Latest Updates
-
కేవలం 20 నిమిషాల్లో కమ్మని వంకాయ రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
మగాళ్లను చంపి ఎలా తప్పించుకోవాలి..? మెట్రోలో మహిళ చేసిన షాకింగ్ పని.. వైరల్ వీడియో.! -
బ్లాక్ క్యాట్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంటి?..మీ పార్టనర్ కు ఈ లక్షణాలు ఉన్నాయా? -
బాత్రూమ్లో దుర్వాసన.. సువాసన వెదజల్లే ఫ్రెషనర్స్ ఇంట్లోనే 5 నిమిషాల్లో రెడీ.! -
వర్షాకాలంలో పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి.! -
కండరాల బలానికి, రోజంతా ఎనర్జీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..10 నిమిషాల్లో ఎగ్ అవకాడో ఖాఖ్రా చాట్ చేయండిలా.. -
మీ స్నేహితుల్లో ఈ 4 లక్షణాలు ఉంటే వెంటనే దూరం పెట్టండి! -
ఆకలి తీరాలి, బరువు పెరగకూడదు..అయితే డిన్నర్ కి ఇది బెస్ట్ చాయిస్..10 నిమిషాల్లోనే చేసేయండిలా! -
బానిసత్వం పోయింది బాస్: సిక్ లీవ్ అడిగిన ఉద్యోగి..మేనేజర్ ప్రశ్నకు జెన్ జీ ఉద్యోగి దిమ్మతిరిగే కౌంటర్ -
పప్పులు నానబెట్టే పనే లేదు.. అప్పటికప్పుడు అచ్చం పునుగుల్లా ఉండే మినీ రైస్ బోండా చేసుకోండిలా..
పురుషుల ముఖంలో ముడుతలను నివారించే ఉత్తమ మార్గాలు
మీ అందమైన శరీరం ముడతలు పడటం మొదలవటంతో, మీరు దగ్గరలోని కాస్మెటిక్ షాపుకు వెళ్ళి, చాలా ఖరీదైనన పరిహారాలను వెతుకుతారు. మీ శరీర అందాన్ని కాపాడుకోవాలనే ఆతురత మీకు ఉంటుంది. అయితే మీరు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకుండా, మీ అమూల్యమైన సమయాన్ని వ్యర్థం చేయకుండా, ఈ క్రింది విధానాలను పాటిస్తే చర్మం ఉన్న ముడతలను తగ్గించుకోవచ్చు.

ఎండలో తిరగటం మానండి
మీ చర్మం ముడతలు పడటానికి ప్రధాన కారణాలలో ఎండ కూడా ఒకటి. మీరు చేయవలసిందల్లా, సాధ్యమైనంతవరకు ఎండలో సమయం కేటాయించకుండా జాగ్రత్త పడండి. ఈ విషయాన్ని ధృవపరచటానికి చాలా సాక్షాధారాలున్నాయి. ఇలాంటి వాటిలో ఒకేవిధంగా ఉండే కవలలపై పరిశోధనలు జరిపి వెలువరించిన ఒక నివేదిక కింద తెలుపబడింది.
న్యూయార్క్ ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ ‘డారీఖ్ యాన్టేల్' ప్రకారం, ఎండ మన శరీరం మడతలు పడటానికి ప్రధాన కారణం. వంశపారంపర్య కారణాలకంటే, ఇదే ప్రధాన కారణమని ఆయన అంటున్నారు. ఇద్దరు కవలలో ఇంటిలో ఉన్నటు వంటి వాడికి, చర్మం మడతలు బయట తిరిగే వాడికన్నా తక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధనలలో కనుగొనటం జరిగింది.

తెల్ల సొన
ఇది మీకు వింతగాను మరియు ఇబ్బందిగాను అనిపించవచ్చు, అయితే, మీరు తెలుసుకోవాల్సిందేమిటంటే, దీని వలన మేలు కలుగుతుంది. కోడిగుడ్లలోని తెల్లసొనను తీసుకోండి. అయితే పసుపు భాగం ఇందులో కలవకుండా చూడాలి. సేకరించిన తెల్లసొనను మీ చర్మానికి మర్దన చేసుకోవాలి. దీనిని మీ చర్మంపై కనీసం పదిహేను నిమిషాల పాటు ఉండేటట్లు చూడాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో చర్మాన్ని కడగాలి. దీనిలో పుష్కలంగా ఉన్నటువంటి సహజ విటమిన్ ‘B', తన ప్రభావానికి చూపి, చర్మ ముడతలను తొలగిస్తాయి.

