Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
7 నిమిషాల్లో అందంగా.. ఆకర్షణీయంగా.. కనిపించడం ఎలా ?
ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ఉరుకులు, పరుగులు. వండుకుని తినడానికి.. ఆఫీసుకి టైంకి చేరుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు అమ్మాయిలు. ఇంత బిజీ షెడ్యూల్ లో.. ఇక మేకప్ కి టైం ఎక్కడుందని.. డీలాపడిపోతుంటారు. డోంట్ వర్రీ.. ఏడు నిమిషాల్లో ఆకర్షణీయంగా రెడీ అవడానికి సింపుల్ రెమిడీస్.
తక్కువ టైంలో.. ఎక్కువ అందంగా కనిపించాలని ఉందా ? అయితే వంటిట్లో దొరికే.. నిమ్మ, గ్రీన్ టీ చాలు.. మిమ్మల్ని క్షణాల్లో అందంగా.. ఆకర్షణీయంగా మార్చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీకు ఆశ్చర్యం కలిగించే.. గోల్డెన్ బ్యూటీ టిప్స్ చూసేయండి.

బుగ్గల అందానికి
ఇవాళ ముఖం నిర్జీవంగా.. డల్ గా కనిపిస్తోందా ? డల్ నెస్ కనిపించకుండా.. ఎక్కువ మేకప్ వేసుకోవడానికి టైం లేదా ? అలాంటప్పుడు.. కాస్త న్యూడ్ షేడ్ ఉన్న లిప్ స్టిక్ తీసుకుని.. బుగ్గలకు, పెదాలకు రాయండి. క్షణాల్లో మీ అందం రెట్టింపవుతుంది.

కప్పు టీ
ఒక్కోసారి ఉత్సాహం కోల్పోతుంటారు. అలాంటప్పుడు.. హెర్బల్ టీ చాలా బాగా పనిచేస్తుంది. మందారంతో కూడిన వేడి వేడి హెర్బల్ టీ తీసుకుని.. ముఖానికి ఆవిరి పట్టండి.. చర్మంలో ఉన్న మృతకణాలను తొలగించి.. చర్మానికి సహజ మెరుపుని ఇస్తుంది.

బాడీ స్ర్కబ్బర్
స్ర్కబ్బర్ తో బాడీని రుద్దుతూ ఉంటే... చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి.. ఫ్రెష్ లుక్ ని ఇస్తుంది.

బేబీ పౌడర్
మీ జుట్టు నిర్జీవంగా.. పేలవంగా కనిపిస్తుంటే.. బేబీ పౌడర్ చక్కటి పరిష్కారం. కొద్దిగా బేబీ పౌడర్ తీసుకుని.. జుట్టుపై కొంచెం చల్లుకుని.. దువ్వుకుంటే.. సహజంగాకనిపిస్తుంది.

మెడ అందానికి
మెడను ఒక నిమిషంపాటు మసాజ్ చేస్తే.. కండరాలకు, మీకు మంచి రిలాక్సేషన్ గా ఉంటుంది. అంతేకాదు.. చర్మం నిగనిగలాడుతుంది.

అరటిపండు
మీకు తెలుసా అరటితొక్క అద్భుతమైన సౌందర్య సాధనమని. ముడతలు, మచ్చలు పోగట్టడానికి అరటితొక్క బాగా పనిచేస్తుంది. దాంతో 5నిమిషాలు.. ముఖంపై రుద్దితే రక్తప్రసరణ బాగా జరిగి.. ఏడు నిమిషాల్లో అందంగా కనిపించేలా చేస్తుంది.

ఐస్
ఉదయం నిద్రలేవగానే.. ఒకటి లేదా రెండు ఐస్ క్యూబ్స్ తీసుకుని.. ముఖంపై మసాజ్ చేస్తే.. ఫ్రెష్ లుక్ మీ సొంతమవుతుంది. అంతేకాదు.. ముఖంపై ఏర్పడిన రంధ్రాలు మూసుకుపోయి.. చర్మకాంతి పెరుగుతుంది.



Click it and Unblock the Notifications
