Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
చర్మ సౌందర్యం పెంచుకోవడానికి కలబందతో పాటు మిక్స్ చేసే ఆయుర్వేదిక్ రెమెడీస్..!
అద్భుతమైన చర్మ సౌందర్యం పొందడానికి అలోవెర గ్రేట్ గా సహాయపడుతుంది. కలబంద అందానికి, ఆరోగ్యానికి గ్రేట్ గా హెల్ప్ అవుతుంది. అలోవెరలో యాంటీఆక్సిడెంట్స్ మినిరల్స్ అత్యధికంగా ఉన్నాయి.. అందుకే అలోవెరను పురాతన కాలం నుండి ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. అలోవెరను ఇతర నేచురల్ పదార్థాలతో మిక్స్ చేసినప్పుడు మరిన్ని గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది. ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి.
పురాతన కాలం నుండి అలోవెరను అనేక ఆయుర్వేదిక్ రెమెడీస్ లో ఉపయోగించే వారు. ప్రస్తుత మోడ్రన్ డేస్ లో కూడా వివిధ రకాల కాస్మోటిక్ లో అలోవెర జెల్ ను ఉపయోగిస్తున్నారు. అలోవెర జెల్ ను వివిధ రకాల ప్రొడక్ట్స్ లో జోడించడానికి ముఖ్య కారణం, ఇది బ్యూటి విషయంలో బహు విధాలుగా ప్రయోజనాలను అందిస్తుంది.
అలోవెర జెల్లో విటమిన్స్, మినిరల్స్ మరియు ఇతర స్కిన్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది స్కిన్ బ్రైట్ గా మరియు హెల్తీగా మార్చుతుంది. అందుకే దీన్ని రెగ్యులర్ బ్యూటీ కేర్ లో యాక్టివ్ ఇంగ్రీడియంట్ గా జోడించుకోవడం మంచిది.
అలోవెర జెల్ల స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది. చర్మంను స్మూత్ గా మార్చుతుంది, స్కిన్ హైడ్రేషన్ లో ఉంటుంది, మొటిమలను నివారిస్తుంది.
ఇన్ని సుగుణాలున్న అలోవెరను ఇతర నేచురల్ పదార్థాలతో జోడించి ఉపయోగించడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చర్మానికి సాధ్యమైనంత వరకూ అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది?
అయితే అది ఎంత వరకూ నిజమో తెలుసుకోవాలంటే, ఈ క్రింది పదార్థాలను అలోవెర జెల్ కు మిక్స్ చేసి మెరుగైన ఫలితాలను మీరే గమనించండి.

పసుపు:
కలబందలో , పసుపు మిక్స్ చేసి ఫేస్ కు ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంలో మొటిమలు నివారించబడుతాయి. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మంలో సూక్ష్మ క్రిములను నాశనం చేసి , చర్మంలో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా నివారిస్తాయి .

కీరదోసకాయ:
కలబదం రసంలో , కీరదోసకాయ రసంను మిక్స్ చేసి ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మానికి కావల్సినంత హైడ్రేషన్ అందుతుంది. దాంతో చర్మం సాఫ్ట్ గా , స్మూత్ గా మారుతుంది.

టమోటో జ్యూస్
అలోవెర, టమోటో ఫేస్ ప్యాక్ వల్ల చర్మకణాలకు అవసరమయ్యే విటమిన్ సి, విటమిన్ ఇలు స్కిన్ ను రేడియంట్ గా మార్చుతాయి. చర్మంను హెల్తీ మార్చుతుంది.

రైస్ ఫ్లోర్
కలబంద రసంలో కొద్దిగా బియ్యం పిండి మిక్స్ చేసి, ముఖానికి ప్యాక్ వేసు కోవడం వల్ల , చర్మంలో మురికి, డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి , స్కిన్ కంప్లెక్షన్ ను మెరుగుపరుస్తుంది.

నిమ్మరసం
నిమ్మరసం మాత్రమే కాదు, నిమ్మరసంతో పాటు, అలోవెర జెల్ మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖం శుభ్రంగా మరియు సాప్ట్ గా మారుతుంది. ఈ ఫేస్ ప్యాక్ చర్మ రంద్రాల్లోపలి వరకూ చొచ్చుకుని పోయి, చర్మంను శుభ్రం చేస్తుంది.

స్ట్రాబెర్రీస్
అలోవెర జెల్ కు స్ట్రాబెర్రీ పేస్ట్ ను మిక్స్ చేసి, ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం నేచురల్ గా సాప్ట్ గా మరియు పింకిష్ గా మార్చుతుంది. . ఇది నేచురల్ స్కిన్ బ్లీచింగ్ ఏజెంట్ .

అరటి
బాగా పండిన అరటి పండును మెత్తగా చేసి అందులో అలోవెర జెల్ ను మిక్స్ చేసిముఖానికి ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం టైట్ గా మారుతుంది. చర్మం వదులుగా సాగకుండా నివారిస్తుంది

క్యారెట్
అలోవెర జెల్ కు కొద్దిగా క్యారెట్ జ్యూస్ మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఇందులో యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ అధికంగా ఉన్నాయి. ఈ ప్యాక్ వల్ల ముఖంలో ముడతలు, ఫైన్ లైన్స్ నివారించబడుతాయి



Click it and Unblock the Notifications
