చర్మాన్ని తెల్లగా మార్చే బ్లీచింగ్ ట్రీట్మెంట్లు..స్కిన్ క్యాన్సర్ కు కారణమా..?

స్కిన్ బ్లీచింగ్ గురించి మీకు అవగాహన ఉందా..? లేనివారికి ఈ ఆర్టికల్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే స్కిన్ బ్లీచింగ్ అనేది చర్మాన్ని తెల్లగా మార్చడం అని అనుకుంటా చాలా మంది మహిళలు. ముఖ్యంగా ఇండియన్ మహిళలు తెల్లగా అందంగా కనబడుట కోసం బ్లీచింగ్ ట్రీట్మెంట్ ను ఎంపిక చేసుకుంటుంటారు. బ్లీచింగ్ వల్ల చర్మంలో అద్భుతాలను జరుగుతాయని ఊహించుకుంటారు . అయితే మహిళలు తెలుసుకోవల్సి ముఖ్యమైన విషయం, బ్లీచింగ్ వల్ల చర్మం రంగు మారదు. ఇది కేవలం చర్మం మీద ఉండే హెయిర్ ను కనబడుకుండా చేస్తుంది.

ఉదాహరణకు, ఫేషియల్ హెయిర్ ను లైట్ గా మార్చి కనబడనివ్వకుండా చేస్తాయి.అయితే కెమికల్ బేస్డ్ బ్లీచింగ్ ట్రీట్మెంట్ కు బదులు నేచురల్ పదార్థాలను బ్లీచింగ్ ఏజెంట్స్ గా ఎంపిక చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఉదాహరణకు టమోటో జ్యూస్, నిమ్మరసం, పొటాటో జ్యూస్ వంటివి బ్లీచింగ్ ఏజెంట్స్ గా గ్రేట్ గా సహాయపడుతాయి. మీరు కనుక వంటగది వస్తువులను ఉపయోగించనట్లైతే, రెండో ఆప్షన్ కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ ను ఎంపిక చేసుకోవాలి.

త్రెడ్డింగ్ అండ్ వ్యాక్సింగ్ కూడా బాగా పాపులర్ మరియు చాలా మంది లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు . చర్మం మీద సన్నని వెంట్రుకలు కనబడకుండా చేయడానికి బ్లీచింగ్ ఒక ఫాస్టర్ పద్దతి, ఐతే కొన్ని విషయాలను మీరు గుర్తుంచుకోవాలి. కెమికల్ బ్లీచింగ్ ట్రీట్మెంట్ వల్ల చర్మానికి ఏవిధంగా హాని కలిగిస్తాయో తెలుసుకోవాలి!

చర్మంను డ్రైగా మార్చేస్తాయి:

చర్మంను డ్రైగా మార్చేస్తాయి:

చర్మానికి బ్లీచింగ్ చేయడం వల్ల ముఖం డ్రైగా మారుతుంది, అందుకు కారణం బ్లీచింగ్ లో ఉండే పదార్థం చర్మాన్ని డ్రైగా మార్చుతుంది . కొన్ని రకాల బ్లీచింగ్ పదార్థాల్లో మాయిశ్చరైజర్ ఆయిల్స్ ఉండటం వల్ల అవి చర్మం డ్రైగా మారకుండా చూస్తాయి . మీరు హోం మేడ్ బ్లీచింగ్ ఏంజెంట్స్ ను ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పాలు మరియు పెరుగు వంటి వాటిని ముఖానికి అప్లై చేసి సులభంగా కడిగేయవచ్చు

. స్కిన్ ఏజింగ్ ఫాస్ట్ గా ఉంటుంది:

. స్కిన్ ఏజింగ్ ఫాస్ట్ గా ఉంటుంది:

రెగ్యులర్ గా బ్లీచింగ్ చేయడం వల్ల ముఖంలో ముడతలు ఏర్పడుతాయి . చర్మం త్వరగా ఏజ్ అయిన వారిలా కనబడేలా మారిపోతుంది . బీచింగ్ లో ఉండే పదార్థాలు చర్మంలోని నేచురల్ ఆయిల్స్ ను గ్రహించేస్తాయి . దాంతో చర్మం వయస్సైనవారిగా మరియు ముడుతలతో కనబడుతుంది.

స్కిన్ క్యాన్సర్ అవకాశాలు:

స్కిన్ క్యాన్సర్ అవకాశాలు:

బ్లీచింగ్ వల్ల స్కిన్ క్యాన్సర్ వస్తుందన్న విషయం మీకు తెలుసా? మీ చర్మం చాలా సెన్షిటివ్ గా ఉండి బ్లీచ్ చేస్తే , బ్లీచింగ్ లో ఉండే పదార్థాలు చర్మానికి హాని కలిగిస్తాయి. చర్మం పొరపొరలుగా ఏర్పడుటకు కారణం అవుతుంది. అది స్కిన్ క్యాన్సర్ కు దారితీస్తుంది. కాబట్టి ఏమైనా సరే బ్లీచింగ్ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండటమే మంచిది.

పిగ్మేంటేషన్ పెంచుతాయి:

పిగ్మేంటేషన్ పెంచుతాయి:

బ్లీచింగ్ వల్ల స్కిన్ పిగ్మెంటేషన్ పెరుగుతుంది . బ్లీచింగ్ చేసుకొన్న వెంటనే ఎండలో తిరగడం వల్ల చర్మం దురద మరియు చర్మం రంగు మారడం జరుగుతుంది . బ్లీచింగ్ వల్ల ఇది కూడా ఒక హానికరమైన దుష్ప్రభావమే.

 చర్మం మీద చీకాకు కలిగిస్తుంది:

చర్మం మీద చీకాకు కలిగిస్తుంది:

చర్మానికి బ్లీచింగ్ ను కోట్ లా అప్లై చేసినప్పుడు నుండి చర్మం మీద సన్నగా మంటలా అనిపిస్తుంది మరియు దురద పెడుతుంది. ఇది నార్మల్ గా అనిపించినా చర్మ రక్షణకు ఇది అంత మంచిది కాదు . ఈ బ్లీచింగ్ లో ఉండే కొన్ని పదార్థాల వల్ల చర్మాన్ని తినేస్తున్నట్లు అనిపిస్తుంది. కాబట్టి, బ్లీచింగ్ చర్మానికి అంత మంచిది కాదు.

చర్మాన్ని బర్న్ చేస్తుంది:

చర్మాన్ని బర్న్ చేస్తుంది:

బ్లీచింగ్ ను ముఖానికి అప్లైచేసినప్పుడు బర్నింగ్ అయినట్లు అనిపిస్తుంది. బ్లీచింగ్ చేయించుకొన్నప్పుడు మరొక విధంగా కూడా ఉంటుంది..దురద చిరాకుపెడుతున్నట్లు అనిపిస్తుంది. కాబట్టి, కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉపయోగించడానికి ముందు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

 మొటిమలకు దారితీస్తుంది:

మొటిమలకు దారితీస్తుంది:

ఇది వరికే చర్మంలో మొటిమలున్నట్లైతే బ్లీచింగ్ వాడకూడదు, అలా కాకుండా వాడినట్లైతే మొటిమలు మరింత తీవ్రమౌతాయి . ఇది ముఖ్యంగా గుర్తించుకోవల్సిన విషయం

Desktop Bottom Promotion