Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
వయస్సు తెలిపే ముడుతలను నివారించే ఆయుర్వేదిక్ రెమెడీస్
వయస్సు పెరిగే కొద్ది చర్మంలో పెరిగే మొదటి లక్షణాలు ముడతలు. వయస్సైయ్యే కొద్ది, చర్మంలో ఎలాస్టిసిటి తగ్గడంతో చర్మం సాగడం ప్రారంభం అవుతుంది. దాంతో చాలా మంది చర్మంలో ముడుతలతో, ఫైన్ లైన్స్ తో బాధపడుతున్నారు. ముడుతలకు వయస్సు ఒక్కటే కారణంకాకపోవచ్చు. వయస్సుతో పాటు, యూవీరేస్, డ్రై స్కిన్, కెమికల్స్ ప్రొడక్ట్స్ వంటివి కూడా ముడుతలకు కారణమవుతాయి.
ఈ స్కిన్ సమస్యను నివారించుకోవాలంటే చర్మాన్ని నిరంతరం మాయిశ్చరైజ్డ్ గా ఉంచుకోవాలి. అడ్వర్టైజ్మెంట్స్ తో వివిధ రకాల ప్రొడక్ట్స్ మనల్ని అట్రాక్ట్ చేస్తాయి. అయితే వీలిటో కెమికల్స్ అధికంగా ఉండటం వల్ల పరిస్థితిని మరింత తీవ్రం చేస్తాయి. కాబట్టి , వీటికి ప్రయత్యామ్నాయంగా ఆయుర్వేద రెమెడీస్ ను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది . వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
ముడుతలకు చెక్ పెట్టే అలోవెర ప్యాక్స్ ...
ముడుతలను నేచురల్ గా నివారించుకోవడానికి ఉపయోగించే ఆయుర్వేద రెమెడీస్ మన వంటగదిలోనే బోలుడున్నాయి. వీటికోసం ఎక్కువ డబ్బు ఖర్చుచేయాల్సిన అవసరం లేదు. ఆయుర్వేద హెర్బ్స్ ఉపయోగించడంతో పాటు, మరికొన్ని టిప్స్ ను కూడా ఫాలో అవ్వడం మంచిది . ముఖ్యంగా మీరు రెగ్యులర్ గా తీసుకొనే ఆహారం మీద ఏకాగ్రత కలిగి ఉండాలి.
నోటి చుట్టూ..కళ్ళ చుట్టూ ముడుతలతో ఇబ్బంది పడుతున్నారా...?
రోజూ ఎక్కువ గ్రీన్ వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ వంటివి తీసుకోవాలి. వాటర్ ఎక్కువగా తాగాలి. వీటివల్ల చర్మం లోపలి భాగాల నుండి హైడ్రేషన్ పెరుగుతుంది. ముడుతలను నివారించుకోవడానికి బెస్ట్ ఆయుర్వేదిక్ రెమెడీస్ ఏంటి? తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సిందే..

మెంతులు:
మెంతి ఆకులతో పేస్ట్ లేదా మెంతి ఆయిల్ ను ఉపయోగించవచ్చు. మెంతులు ఒక నేచురల్ హోం రెమెడీ . ఇది ముడుతలను ినవారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . ఈ హెర్బ్ లో విటమిన్స్ మరియు మినిరల్స్ అధికంగా ఉంటాయి . ఇవి చర్మంను హెల్తీగా మార్చుతుంది. ముడుతలను తగ్గిస్తుంది.

కలబంద:
అన్ని రకాల చర్మ సమస్యలను నివారించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. ముడుతలను నివారించుకోవడానికి ఆయుర్వేదంలో ఒక ముఖ్యమైన హెర్బ్ ఇది. ఇందులో మాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మం యొక్క ఎలాసిటిని పెంచుతుంది. ముడుతలను నివారించడానికి సహాయపడుతుంది.

