Latest Updates
-
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.!
అబ్బాయిల్లో మొటిమలను తేలికగా నివారించే ఎఫెక్టివ్ హోం రెమిడీస్..!!
అమ్మాయిలైతే.. ముఖంపై ఏ మాత్రం మొటిమ వచ్చినా.. ఏదో ఒక టిప్ ఫాలో అయిపోయి.. దాన్ని మాయం అయ్యేలా చేస్తారు. కానీ.. అబ్బాయిలు మొటిమలు వచ్చినా.. పెద్దగా కేర్ తీసుకోకపోవడం వల్ల.. అవి ఒకటి రెండు తోడై.. అలా ముఖమంతా వ్యాపించి.. అసహ్యంగా కనిపించేలా చేస్తాయి. కాబట్టి అబ్బాయిలు ముఖంపై మొటిమలు రాకుండా.. మొటిమ కనిపించగానే జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం.
స్మార్ట్ లుక్ కోసం.. అబ్బాయిలు వేసుకోవాల్సిన ఫేస్ ప్యాక్స్..!
అయితే మొటిమలు రాకుండా ఉండాలంటే.. పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. ఇంట్లోనే అందుబాటులో ఉన్న సింపుల్ హోం రెమిడీస్ ని ఫాలో అయితే.. చాలా.. మీ ముఖంపై ఏ చిన్న మొటిమ కూడా రాకుండా అరికట్టవచ్చు. అయితే వీటి కోసం బ్యూటీ ప్రొడక్ట్స్ కంటే న్యాచురల్ రెమిడీస్ ద్వారా అరికట్టడం ఉత్తమం అని.. బ్యూటీ ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు.
మరి అబ్బాయిల్లో మొటిమలను అరికట్టే.. ఎఫెక్టివ్ హోం రెమిడీస్, వాటిని ఉపయోగించే విధానం చూద్దామా..

టూత్ పేస్ట్
మొటిమలు నివారించడంలో టూత్ పేస్ట్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అయితే వైట్ టూత్ పేస్ట్ ని మొటిమపై రాసుకుని.. గంట లేదా రెండు గంటల తర్వాత శుభ్రం చేసుకోవాలి. చాలా త్వరగా మొటిమలు మాయం అవుతాయి.

పుదీనా ఆకులు
పుదీనల యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖంపై క్లెన్సింగ్ లా పనిచేస్తాయి. అయితే పుదీన ఆకులను ముఖానికి పట్టించడం వల్ల చర్మాన్ని క్లెన్స్ చేయడమే కాకుండా.. మొటిమల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి కొన్ని పుదీనా ఆకులను తీసుకుని.. నీళ్లు కలిపి పేస్ట్ లా తయారు చేసి పట్టిస్తే చాలు.

ఆవిరి పట్టడం
మొటమిలు నివారించడానికి ఇదో తేలికైన పరిష్కారం. ఒక గిన్నెలో నీళ్లు బాగా మారిగించి.. ముఖం కవర్ అయ్యేలా ఏదైనా కప్పుకుని.. ముఖానికి, మెడకు బాగా ఆవిరి పట్టాలి. ఇలా రోజుకి రెండు మూడుసార్లు చేస్తే.. మొటిమలు దూరం అవుతాయి.

ఐస్ ప్యాక్
ముఖంపై మొటిమలకు ప్రధాన కారణమైన దుమ్ము, ధూళిని ఐస్ ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. చిన్న క్లాత్ లో ఐస్ క్యూబ్స్ ని చుట్టి.. ముఖానికి, ఎర్రగా, వాపు వచ్చిన దగ్గర పట్టించాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

తేనె
కాటన్ బాల్ తీసుకుని తేనెలో ముంచి ముఖానికి పట్టించాలి. 15 నుంచి 20 నిమిషాలు ఆరిన తర్వాత.. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా మూడు సార్లు చేస్తే.. మొటిమలు మాయం అవుతాయి.

బొప్పాయి
బొప్పాయి మొటిమల వల్ల వచ్చే వాపుని తగ్గిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్.. పింపుల్స్ ని ఎఫెక్టివ్ గా తగ్గిస్తాయి. కొద్దిగా బొప్పాయి జ్యూస్ తీసి.. ముఖానికి పట్టించి 15 నుంచి20 నిమిషాలు ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

నారింజ తొక్కలు
ఆరంజ్ తొక్కకు కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేయాలి. ఈ ప్యాక్ ని ముఖానికి పట్టించి 25 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. తేడా మీకే తెలుస్తుంది.

యాపిల్ సైడర్ వెనిగర్
యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని.. ముఖంపై మొటిమలు ఉన్నదగ్గర పట్టించాలి. దీన్ని ముఖంపై అలాగే ఉండేలా జాగ్రత్తపడండి. శుభ్రం చేసుకోకూడదు. అంతే.. మొటిమలు ఫాస్ట్ గా తగ్గిపోతాయి.

పసుపు
ఒక టేబుల్ స్పూన్ పసుపు, కొన్ని చుక్కల నీళ్లు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. శుభ్రం చేసుకుంటే.. ఇకపై ముఖంపై పింపుల్స్ వచ్చే సమస్యే ఉండదు.

వెల్లుల్లి
మొటిమలు నివారించడంలో వెల్లుల్లి చాలా న్యాచురల్ గా పనిచేస్తుంది. ఇది విష పదార్థాలను తగ్గించడమే కాకుండా, జీవక్రియ రేటును కూడా పెంచుతుంది. మొటిమలపై వెల్లుల్లి రెబ్బను కాస్త దంచి పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. లేదా వెల్లుల్లి రసం రాసినా సరిపోతుంది.

కొత్తిమీర
కొత్తిమీర రసం మొటిమలు తగ్గించే ఎఫెక్టివ్ రెమిడీ. అర స్పూన్ పసుపు, కొత్తిమీర రసం కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోవడానికి ముందు అప్లై చేసి.. ఉదయం శుభ్రం చేసుకోవాలి.

ఎగ్ వైట్ ప్యాక్
ఒక గుడ్డు నుంచి ఎగ్ వైట్ తీసి.. ముఖానికి పట్టించాలి. 15 నిమిషాలు ఆరిన తర్వాత.. శుభ్రం చేసుకుంటే.. వెంటనే ఫలితాలు చూడవచ్చు.



Click it and Unblock the Notifications
