Latest Updates
-
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
హెల్తీ స్కిన్ మెయింటైన్ చేయడానికి స్కిన్ ఎక్స్ ఫ్లోయేటర్స్
హెల్తీ స్కిన్ కేర్ మెయింటైన్ చేయడానికి స్కిన్ ఎక్స్ఫ్లోయేటర్ చాలా గ్రేట్ గా పనిచేస్తుంది. స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ వల్ల డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించకోవచ్చు.
రెగ్యులర్ స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ వల్ల చర్మం ఫ్రెష్ గా, కాంతివంతంగా , తేమగా కనిపిస్తుంది. ముఖ్యంగా మొటిమలు మరియు మచ్చలకు కారణమయ్యే చర్మంలోని జిడ్డు మరియు మురికిని ను తొలగిస్తుంది.
డ్రై స్కిన్ ను సహజంగా నివారించే సూపర్ ఫుడ్స్
స్కిన్ ఎక్స్ ఫ్లోయేషన్ వల్ల చర్మ రంధ్రాలు శుభ్రపడటంతో పాటు, చర్మం కాంతింతంగా మరియు ప్రకాశవంతంగా కనబడేలా చేస్తుంది. ఇంకా చర్మానికి అవసరమయ్యే బ్లడ్ సర్క్యులేషన్ అందించి , యంగ్ గా కనబడేలా చేస్తుంది.
స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ ను స్కిప్ చేయడం వల్ల తిరిగి చర్మం నిర్జీవంగా డల్ గా కనబడుతుంది. ఇది చర్మం రంద్రాలను మూసుకొనేలా చేసి, మొటిమలకు కారణం అవుతుంది. స్కిన్ ఎక్స్ ఫ్లోయేషన్ కు మన వంటగదిలోని నేచురల్ పదార్థాలతోనే చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు.
పురుషులు చర్మం సంరక్షణ కొరకు తీసుకోవల్సిన సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్
మన వంటగదిలో ఉండే నేచురల్ పదార్థాలైన సీ సాల్ట్, తేనె, బేకింగ్ సోడా, ఇలాంటివి నేచురల్ స్కిన్ ఎక్స్ ఫ్లోయేటర్స్ . ఇవీటితో పాటు మరికొన్ని స్కిన్ ఎక్స్ ఫ్లోయేటర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి . వాటిని ఈ క్రింది విధంగా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. మరి వీటిని ఎలా ఉపయోగించాలో చూద్దాం...

1. తేనె:
తేనె స్కిన్ బెస్ట్ ఫ్రెండ్ వంటింది. ఇందులో యాంటీ సెప్టిక్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇది స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది మరియు మరియు స్కిన్ రిపేర్ చేసి స్కిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇది నేచురల్ ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేయడానికి ఎక్సలెంట్ గా పనిచేస్తుంది.

2. షుగర్:
పంచదార మరో నేచురల్ స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్. ఇందులో ఉండే గ్లైకోలిక్ యాసిడ్ ప్రోటీన్స్ ను బ్రేక్ డౌన్ చేస్తుంది. డెడ్ స్కిన్ సెల్ ను దూరం చేస్తుంది. ఇది కొత్త చర్మ కణాలను ఏర్పడేలా చేస్తుంది. చర్మంను సాప్ట్ గా మరియు స్మూత్ గా మార్చుతుంది.

3. ఓట్ మీల్:
ఓట్ మీల్ కూడా నేచురల్ ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. అంతే కాదు ఇందులో ఉండే గొప్ప లక్షణాలు చర్మంలోని ఎక్సెస్ ఆయిల్ ను నివారించి చర్మం జిడ్డుగా లేకుండా చేస్తుంది.

4. పెరుగు:
పెరుగులో స్కిన్ ఎక్స్ ఫ్లోయేటింగ్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. పెరుగులో ఉండే ఎసిడిక్ నేచరల్ చర్మానికి హైడ్రేషన్ తో పాటు ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. మరియు ఇది స్కిన్ టోన్ కూడా మెరుగుపరుస్తుంది.

5. బేకింగ్ సోడ:
బేకింగ్ సోడాను ఎక్కువగా స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ మరియు క్లెన్సింగ్ కోసం ఉపయోగిస్తుంటారు . బేకింగ్ సోడాను వాటర్ తో మిక్స్ చేసి స్కిన్ ఎక్స్ ఫ్లోయేటర్ గా ఉపయోగించడం వల్ల మంచి ఫలితాను చూపెడుతుంది.

6. కాఫీ:
కాఫీ కూడా బెస్ట్ స్కిన్ ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేస్తుంది . ఇది స్కిన్ టోన్ మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కాఫీ బీన్ పౌడర్ కు ఏదైనా ఆయిల్ మిక్స్ చేసి, చర్మానికి అప్లై చేసి ఎక్స్ ఫ్లోయేటర్ గా ..రెగ్యులర్ గా ఉపయోగించుకోవచ్చు.



Click it and Unblock the Notifications