గ్రేప్ సీడ్ ఎక్స్ ట్రాక్ట్:
వయస్సు పెరిగే కొద్ది చర్మంలో కొల్లాజన్ ఉత్పత్తి తగ్గుతుంది . దాంతో చర్మంలో ముడుతలు ఏర్పడుతాయి . గ్రేప్ సీడ్ ఎక్స్ ట్రాక్ట్ ఒక వండర్ ఫుల్ హెర్బల్ రెమెడీ . ఇది కొల్లాజన్ ఉత్పత్తిని పెంచుతుంది . ఇది చర్మాన్ని టైట్ గా మరియు టోన్డ్ గా మార్చుతుంది . సప్లిమెంట్ తీసుకోవడం వల్ల బెటర్ రిజల్ట్ పొందవచ్చు.

అల్లం:
ఆయుర్వేదిక్ హెర్బ్స్ తో ముడుతలను మాయం చేసుకోవాలంటే అల్లం ఒక మ్యాజిక్ చేస్తుంది. అల్లంలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మరియు యాంటీ వ్రింకిల్స్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎలాసిటిన్ లక్షణాలను నివారిస్తాయి . చర్మరంగును మెరుగుపరుస్తాయి.

గ్రీన్ టీ:
స్కిన్ సాప్ట్, స్మూత్ మరియు ప్లంప్ స్కిన్ పొందాలంటే గ్రీన్ టీని ఫేస్ ప్యాక్ గా ఉపయోగించవచ్చు . అలాగే ఇంటర్నల్ గా రెండు కప్పుల గ్రీన్ టీని తాగాలి . గ్రీన్ టీలో ఉండే అద్భుతమైన యాంటీఆక్సిడెంట్స్ వల్ల యూత్ ఫుల్ లుక్స్ పొందవచ్చు.

క్యారెట్స్ :
ముడుతలను నివారించడంలో ఒక బెస్ట్ ఆయుర్వేదిక్ రెమెడీ. క్యారెట్ లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది . చర్మాన్ని రిపేర్ చేస్తుంది. ముడుతలు లేకుండా చేస్తుంది.

కొబ్బరి నూనె:
ఆయుర్వేదంలో కొబ్బరి నూనెకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఓల్డ్ రెమెడీ ముడుతలను నివారిస్తుంది . డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది. స్కిన్ సెల్స్ రిపేర్ చేస్తుంది, ఫైన్ లైన్స్ ను తగ్గిస్తుంది.

అవొకాడో:
ఇది ఒక బెస్ట్ ఆయుర్వేదిక్ హెర్బ్, ఇది ముడుతలను నివారించడంలో గ్రేట్ రెమెడీ. డ్రై స్కిన్ వల్ల కూడా ముడుతలు ఎక్కువ అవుతాయి. ఈ గ్రీన్ పల్ప్ అవొకాడో చర్మానికి నేరుగా అప్లై చేయడం వల్ల సాఫ్ట్ అండ్ ఫెయిన్ స్కిన్ పొందివచ్చు.

ముల్లిన్:
ఆయుర్వేదంలో మూలికలు ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాంటి మూలికల్లో ఒకటి ముల్లిన్. ఇది ముడుతలను నివారించడంలో ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది. ఈ హెర్బ్ లో టానిన్, ఎలాస్టిన్, మినిరల్స్ మరియు వివిధ రకాల విటమిన్స్, ములిన్ వంటివి ఉన్నాయి. ఇవి ముడుతలను నివారించి చర్మలోని స్పాట్స్, స్కార్స్ ను నివారిస్తాయి.

విట్చ్ హాజెల్:
విట్చ్ హాజల్ హెర్బ్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల ఇది నేచురల్ ఆస్ట్రిజెంట్ గా పనిచేస్తుంది . ఈ హెర్బ్ స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది మరియు చర్మం సాగకుండా నివారిస్తుంది. ముడుతలను తగ్గిస్తుంది. స్కిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications