ఆయిల్ స్కిన్ కు గొప్ప పరిష్కారం: హోం మేడ్ ఫేస్ మాస్క్

ఆయిల్ స్కిన్ వల్ల ముఖంలో ఎక్కువగా మొటిమలు, మచ్చలు మరియు బ్లాక్ హెడ్స్ మరియు ఇతర స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆయిల్ స్కిన్ వాతావరణంలోని ఎక్కువ మురికిని ఆకర్షిస్తాయి. ఆయిల్ స్కిన్ నివారించడానికి అదనపు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఆయిల్ స్కిన్ ఉన్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ముందు ముందు చర్మం డ్యామేజ్ అవుతుంది.

లక్కీగా ఆయిల్ స్కిన్ నివారించడానికి ఎఫెక్టివ్ హోం మేడ్ ఫేషియల్స్ కొన్ని ఉన్నాయి. ఇవి ఆయిల్ స్కిన్ నివారించడంలో బెస్ట్ ఉత్తమమైనవని నిరూపించబడ్డాయి.

ఆయిల్ స్కిన్ కలవారిలో అదనపు నూనెలు ఉత్పత్తి అవుతాయి. కారణంగా చర్మం రంద్రాలు తెరచుకొనేలా చేసి, త్వరగా మురికి చేరి, మొటిమలు మచ్చలకు కారణం అవుతుంది . ఇలా తెరచుకొన్న చర్మ రంధ్రాలను శుభ్రం చేయడానికి, బ్లాక్ హెడ్స్ ను నివారించడానికి, మొటిమలు మరియు మచ్చలు తొలగించడానికి ఈ హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. READ MORE:సహజ పద్దతుల్లో ఆయిల్ స్కిన్ నివారించడానికి 13 మార్గాలు

ఈ హోం మేడ్ నేచురల్ ఫేస్ ప్యాక్స్ ప్రత్యేకంగా ఆయిల్ స్కిన్ కల వారికి మాత్రమే పనిచేస్తాయి . చర్మ రంధ్రాల నుండి ఆయిల్ ను వేరుచేసి కంట్రోల్ చేస్తాయి. మరి ఆయిల్ స్కిన్ నివారించే హోం మేడ్ ఫేషియల్ మాస్క్ ఏంటో ఒకసారి చూద్దాం...

 బెన్ టోనైట్ క్లే ఫేస్ మాస్క్ :

బెన్ టోనైట్ క్లే ఫేస్ మాస్క్ :

ఆయిల్ స్కిన్ కు ఇది ఒక ఉత్తమ హోమేడ్ ఫేస్ ప్యాక్ . దీన్ని గ్రీన్ క్లే అని కూడా పిలుస్తారు. బెన్ టోనైట్ మట్టిలో కొద్ది నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. రోజ్

వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు.

ఫుల్లర్స్ ఎర్త్ ముల్లాని మట్టి ఫేస్ ప్యాక్:

ఫుల్లర్స్ ఎర్త్ ముల్లాని మట్టి ఫేస్ ప్యాక్:

ఆయిల్ స్కిన్ మరియు చర్మ రంద్రాలను నివారించే ఒక ఉత్తమ హోం మేడ్ ఫేషియల్ మాస్క్ . ఈ ఫేస్ మాస్క్ చర్మంలోని ఎక్సెస్ ఆయిల్ ను గ్రహించి చర్మం కాంతివంతంగా మార్చుతుంది. చర్మ రంద్రాలను శుభ్రం చేసి, బ్లాక్ హెడ్స్ ను నివారిస్తుంది . ముల్తాని మట్టికి కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ చేసి, ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించాలి. 20 నిముషాల తర్వాత శుభ్రం చేస్తే ముఖంలో మంచి గ్లో వస్తుంది.

 శెనగపిండి మరియు పసుపు ఫేస్ ప్యాక్:

శెనగపిండి మరియు పసుపు ఫేస్ ప్యాక్:

పసుపు మరియు శెనగపిండిని రెండింటిని ఒక బౌల్లో వేసి కొద్దిగా పాలు పోసి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి. ఇది చర్మంలోని ఎక్సెస్ ఆయిల్ ను నివారించడంతో పాటు, డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది. ఆయిల్ స్కిన్ కు ఒక బెస్ట్ హోం రెమెడీగా నిరూపించుకొన్నది.

