క్యారెట్ ప్యాక్ తో చర్మం నవయవ్వనంగా నిగనిగలాడుతుంది

అందానికి మెరుగులు దిద్దుకోవాలని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. అయితే ప్రతిసారీ బ్యూటీ పార్లర్లకు వెళ్లాలంటే ఖర్చుతో కూడుకున్నపని. మరి ఎలా అంటారా? అందుబాటులో ఉండే పోషకాల క్యారెట్‌తో చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. వంటింట్లో లభించే దినుసులతోనే సౌందర్యానికి చికిత్సలెన్నో చేసుకోవచ్చని మనకు తెలుసు.. అలాంటి వాటిల్లో క్యారెట్ ఒకటి. నిత్యం మన వంట గదిలో కనిపించే క్యారెట్ ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగపడుతుందంటేమ ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే క్యారెట్స్ లో బీటా కెరొటన్లూ, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. చర్మ సౌందర్యంలో క్యారెట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. క్యారెట్ ద్వారా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. అంతే కాదు బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడే స్త్రీలు క్యారెట్ ను ఎక్కువగా తీస్కోవాల్సి ఉంటుంది.

ఓ క్యారెట్‌ మీ జీవితాన్ని మార్చేస్తుంది.. ప్రతి రోజూ నాలుగు క్యారెట్లు తింటే రెండంటే రెండు నెలల్లో మీ శరీరం ఆకర్షణీయంగా తయారవుతుందని పరిశోధనలు చేసి మరీ నిరూపించారు బ్రిటీష్‌ శాస్త్ర వేత్తలు. గుండెజబ్బుల్ని ఆమడ దూరంలో ఉంచవచ్చనీ చెబుతున్నారు. చూడ గానే తినాలని పించే క్యారెట్‌ లో అందాన్ని ఆకర్షణను పెంచే గుణాలున్నాయట. క్యారట్‌ తో పాటు సీజనల్‌ ఫ్రూట్స్‌, ప్లమ్స్‌ తింటే ఇంకా మంచిది.

బ్రిటన్‌ లోని బ్రిస్టల్‌ యూని వర్శిటీకి చెందిన సెయింట్‌ ఆండ్రూస్‌ నేతృత్వంలో ఓ బృందం పరిశోధనలు చేసి ఈ విషయాన్ని ప్రకటించింది. అందం కోసం తపించే ఆడవాళ్లు మాత్రమే కాదు... అందంగా, ఆనందంగా ఉండాలనుకునే మగ మహరాజులు కూడా దర్జాగా ఈ చిట్కాలను ఫాలో కావచ్చు....

క్యారెట్ వాటర్ :

క్యారెట్ వాటర్ :

కొద్దినీటిలో క్యారెట్ ని ఉడకబెట్టి ఆ నీరు చల్లారిన తర్వాత ఆ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖంపై మచ్చలు, నల్లబడటం పోయి చర్మం నునుపుగా ఉంటుంది.

క్యారెట్ మరియు పచ్చిపాలు:

క్యారెట్ మరియు పచ్చిపాలు:

కేరట్ ను తురిమి కొద్దిగా పచ్చిపాలు కలిపి మెత్తగా రుబ్బి ఈ ముద్దని మెడ, చేతులకి నాలుగైదుసార్లు చొప్పున రాయాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. దీని ద్వారా చర్మానికి సమృద్ధిగా విటమిన్లు చేకూరుతాయి.

క్యారెట్ -పెసరపిండి

క్యారెట్ -పెసరపిండి

చర్మం నిగనిగలాడుతూ ఉండేందుకు క్యారెట్‌కు తొక్క తీయకుండా తురిమి ఎండబెట్టాలి. 50 గ్రాము క్యారెట్ ఎండు తురుముకు అంతే సమానంగా దోస విత్తనాలు, వంద గ్రాముల పెసరపప్పు, బార్లీలను పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి రాసుకుని స్నానం చేస్తూ ఉంటే చర్మం మంచి రంగులో నిగనిగలాడుతూ ఉంటుంది.

క్యారెట్-బాదం :

క్యారెట్-బాదం :

కొన్ని బాదంపప్పులను నీటిలో నానబెట్టాలి. ఒక క్యారెట్‌ కు తొక్క తీయకుండా ముక్కలు చేసి, వాటికి బాదంపప్పును కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి అప్లై చేసి అరగంట తరువాత స్నానం చేయాలి. ఈ పదిహేను రోజులకు ఒకసారి చేస్తే చర్మం బిగుతుగా మారుతుంది.

మేకప్ చెదరకుండా ఉండాలంటే..

మేకప్ చెదరకుండా ఉండాలంటే..

