Latest Updates
-
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ముడుతల చర్మాన్ని కోమలంగా మార్చడానికి కొబ్బరి నూనె...
అందం విషయంలో ఏ చిన్న లోపం ఉన్నా అస్సలు రాజీ పడరు అమ్మాయి. ముఖ్యంగా ముఖంలో నల్లమచ్చలు, మొటిమలు వంటి విషయంలో హైరానా పడిపోతుంటారు. అలాంటప్పుడు ముఖంలో వ్రింకిల్స్ (ముడుతలు లేదా చారలుంటే) ఇక అంతే వయస్సైపోయినవారిలా కనబడుతామోనన్న కంగారు మొదలువుతుంది. మొటిమల, బ్లాక్ హెడ్స్, సన్ టాన్, వంటి సమస్యలకు మరి ముడుతలను నివారించుకోవడం ఎలా? ఉందిగా పరిష్కారం...
కొబ్బరి నూనె ముడుతలను మాయం చేస్తుంది?ఖచ్చితంగా అవునే చెబుతున్నారు బ్యూటీషియన్స్. సాధారణంంగా ముఖంలో ముడుతలనేవి, ఫోర్ హెడ్(నుదటి మీద), కళ్ళ చుట్టూ మరియు నోటి చుట్టూ ఏర్పడుతుంటాయి. ఎంత అందంగా ఉన్నా, ఈ సర్కిల్స్ వల్ల అందం అంతా పాడవుతుంది. కాబట్టి, ముఖంలో ముడుతలను మాయం చేసి ముఖ సౌందర్యంను కాపాడుకోవడం కోసం కొబ్బరి నూనె గ్రేట్ గా సహాయపడుతుంది. కొబ్బరి నూనె చర్మంను సాఫ్ట్ గా చేస్తుంది మరియు ముడుతలను మాయం చేస్తుంది
రోజులో రెండు సార్లైనా కొబ్బరి నూనెతో ముఖం మర్ధన చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే జిడ్డు చర్మ తత్వం ఉన్న వారు కొబ్బరి నూనెను అప్లై చేయకుండుట మంచిది. కొబ్బరి నూనె చర్మానికి మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. చర్మానికి కావల్సినంత తేమను అందిస్తుంది . ఇంకా కొన్ని చర్మ సమస్యలను నివారిస్తుంది . మరి కొబ్బరి నూనెను చర్మానికి ఎలా అప్లై చేయాలో చూద్దాం...
కొబ్బరి నూనెతో ముఖంలో ముడతలు మాయం...

1. మేకప్ తొలగించాలి:
మొదట, మీరు మేకప్ తొలగించాలి . చర్మం మీద మొదటి లేయర్ గా ఉండే మేకప్ తొలగించి, ముఖాని శుభ్రంగా కడిగి తర్వాత కొబ్బరి నూనెను అప్లై చేయాలి.

2. ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి:
ముఖం చల్లటి నీటితో శుభ్రం చేసుకొన్న తర్వాత, ముఖ్యంగా ముడుతలున్న ప్రదేశంలో డస్ట్, మేకప్ లేకుండా పూర్తిగా తొలగించడం కోసం చల్లటి నీటితో శుభ్రంగా కడుగుకోవాలి.

3. మసాజ్:
చేతులను శుభ్రం చేసుకొని, అవసరం అయినంత మేర కొబ్బరి నూనె చేతుల్లో వేసుకొని ముఖం మీద అప్లై చేసి ముడుతలున్న ప్రదేశంలో సున్నితంగా మర్ధన చేయాలి. ఇది చర్మంలోని బాగా శోషించడం వల్ల మంచి ఫలితం ఇస్తుంది.

4. రాత్రి నిద్రించడానికి ముందు :
నిద్రించడానికి ముందు ముఖానికి అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ కండరాలకు విశ్రాంతి పొంది, రక్తప్రసరణ మెరుగుపడి ముడుతలను మాయం చేస్తుంది.

5. మాయిశ్చరైజర్ ను అప్లై చేయకూడదు:
కొబ్బరి నూనె అప్లై చేసే రోజుల్లో ముఖానికి మాయిశ్చరైజర్ ను అప్లై చేయకపోవడమే మంచిది.

6. ఫ్రీరాడికల్స్ డ్యామేజ్:
కొబ్బరి నూనె ఫ్రీరాడికల్స్ డ్యామేజ్ ను నివారించడం వల్ల ముఖంలో ముడుతలను సులభంగా తొలగించుకోవచ్చు.

7. ఐ బ్యాగ్స్:
కళ్ళ క్రింద ఉబ్బు, చర్మానికి కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల కళ్ళ క్రింది క్యారీ బ్యాగులను నివారిస్తుంది. దాంతో పాటు ముడుతలను మాయం చేస్తుంది. చర్మంలో మొటిమలు మచ్చలున్నా తొలగిస్తుంది .

8. మేకప్ తొలగిస్తుంది:
మేకప్ క్లీన్ గా తొలగించడానికి కూడా కొబ్బరి నూనెను ఉపయోగిస్తుంటారు. కాబట్టి, సాఫ్ట్ స్కిన్ మరియు వ్రింకిల్ ఫ్రీ చర్మం పొందాలంటే, చర్మానికి కొబ్బరి నూనె పట్టించండి...



Click it and Unblock the Notifications