ఆరెంజ్ తొక్కతో ఫేస్ మాస్క్:

ఆరెంజ్ తొక్కతో ఫేస్ మాస్క్:

ఆరెంజ్ తొక్కను నీడలో ఎండబెట్టి, పౌడర్ చేసి అందలో కొద్దిగా రోజ్ వాటర్ మరియు పెరుగు మిక్స్ చేసి పేస్ట్ లా అయిన తర్వాత ముఖానికి పట్టించి 20నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మంలోని మురికిని తొలగిస్తుంది మరియు చర్మం రంద్రాలను శుభ్రం చేస్తుంది.

ఫ్రూట్ నేచురల్ ఫేస్ ప్యాక్:

ఫ్రూట్ నేచురల్ ఫేస్ ప్యాక్:

అన్ని రకాల పండ్లలోనూ విటమిన్ సి పుష్కలంగా ఉన్నది. ఇది ఆయిల్ స్కిన్ కు గ్రేట్ గా సహాయపడుతుంది . ఫ్రెష్ ప్రూట్స్ (ఆరెంజ్, స్ట్రాబెర్రీ, పైనాపిల్, మరియు టమోటో)ను మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి పట్టించాలి. ఇది చర్మంలోని ఎక్సెస్ ఆయిల్ ను తొలగిస్తుంది.

బొప్పాయి ఫేస్ ప్యాక్:

బొప్పాయి ఫేస్ ప్యాక్:

అన్ని రకాల చర్మ తత్వాలకు బొప్పాయి ఫేస్ ప్యాక్ సూట్ అవుతుంది . ముఖ్యంగా ఆయిల్ స్కిన్ నివారించడంలో ఎక్కువగా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది మరియు చర్మం నుండి అదనపు నూనెను తొలగిస్తుంది. బొప్పాయిని మెత్తగా చేసి ముఖానికి అప్లై చేయాలి. ఆయిల్ స్కిన్ నివారించడానికి ఇది ఒక ఉత్తమ హోం మేడ్ ఫేషియల్ మాస్క్.

 కీరదోసకాయ మరియు ఎగ్:

కీరదోసకాయ మరియు ఎగ్:

కీరదోసకాయను మెత్తగా గ్రైండ్ చేసి అందులో ఒక చెంచా నిమ్మరసం మిక్స్ చేసి అందులోనే ఎగ్ వైట్ వేసి బాగా మిక్స్ చేసి, ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి. ఇది చర్మంలోని మురికని మరియు ఆయిల్ ను నివారిస్తుంది . తద్వారా మొటమలు మచ్చలు ఏర్పడకుండా నివారిస్తుంది.

 ఓట్ మీల్ మరియు హనీ ఫేషియల్ మాస్క్:

ఓట్ మీల్ మరియు హనీ ఫేషియల్ మాస్క్:

ఆయిల్ స్కిన్ నివారిచండంలో ఇది ఒక బెస్ట్ ఫేషియల్ మాస్క్ . ఓట్ మీల్ ను నిమ్మరసంతో మిక్స్ చేసి, కొద్దిగా తేనె మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని చర్మానికి పట్టించి నిధానంగా ముఖంను స్ర్కబ్ చేయాలి. 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఆపిల్ మరియు తేనె ఫేషియల్ మాస్క్:

ఆపిల్ మరియు తేనె ఫేషియల్ మాస్క్:

కొద్దిగా ఆపిల్ ముక్కలను మెత్తగా పేస్ట్ చేసి దానికి కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది మీ చర్మానికి ఫ్రెష్ నెష్ ను తీసుకొస్తుంది.

అరటిపండు ఫేస్ ప్యాక్:

అరటిపండు ఫేస్ ప్యాక్:

బాగా పండిన అరటిపండును మెత్తగా మ్యాష్ చేసి, దీనికి కొద్దిగా తేనె మరియు నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లైచేసి 15నిముషాల తరవ్ాత శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇది ముఖంలో మొటిమలు మచ్చలను నివారిస్తుంది.

Story first published: Thursday, March 19, 2015, 16:50 [IST]
Desktop Bottom Promotion