ఈ ఆహారాలు రెగ్యులర్ గా తింటే, చర్మం నిగనిగ, తళతళ...

మహిళలకు అందమైన మోముంటే అందరూ చాలా బాగుందంటారు. దీనికి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. పౌడర్లు, క్రీములు వాడితేనే చర్మం సౌందర్యవంతం కాదు. ఆహారంతో కూడా చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. తాజా కూరగాయలు, ఆకు కూరలు తినడం వల్ల శరీరంలో విటమిన్ల శాతం అవసరమైనంత మేరకు పెరుగుతుంది విటమిన్లు చర్మాన్ని తాజాగా ఉంచుతాయి.

మీరు రెగ్యులర్ గా ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారు?ఆహారం ఒక్క ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందానికి కూడా ప్రభావితం చేస్తుందన్న విషయం మీకు తెలుసా? కొన్ని ఆహారాలు ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తే, మరికొన్ని ఆహారాలు శరీర సౌష్టవం, చర్మం సౌదర్యం, కేశ సౌందర్యం మీద ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

చర్మ సౌందర్యానికి సహజసిద్ధంగా ప్రకృతి అందించే ఆకుకూరలు, కూరగాయలు పండ్లలో ఉండే ఎన్నో పోషకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే తీసుకునే చర్మం ముడతలు పడకుండా ఉండాలంటే ప్రొటీన్లు గల చేపలు, పౌల్ట్రీ, కోడిగుడ్లు, బీన్స్, పప్పులు, సోయా, మాంసం వంటివి తీసుకోండి.

ఆరోగ్యకరమైన ఆహారాలు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరం మొత్తం ఆరోగ్యం మరియు కాంతివంతమైన చర్మంకు గొప్పగా సహాయపడుతాయి. మీరు మంచి రంగుతో అందంగా ఉండాలి, కనబడాలంటే ఇక్కడ ఎనిమిది బెస్ట్ ఫుడ్స్ ను అందిస్తున్నాం. ఇవి తింటే రుచిని మాత్రమే కలిగి ఉండటం కాదు, చర్మానికి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడి కాంతివంతం చేస్తాయి.

1. ఫుడ్ #1 :

1. ఫుడ్ #1 :

బెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. స్ట్రాబెర్రీ వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది మరియు సన్ డ్యామేజ్ నుండి చర్మాన్ని రక్షిస్తుంది. స్ట్రాబెర్రీస్ లో ఆల్ఫా హైడ్రాక్సి ఆసిడ్, ఇది డెడ్ సెల్స్ ను తొలగిస్తుంది. ఈ పండ్లు తిని మీ చర్మం యొక్క కణాలను మెరుగుపరుచుకోవచ్చు.

2. ఫుడ్ # 2:

2. ఫుడ్ # 2:

కీరదోసకాయను రెగ్యులర్ గా తింటుంటే చర్మ అందానికి చాల మేలు చేస్తుంది. చర్మానికి తగిన హైడ్రేషన్ అందివ్వడంతో పాటు, బహిర్గతంగా మరియు అంతర్గతంగా టాక్సిన్స్ ను నివారిస్తుంది.

3. ఫుడ్ # 3:

3. ఫుడ్ # 3:

త్రుణధాన్యాలు, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మరియు ఇవి చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి . అంతే కాదు అంతర్గతంగా టాక్సిన్స్ ను బయటకు నెట్టివేసి , చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా మార్చుతాయి.

4.ఫుడ్ # 4:

4.ఫుడ్ # 4:

లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్ లో యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి మరియు వీటితో పాటు మినిరల్స్ మరియు విటమిన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి, ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని, చర్మ రంగును మెరుగుపరుస్తాయి.

5.ఫుడ్ # 5:

5.ఫుడ్ # 5:

సాల్మన్ ఫిష్ లో హెల్తీ ప్రోటీన్ పుష్కలంగా ఉంది. మరియు మరో కోల్డ్ వాటర్ ఫిష్, ఇవి చర్మానికి వైద్యపరమైన లక్షణాలను కలిగిస్తాయి.సాల్మన్ ఫిష్ ను వారానికి ఒక సారి తినడం వల్ల వయస్సు పైబడనియ్యకుండా కాపాడుతుంది. సాల్మన్ ఫిష్ లోని కెరోటినాయిడ్స్ స్కిన్ ఎలాసిటీన్ వృద్దిచేస్తుంది.

6. ఫుడ్ # 6:

6. ఫుడ్ # 6:

ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్, నూనెల్లో అన్నింటికంటే చాలా తక్కువ కొవ్వు కలిగిన నూనె ఆలివ్ ఆయిల్. సుద్దమైన ఆలివ్ ఆయిల్లో యాంటియాక్సిడెంట్ పుష్కలంగా ఉండి స్కిన్ సెల్ పునరుద్దరణను వేగవంతం చేస్తాయి.

7. ఫుడ్ # 7-

7. ఫుడ్ # 7-

క్యారెట్స్ లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది డ్యామేజ్ అయిన చర్మాన్ని మర్మత్తు చేస్తుంది. మీకు చాలా సున్నితమైన చర్మం ఉంటే, క్యారెట్ చర్మ సమస్యలన్నింటిని నివారిస్తుంది . క్యారెట్ ను పచ్చిగా అలాగే తినడం లేదా క్యారెట్ జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల మీ చర్మం తేమగా, సాఫ్ట్ గా మరియు స్మూత్ గా తయారువుతుంది.

8. ఫుడ్ # 8-

8. ఫుడ్ # 8-

టమోటో: టమోటో సిట్రస్ యాసిడ్ పుష్కలం. అందువల్ల యాంటీఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా కలిగి ఉంటాయి. అయితే, స్కిన్ టోన్ ను అద్భుతంగా ఉంచే లికోపిన్ పుష్కలంగా కలిగి ఉంటుంది. టమోటో గుజ్జులో లైకోపిన్ అధికంగా ఉండటం వల్ల సన్ బర్న్ నుండి చర్మాన్ని కాపాడుతుంది. కాబట్టి టమోటో గుజ్జును ఆలివ్ ఆయిల్ తో చేర్చి ముఖానికి పది వారాల పాటు అప్లై చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. టమోటోల్లోని యాంటిఆక్సిడెంట్స్, లైకోపిన్, హైకెరోటినాయిడ్స్ వంటివి ఫీరాడికల్స్ నుండి కాపాడుతుంది.

Story first published: Wednesday, January 27, 2016, 12:30 [IST]
Desktop Bottom Promotion