Latest Updates
-
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు
చర్మం పగుళ్ళు మరియు ఫైన్ లైన్ నివారించే ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్
చర్మం పగుళ్ళు మరియు చర్మంలో సన్నని గీతలు(ఫైన్ లైన్స్), పగుళ్ళు, ముడుతలు, ఏజింగ్ మరియు పాలిపోయిన చర్మం ఈ లక్షణాలన్నీ డ్రై స్కిన్ కు సంబంధించినవే. ఇలా వివిధ రకాల చర్మ సమస్యలున్నప్పుడు (చర్మ కణాలు వీక్ గా మారుతాయి).
డ్రై స్కిన్ వల్ల చర్మం దురద మరియు స్కిన్ రాషెస్ సమస్య ఉంటుంది. అదృష్టవశాత్తు క్రాక్డ్ స్కిన్ కు కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి. సన్ బర్న్ నుండి కూడా చర్మాన్ని రక్షించుకోవచ్చు . చర్మం పగుళ్ళు, సన్ బర్న్ నివారించుకోవడానికి కొన్ని కెమికల్ క్రీమ్స్, కాస్మోటిక్ క్రీమ్ మరియు మెడికల్ మాయిశ్చరైజర్స్ ను మరియు స్కిన్ ప్రోడక్ట్స్ ను స్కిన్ ట్రీట్మెంట్ కోసం వాడుతుంటాము.
READ MORE:ప్రకాశవంతమైన చర్మ సౌందర్యాన్ని అందించే ఫ్రూట్ జ్యూసులు
ఇవన్నీ చర్మానికి తేమను అందించినా, కొన్ని ఊహించని సైడ్ ఎఫెక్ట్స్ ను ఎదుర్కోవల్సి వస్తుంది. స్కిన్ ట్రీట్మెంట్ కోసం కొన్ని నేచురల్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా అందివ్వడం జరిగింది . వీటిని ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
READ MORE: ముఖం, ముక్కు మీద బ్లాక్ హెడ్స్ తొలగించే ఫేస్ మాస్క్
చర్మంలో పగుళ్ళు, ఫైన్ లైన్స్ మరియు క్రాక్డ్స్ స్కిన్ నివారించుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా. ఇవి డ్రై స్కిన్ మరియు సన్ బర్న్ ను నేచురల్ గా తగ్గించే కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ...

బొప్పాయి:
బాగా పండిన బొప్పాయిని పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించాలి. ఇది చర్మాన్ని హెల్తీగా మార్చుతుంది. చర్మ పగుళ్ళను నివారిస్తుంది . బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది మరియు డ్యామేజ్ అయిన చర్మాన్ని నయం చేస్తుంది. తగినంత మాయిశ్చరైజర్ ను అందిస్తుంది.

ఆప్రికాట్:
ఆప్రికాట్ ఫ్రూట్ ను నీటిలో కొద్దిసేపు నానబెట్టి, మెత్తబడిన తర్వాత గుజ్జులా చేసి ముఖానికి పట్టించాలి. తర్వాత 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. వీటిలో పోషకాలు అధికంగా ఉండటం వల్ల డ్యామేజ్ స్కిన్ ను త్వరగా నయం చేస్తుంది . డ్రై స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ చేసి తగినంత తేమను అందిస్తుంది.

ఆపిల్స్:
ఆపిల్ ను తొక్కతో సహాయ పేస్ట్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఆపిల్ ఒక పీలింగ్ స్కిన్ ట్రీట్మెంట్. ఎందుకంటే ఆపిల్లో యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. . ఇది చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది మరియు డ్రై స్కిన్ మాయిశ్చరైజ్ చేస్తుంది. ఇందులో వాటర్ కంటెంట్ అధికం ఉండటం వల్ల చర్మం పగుళ్ళను నివారిస్తుంది.

కోకనట్:
కొబ్బరినూనెను చర్మానికి సింపుల్ గా సున్నితంగా మసాజ్ చేయాలి. చర్మ పగుళ్ళకు ఇది ఒక బెస్ట్ నేచురల్ క్యూర్ . ఇందులో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి చర్మం లోపలి వరకూ షోషింపబడి తగినంత తేమను అందిస్తుంది. చర్మానికి దీన్ని అప్లై చేయడం వల్ల మీ చర్మం తెమగా కాంతివంతంగా కనబడుతుంది.

అవొకాడో:
అవొకాడో పేస్ట్ చేసి అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి మరియు చేతులకు అప్లై చేయాలి . ఇలా చేయడం వల్ల పీలింగ్ స్కిన్ చాలా త్వరగా నయం అవుతుంది . ఇది చర్మానికి చాలా మంచి గ్లో ఇస్తుంది మరియు డ్యామేజ్ స్కిన్ మరియు పీలింగ్ స్కిన్ నివారిస్తుంది.

అరటిపండ్లు:
అరటిపండును మెత్తగా మ్యాష్ చేసి నేరుగా ముఖానికి అప్లై చేయాలి. ఇది డ్రై పీలింగ్ స్కిన్ ను నివారిస్తుంది. పీలింగ్ స్కిన్ మరియు సన్ బర్న్ స్కిన్ నివారించడానికి ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ. అరటిపండ్లలో పొటాషియం, మెగ్నీషియ మరియు ఇతర మినిరల్స్ మరియు విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఇది చర్మంను హెల్తీగా మరియు హైడ్రేట్ గా ఉంచుతుంది.



Click it and Unblock the Notifications