ఒక టీస్పూన్ క్యారెట్ రసంలో అర టీస్పూన్ రోజ్ వాటర్, పావు టీస్పూన్ చందనంపొడి చేర్చి ముఖానికి బాగా అప్లై చేయాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆపై మేకప్ వేసుకుంటే గంటలతరబడీ మేకప్ చెదిరిపోకుండా ఉంటుంది.

కమిలిన చర్మానికి:

కమిలిన చర్మానికి:

ఎండకు కమిలి, రంగు కోల్పోయిన చర్మానికి క్యారెట్ రసం చాలా బాగా ఉపయోగపడుతుంది. రంగును పెంచటమేగాకుండా చర్మ ఆరోగ్యానికి క్యారెట్ రసం తోడ్పడుతుంది. క్యారెట్ ను మెత్తగా పేస్ట్ లా చేసిన ఆ పేస్ట్ ను ముఖానికి, మెడకు, చేతులకు ప్యాక్ లా వేసుకుంటే సన్ టాన్ నివారించి మంచి కాంతిని అందిస్తుంది.

జిడ్డు చర్మం నివారిస్తుంది:

జిడ్డు చర్మం నివారిస్తుంది:

ముఖంపై పేరుకున్న మురికి, జిడ్డును తొలగించేందుకు.. క్యారెట్, క్యాబేజీ, టమోటో ముక్కలను సమపాళ్లలో తీసుకుని మెత్తగా నూరి పేస్టులా చేసుకోవాలి. ముందుగా ముఖాన్ని చల్లటి నీటితో కడిగిన తరువాత నూరిన మిశ్రమాన్ని ప్యాక్‌లా వేయాలి. ఐదు నిమిషాల తరువాత మునివేళ్లతో వలయాకారంలో మర్దనా చేయాలి. ఆరిన తరువాత చన్నీటితో ముఖం కడిగేయాలి. ఆ తరువాత ముల్తానీ మట్టితో ముఖం, మెడకు ప్యాక్ వేసుకుని, కాసేపాగి శుభ్రం చేసుకోవాలి. చివరిగా నాణ్యమైన మాయిశ్చరైజర్ రాసుకుంటే, చర్మం తాజాదనంతో మిలమిలా మెరిసిపోతుంది.

 ముడుతలను మాయం చేస్తుంది:

ముడుతలను మాయం చేస్తుంది:

క్యారెట్ యాంటీ ఏజింగ్ లా పనిచేస్తుంది. రెండు టీ స్పూన్ల క్యారెట్ రసంలో సగం అరటి పండు గుజ్జ, గుడ్డులోని తెల్లసొన, నిమ్మరసం వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై వలయాకారంగా రుద్దుతూ ఇరవై నిముషాల తర్వాత గోరెవెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఈ ప్యాక్ వల్ల ముఖం మీద ముడతలు మాయమవుతాయి.

మొటిమలు మాయం:

మొటిమలు మాయం:

ముఖం మీద మొటిమలున్న వారు రెండు స్పూన్ల క్యారెట్ రసంలో ఒక స్పూన్ తేనె, చిటికెడు దాల్చిన చెక్కా వేసి మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు మాయం అవ్వడమే కాక ముఖం తేజస్సు మెరుగుపడుతుంది.

డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి, కొత్త చర్మం వస్తుంది:

డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి, కొత్త చర్మం వస్తుంది:

క్యారెట్ జ్యూస్ తీసుకుని దానికి ఒక టేబుల్ స్పూన్ ఎగ్ వైట్ కలపాలి. అందులో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, టేబుల్ స్పూన్ పెరుగు కలపాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. రెగ్యులర్ గా ఈ ప్యాక్ వేసుకుంటే.. డెడ్ సెల్స్ తొలగిపోయి.. చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

. డ్రై స్కిన్ : –

. డ్రై స్కిన్ : –

పొడిచర్మంతో బాధపడేవాళ్లకు క్యారెట్ ప్యాక్ మంచి ఫలితాన్నిస్తుంది. టేబుల్‌ స్పూన్‌ క్యారెట్‌ జ్యూస్‌, టీ స్పూన్‌ తేనె తీసుకుని మిక్స్‌ చేయాలి. ఈ పేస్ట్ ని ఫేస్‌కు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత శుభ్రపరచుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వల్ల ముఖవర్చస్సు పెరుగుతుంది.

 జుట్టు చివర్లు చిట్లినట్లైతే..

జుట్టు చివర్లు చిట్లినట్లైతే..

క్యారెట్ ఆకులకు కాస్తంత నువ్వుల నూనె కలిపి మెత్తగా నూరి తలకు ప్యాక్ లా వేసుకొని పెసరపిండిని తలకు మర్దిస్తూ స్నానం చేసినట్లయితే.. జుట్టు చివర్లు తెగకుండా, జుట్టు నిగనిగలాడుతూ ఉంటుంది.

Story first published: Saturday, January 2, 2016, 17:20 [IST]
Desktop Bottom Promotion