నిమ్మరసం
మీ చర్మం ముడతలను పోగొట్టుటలో శక్తివంతమైన విధానం ఇదే అని చెప్పవచ్చు. ఒక నిమ్మకాయను తీసుకొని, రెండు బాగాలుగా కోసి, నిమ్మరసాన్ని ముఖం మీదున్నటువంటి ముడతల మీద రుద్దాలి. నిమ్మరసంలోని ఆమ్లం, మీ చర్మం ప్రకాశంగా కనిపించటానికి దోహదపడటమే కాకుండా, ముడతలను కూడా తగ్గిస్తుంది. నిమ్మకాయ వాసనను బాగా పీల్చుకోండి. ఇలా చేయటం వాళ్ళ మీ ఇంద్రియాలు పనితీరు పెరుగుతుంది.

మంచి నిద్ర
మీ చర్మాన్ని ముడతలు పడకుండా చూడటంలో నిద్ర ప్రధాన పాత్ర పోషిస్తుంది. నిద్రపోయే సమయం మనిషి, మనిషికీ మారుతుంటుంది అంటే ప్రతి మనిషి నిద్రపోవటానికి కేటాయించే సమయం ఒకే విధంగా ఉండదు. అయినప్పటికీ ప్రతి మనిషి ఎనిమిది గంటలపాటు నిద్రపోవటానికి ప్రయత్నం చేయాలి. నిద్ర లేకపోవటం వల్ల హార్మోన్లు స్థాయిలలో మార్పులు కలిగి, ఒత్తిడికి గురి చేస్త్తాయి. అందుదువల్ల శరీరం ముడతలు పడటమే కాకుండా, శరీరంలో తాపం (వేడి) కలుగుతుంది. మీరు నిద్ర పోయే స్థితి లేదా విధానం కూడా చాలా ముఖ్యం. ప్రక్కకు ఒరిగి పడుకోవటం మరియు బోర్లా పడుకొని నిద్రించడం వలన గడ్డం, చెంప మరియు నోసటిమీద చారలు ఏర్పడుతాయి. అందువల్ల మీ చర్మం మరిన్ని ముడతలు పడకుండా చూడటానికి, వెల్లకిలా పడుకొని నిద్ర పోవటానికి ప్రయత్నం చెయ్యాలి.

పొగ త్రాగటం మానండి
అన్ని ఆరోగ్య విషయాలకు సంబంధిచిన మాదిరిగానే, పొగత్రాగటం మీరు తప్పకుండా మానుకోవాలి. ఎక్కువగా సిగరెట్లు కాల్చే వారిలో చర్మం ముడతలు పడే అవకాశం, మామూలు వారిలో కంటే ఐదు రెట్లు ఎక్కువగా వుంటుంది. సిగరెట్టు తాగేటప్పుడు పెదవులపై ఒత్తిడి వలన మరియు కనుచూపు వంకరగా అవటం వలన చర్మం ముడతలు పడే అవకాశం ఉన్నది.

పండ్లు మరియు కూరగాయలు
ఇతర వ్యాధుల నివారణలో వీటి పాత్ర ఎలా ఉంటుందో, అలాగే, చర్మం ముడతలు విషయంలో కూడా సమాన పాత్ర పోషిస్తాయి. తాజా పండ్లు మరియు కూరగాయలలో విటమిన్ ‘A' మరియు ‘D' లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తరచుగా తినటం వలన మీ శరీర అందాన్ని కాపాడుకోవచ్చు. తాజాగా ఉండే పండ్ల రసాన్ని మీకు దగ్గరలో ఉన్నటువంటి జ్యూసు షాపులో తీసుకోండి. లేదా మీ ఇంటిలోనే పండ్లరసాన్ని తయారు చేసుకోండి. మీకు యింకా సమష్యలు ఉన్నట్లయితే పోషకాహార ఆహార నిపుణులు లేదా చర్మ నిపుణుడిని సంప్రదించి తగిన జాగ్రత్తలను తీసుకోండి.



Click it and Unblock the Notifications