బ్లాక్ హెడ్స్ నివారించే 8 ఎక్సలెంట్ , నేచురల్ హోం రెమెడీస్

ముఖం మీద చిన్న చిన్న నల్లటి మచ్చలు..ఇవంటే అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా హాడలే. ఇది ముఖాలను అందవిహీనంగా చేయటమే కాదు..కొన్ని సార్లు మానసికంగా కూడా క్రుంగదీస్తాయి. వీటినే బ్లాక్ హెడ్స్ అంటుంటారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, ఈ బ్లాక్ హెడ్స్ ను నివారించడంలో పెద్ద కష్టమైన పనేమి కాదు.

బ్లాక్ హెడ్స్ అంటే? మన చర్మం క్రింద సెబాసియస్ గ్లాండ్స్ ఉంటాయి. యుక్త వయస్సులో ఈ గ్లాండ్స్ చురుకుగా పనిచేస్తాయి. సెబమ్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల చర్మం పై ఎర్రగా లేదా నల్లగా ఉండే పింపుల్స్ ఏర్పడతాయి. నల్లగా ఉండే పింపుల్స్ ను బ్లాక్ హెడ్స్ అంటారు. ఇవి మామూలు పింపుల్స్ కన్నా పెద్దగా ఉంటాయి.

మన చర్మానికి అవసరమైన పోషక పదార్తాలను అందచేసే క్రమంలో రక్తం నుంచి అదనంగా ఉండే నూనె పదార్థాలు, సెబమ్ మరికొన్ని రసాయన పదార్థాలు వెలువడతాయి. ఇవి చర్మ రంధ్రాల నుంచి బయటకు వస్తాయి. బటయ ఉండే దుమ్ము, ధూళి కూడా ఇవి ఏర్పడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇవి ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా చేరుతుంది. ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఈ సమస్య మరింతగా ఉంటుంది. బ్లాకె హెడ్స్ ను నివారించడంలో 8 నేచురల్ రెమెడీస్ ఉన్నాయి. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి .

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడలో బ్లాక్ హెడ్స్ ను నివారించడంలో వండర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఒక గ్లాసు లేదా సిరామిక్ బౌల్ తీసుకుని అందులో బేకింగ్ సోడా కొద్దిగా వాటర్ మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి, డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. . ఈ చిట్కాను వారంలో రెండు సార్లు అనుసరిస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది.

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక స్పూన్ ఆర్గానిక్ దాల్చిన చెక్క పొడిలో ఒక పార్ట్ తేనె మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి అలాగే వదిలేయాలి. డ్రై అయిన తర్వాత నేచురల్ క్లెన్సర్ తో శుభ్రం చేసుకోవాలి. తర్వాత మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి.

 ఓట్ మీల్:

ఓట్ మీల్:

ఓట్ మీల్ స్మూతీస్ చర్మానికి ఇరిటేషన్ కలిగిస్తాయి. డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. డిస్టిల్డ్ వాటర్ లో ఓట్ మీల్ పౌడర్ మిక్స్ చేసి ఈ పేస్ట్ ను బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

నిమ్మరం:

నిమ్మరం:

నిమ్మరసంలో ఆల్పా హైడ్రాక్సి యాసిడ్స్ , సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంది. ఇది నేచురల్ గానే డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది. . చర్మ రంద్రాలను శుభ్రం చేస్తుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి , కొల్లాజెన్ ప్రొడక్షన్ ను క్రమబద్దం చేస్తుంది. స్కిన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది. . మొటిమలను నివారిస్తుంది. నేచురల్ క్లెన్సర్ ను ఉపయోగించి శుభ్రం చేసుకోవచ్చు. నిమ్మరసంలో కాటన్ బాల్స్ డిప్ చేసి బ్లాక్ హెడ్స్ మీద మర్దన చేసి డ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రీన్ టీలో విటమిన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మంలోని ఎక్సెస్ ఆయిల్ ను నివారిస్తుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. కొద్దిగా నీరు బాయిల్ చేసి, అందులో రెండు టీ బ్యాగ్స్ వేసి బాయిల్ చేయాలి. ఈ నీటిలో కాటన్ పాడ్స్ డిప్ చేసి బ్లాక్ హెడ్స్ మీద మర్ధన చేయాలి. డ్రై అయిన తర్వాత చల్లటి వాటర్ తో శుభ్రం చేసుకుని డ్రై అయిన తర్వాత మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి.

 తేనె:

తేనె:

తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మొటిమలకు సంబంధించి బ్లాక్ హెడ్స్ ను తొలగించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. స్వచ్చమైన తేనెను గోరువెచ్చగా వేడి చేసి తర్వాత అందులో కాటన్ బాల్ డిప్ చేసి బ్లాక్ హెడ్స్ మీద మర్ధన చేయాలి. కాటన్ అలాగే వదిలేసి, డ్రై అయిన తర్వాత కాటన్ తొలగించాలి.

పసుపు:

పసుపు:

పసుపు అద్బుతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ పదార్థం. దీన్ని వంటల్లో ఉపయోగించుకోవచ్చు . బ్యూటీ పదార్థాల్లో ఉపయోగించుకోవచ్చు. కపుపు పాలు, లేదా పసుపు నిమ్మరసం మిశ్రమంలో కాటన్ డిప్ చేసి బ్లాక్ హెడ్స్ మీద మర్దన చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

 ఎప్సమ్ సాల్ట్:

ఎప్సమ్ సాల్ట్:

ఎప్సమ్ సాల్ట్ సోర్ మజిల్స్ ను పెయిన్ ను తగ్గించడం మాత్రమే కాదు, . ఇది బ్లాక్ హెడ్స్ ను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. బ్లాక్ హెడ్స్ నివారించే చికిత్సలో డెడ్ స్కిన్ సెల్ మరియు ఎక్సెస్ ఆయిల్ ను తగ్గించుకోవచ్చు. ఈ ఎప్సమ్ సాల్ట్ మూసుకుపోయిన రంద్రాలను శుభ్రం చేస్తుంది. మరియు క్లియర్ స్కిన్ అందిస్తుంది.

Desktop Bottom Promotion