Latest Updates
-
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.!
మొటిమలను ఎట్టి పరిస్థితుల్లో గిల్లకూడదనడానికి కారణాలు...
ఎంతో హాయిగా, ఉత్సాహంగా ఉండే మీరు.. ముఖం అద్దంలో చూసుకున్నప్పుడు మొటిమలు చూసి షాక్ అవుతారు. ఉన్న ఉత్సాహమంతా ఆవిరైపోతుంది. ముఖారవిందాన్ని మొత్తం మొటిమ రూపంలో నిర్జీవం చేసేస్తుంది. వెంటనే దాన్ని కనపడకుండా చేయాలని భావిస్తారు. అంతే.. గిల్లడం మొదలుపెడతారు.
మొటిమను గిల్లేస్తే ఇక కనిపించదులే అనుకుంటారు. కానీ.. దాన్ని గిల్లడం వల్ల.. అది మచ్చలా ఏర్పడి ముఖంపై మరింత అసహ్యంగా కనిపిస్తుంది. కాబట్టి మొటిమను గిల్లినా ఫలితమేమీ ఉండదు. కొన్నిసార్లు మొటిమల లావుగా మారడం వల్ల నొప్పిగా ఉంటుంది. అప్పుడు దాన్ని భరించలేక కూడా నొక్కేస్తారు.
కానీ మొటమను నొక్కడం, గిల్లడం వల్ల స్కిన్ మరింత డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మొటిమను ఎట్టిపరిస్థితుల్లో గిల్లకూడదు అనడానికి పర్ఫెక్ట్ రీజన్స్ మీకోసం..

మచ్చ
మొటిమను గిల్లడం వల్ల తర్వాత మచ్చ ఏర్పడుతుంది. అలా ఏర్పడిన మచ్చను కాస్మొటిక్స్ తో కనపడకుండా చేయడం కూడా కష్టమే. కాబట్టి.. పింపుల్స్ ని న్యాచురల్ గా తొలగించే ప్రయత్నం చేస్తే.. ఎలాంటి మచ్చలు లేని ఫేస్ సొంతం చేసుకోవచ్చు.

ఇన్ఫెక్షన్
మొటిమను గిల్లడం వల్ల.. చీము బయటకు వస్తుంది. ఇది చుట్టూ ఉండే చర్మంపై దుష్ర్పభావం చూపుతుంది. దీని ద్వారా వచ్చే బ్యాక్టీరియా స్కిన్ ఇన్ఫెక్షన్ కి కారణమవుతుంది.

ఇన్ల్ఫమేషన్
మొటిమను బాగా పిండటం వల్ల.. చర్మం చాలా డ్యామేజ్ అవుతుంది. మొటిమ చుట్టూ వాపు ఇంకా పెరిగి.. అది మరింత పెద్దగా కనిపిస్తుంది. ఇది మొటిమ కంటే అసహ్యంగా ఉంటుంది.

పొక్కులు ఏర్పడవచ్చు
మొటిమలను గిల్లడంతో అయిపోతే.. తర్వాత దానిపై పొక్కులా ఏర్పడి.. మీ ఆకర్షణను మొత్తం అసహ్యంగా మారుస్తాయి. ఇలా ఏర్పడిన దాన్ని కాస్మొటిక్స్ కూడా ఏం చేయలేవు.

ఉపశమనానికి సమయం
సాధారణంగా మొటిమ మాయం అవడానికి వారం పడుతుంది. కానీ గిల్లడం వల్ల.. అది తగ్గడానికి ఎక్కువ సమయం పడుతుంది.

ఎక్కువ మొటిమలకు కారణం
పింపుల్స్ ని గిల్లకూడదు అనడానికి ప్రధాన కారణం.. అవి ఎక్కువ అవుతాయి. ఒక పింపుల్ ని సింపుల్ గా న్యాచురల్ రెమిడీతో తొలగిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ.. దాన్ని గిల్లడం వల్ల ఇన్ఫెక్షన్ చుట్టూ వ్యాపించి.. కొత్తగా మొటిమలు రావడానికి కారణమవుతుంది.

చర్మం పూర్తీగా మారిపోవచ్చు
చాలామంది చేసే పొరపాటు వల్ల చేతులపై ఉండే బ్యాక్టీరియా చర్మానికి తగిలి.. చర్మం డార్క్ గా మారుతుంది. మొటిమలు గిల్లిన తర్వాత చర్మం పిగ్మెంటేషన్ కి గురవుతుంది..



Click it and Unblock the Notifications
