మెత్తగా పేస్ట్ చేసి , అందులో ఒక చెంచా తేనె మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మచ్చలు మాయం అవుతాయి.

ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్, చర్మాన్ని సాఫ్ట్ గా మార్చుతుంది. చర్మంను మరింత బ్యూటిఫుల్ గా మార్చుతుంది. మరియు ఇది చర్మానికి ప్రకాశవంతంమైన అందాన్ని అందిస్తుంది.

స్ట్రాబెర్రీ
స్ట్రాబెర్రీస్ ప్రతి ఒక్కరికీ ఇష్టమైనటువంటి ఫ్రూట్. దీంతో ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల చర్మం సాగడం మరియు చర్మంలో ముడుతలను నివారిస్తుంది.

అవొకాడో
అవొకాడోను మెత్తగా పేస్ట్ చేసి, అందులోనే కొద్దిగా తేనె మిక్స్ చేసి ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల కాంతివంతమైన చర్మం పొందవచ్చు.



Click it and Unblock the Notifications