Latest Updates
-
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి!
ఆయిల్ స్కిన్ నివారించడానికి 8 బెస్ట్ నేచురల్ పదార్థాలు
ఆయిల్ స్కిన్ ఉన్నవారి చర్మంలో హైలెవల్లో షైనింగ్, ఎక్కువ చర్మ రంద్రాలు, మొటిమలు, మచ్చలుంటాయి, అందుకు కారణం చర్మంలో సెబాసియస్ గ్రంథులు ఓవరాక్టివ్ గా పనిచేయడం వల్ల చర్మంలో ఎక్కువ ఆయిల్ స్రవిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో చర్మంలో జిడ్డు ఎక్కువగా కనబడుతుంది. ఎంత శుభ్రం చేసుకున్నా, ఎంత మేకప్ వేసుకున్నా ప్రయోజనం ఉండదు. ఆయిల్ స్కిన్ వారితో పోల్చితే ..డ్రై స్కిన్ వారిలో చర్మ రంద్రాలు చిన్నగా ఉంటాయి.
ఆయిల్ న్ వివిధ కారణాలున్నాయి. జెనటిక్స్ మరియు పబ్బరిటీ వల్ల కూడా ఆయిల్ స్కిన్ ఉంటుంది. కొంత మందిలో పబ్బరిటీ వల్ల ఆయిల్ స్కిన్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ డ్రై స్కిన్ ఉన్నవారిలో కూడా ఆయిల్ స్కిన్ గా మారుతుంది. పబ్బరిటి వల్ల హార్మోనుల్లో మార్పులు ఎక్కువగా ఉంటాయి. ఆయిల్ స్కిన్ డీల్ చేయడం అంత సులభం కాదు. అయితే ఆయిల్ స్కిన్ కు గల కారణాలను, లక్షణాల బట్టి నివారించుకోవచ్చు.
అలాగే ఆయిల్ స్కిన్ కు మరో కారణం బ్యూటీప్రొడక్ట్స్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆయిల్ స్కిన్ ఎక్కువ అవుతుంది. . మార్కెట్లో ఉండే వివిధ రకాల ప్రొడక్ట్స్ ఆయిల్ స్కిన్ కంట్రోల్ చేయడానికి సహాయపడుతాయి. కానీ వీటిలో కూడా కెమికల్స్ అధికంగా ఉండటం వల్ల తిరిగి సమస్యను యథావిధిగా మార్చుతుంది. ఎక్సెసివ్ ఫేస్ వాష్ వల్ల కూడా చర్మంలో ఆయిల్ నెస్ పెరుగుతుంది.
కాబట్టి, మార్కెట్లో ఉండే కెమికల్ ప్రొడక్ట్స్ బదులు కొన్ని హోం రెమెడీస్ ను ట్రై చేయడం వల్ల చర్మంలో ఆయిల్ నెస్ తగ్గించుకోవచ్చు. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు..

1. పసుపు:
పసుపులో యాంటీ ఫంగల్ మరియు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయిల్ స్కిన్ తగ్గించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. పాలలో కొద్దిగా పసుపు మిక్స్ చేసి ఈ పేస్ట్ ను ముఖం,మెడకు అప్లై చేయాలి. ఇలా ప్రతి వారం చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

2. బేకింగ్ సోడ:
బేకింగ్ సోడలో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి పేస్ట్ చేసి అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి అప్లై చేయాలి. అయితే దీన్ని మితంగా మాత్రమే చేయాలి. ఈ ప్యాక్ ఆయిల్ నెస్ తగ్గించడంతో పాటు మొటిమలను నివారిస్తుంది .

3. నిమ్మరసం:
నిమ్మరసం చర్మంను రిజవేట్ చేస్తుంది. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. ఇది చర్మంలోని పిహెచ్ లెవల్స్ ను రిజవేట్ చేస్తుంది. కాబట్టి, ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు. టోనర్ గా పనిచేస్తుంది. వాటర్ నిమ్మరసం మిక్స్ లో కాటన్ బాల్ మిక్స్ చేసి అప్లై చేయాలి.

4. ఆపిల్ సైడర్ వెనిగర్ :
ఆయిల్ స్కిన్ నివారించడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ గ్రేట్ గా పనిచేస్తుంది. వెనిగర్ లో కాటన్ డిప్ చేసి ముఖానికి అప్లై చేయాలి. తర్వాత ఐస్ క్యూబ్స్ తో మర్ధన చేయాలి . వైట్ వెనిగర్ మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ రెండూ గ్రేట్ గా పనిచేస్తాయి.

5. ఉప్పు:
ఉప్పు నేచురల్ డిస్ ఇన్ఫెక్ట్. దీన్ని స్ప్రేబాటిల్లో ఫిల్ చేసి , నీళ్లు పోసి బాగా మిక్స్ చేసి స్ప్రే యాలి . ఒకరోజులో రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది స్ప్రే చేసేటప్పుడు కళ్ళు మూసుకోవాలి.

6. కార్న్ స్ట్రార్చ్:
కార్న్ స్టార్చ్ ఎక్సెసివ్ ఆయిల్ ను తొలగిస్తుంది. దీన్ని నేచురల్ సెట్టింగ్ పౌడర్ గా చాలా మంది ఉపయోగిస్తారు. నీళ్ళలో కొద్దిగా కార్న్ స్టార్చ్ మిక్స్ చేసి , ప్యాక్ లా అప్లై చేసి పది , పదిహేను నిముషాల తర్వాత వాష్ చేసుకోవాలి.

7. టమోటోలు:
టమోటో లో విటమిన్ సి అధికంగా ఉంది. ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ చర్మ రంద్రాలను టైట్ చేస్తుంది. చల్లగా ఉండే టమోటోలను రబ్ చేసి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

8. అలోవెర:
ఆయిల్ స్కిన్ నివారించడంలో అలోవెర గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది బెస్ట్ నేచురల్ పదార్థం . ఆయిల్ స్కిన్ నివారించడంతో పాటు స్కిన్ కు తగిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. స్కిన్ సాప్ట్ గా మరియు సపెల్ గా మార్చతుంది.



Click it and Unblock the Notifications