Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
2 వారాల్లో 10ఏళ్ళు యంగ్ గా కనబడేలా చేసే కోకనట్ ఆయిల్ ..!
కొబ్బరి నూనెను మన ఇండియాలో కేరళ రాష్ట్రంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వంటల్లో కూడా దీని వాడకం ఎక్కువగా ఉంది . ముఖ్యంగా కొబ్బరి నూనెను ఆరోమాటిక్ బాత్ ప్రొడక్ట్స్ లో కూడా ఉపయోగిస్తున్నారు . మార్కెట్లో చాలా విలువైన, ఎక్కువ ఉపయోగకరమైన ప్రొడక్ట్స్ లో కొబ్బరి నూనె కూడా ఒకటి. కొబ్బరి నూనె అద్భుతమైన సువాసనను కలిగి ఉండటం మాత్రమే కాదు , ఇందులో అనేకు ప్రయోజనాలు మనల్ని ఆహ్వానిస్తున్నది. ముఖ్యంగా కాస్మోటిక్స్ మరియు మెడిసినల్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్ానయి . ఆరోగ్యకరమైన జీవనశైలికి కొబ్బరి నూనె చాలా అద్భుతమైనటువంటిది. ఇది ఆల్ట్రా డ్రై స్కిన్ నివారించడంతో అనేక స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను నివారించబడుతుంది.
ముఖ్యంగా అన్ రిఫైయిండ్ లేదా ఆర్గానిక్ ప్యాక్ కలిగిన నూనెను ఉపయోగించడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అన్ రిఫైండ్ అంటే, బ్యాక్టీరియాను తొలగించడం కోసం నూనెను బ్లీచ్ లేదా ఇతర కెమికల్ ప్రొసెస్ తో తయారుచేయకపోవడం. కొబ్బరి నూనె చాలా సువాసన కలిగి ఉంటుంది. అన్ రిఫైండ్ కోకనట్ ఆయిల్ లో హానికరం కలిగించే ట్రాన్స్ ఫ్యాట్స్ కలిగి ఉండవు. రిఫైండ్ కోకనట్ ఆయిల్ ను ఎంపిక చేసుకోవడం వల్ల అందులో కెమికల్ ప్రొసెస్ నడిచి ఉండటం వల్ల, మరియు కొన్ని సందర్భాల్లో హైడ్రోజనేషన్ ను ఫలితాన్ని పొంది ఉంటుంది.
రిఫైండ్ కోకనట్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల మీకు అంతగా ఉపయోగం ఉండదు., అన్ రిఫైండ్ కోకనట్ ఆయిల్ నేచురల్ ఎలిమెంట్స్ కు చాలా దగ్గరగా ఉంటుంది . మరి కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల మన జీవనశైలిలో కలిగే కొన్ని మార్పులను ఈ క్రింది విధంగా వివరించడం జరిగినది.

ఎక్స్ ఫ్లోయేంట్ :
మీకు తెలుసా కోకనట్ ఆయిల్ ను ఒక అద్భుతమైన ఎక్సఫ్లోయేట్ గా ఉపయోగించుకోవచ్చు. అందుకు మీరు చేయాల్సిందల్లా రెండు చెంచాల కొబ్బరి నూనెలో మూడు చెంచా పంచదార మిక్స్ చేయాలి. దీన్ని జార్ లేదా డబ్బాలో స్టోర్ చేసి అవసరం అయినప్పుడు దీన్ని ఉపయోగించాలి. ఇది ఒక చౌకనై ప్రభావవంతమైన ఎక్స్ ఫ్లోయేట్ గా పనిచేస్తుంది .

మేకప్ రిమూవర్:
మేకప్ ను తొలగించడం కొద్దిగా కష్టంగా అనిపిస్తుందు కానీ, చాలా వరకూ మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వాటర్ ఫ్రూఫ్ కలిగి ఉండటం లేదా మేకప్ ను తొలగించడానికి కష్టంగా ఉండటం వల్ల ఇలాంటి మేకప్ ను కష్టం అవుతుంది. ఇలాంటి మేకప్ ను తొలగించుకోవడానికి కొబ్బరి రూనె గ్రేట్ గా సహాయపడుతుంది.దీన్ని సెన్నిసిటివ్ స్కిన్ ఫేషియల్ కు ఉపయోగిస్తే చర్మం సున్నితంగా మారుతుంది.

మాయిశ్చరైజర్
కోకనట్ ఆయిల్ ను ఫుల్ బాడీ మాయిశ్చరైజర్ గా ఉపయోగించాలి. దీన్ని విరివిగా ఉపయోగించడం వల్ల ఒక గొప్ప మాయిశ్చరైజర్ గా ఉపయోగిస్తూ వరీరానికి కాళ్ళకు మరియు చేతులకు అప్లై చేసి 15నిముషాల తర్వాత స్నానం చేస్తే చర్మం నునుపుగా తేమగా ఉన్నట్లు కనిపిస్తుంది.

కోల్డ్ సోర్ ట్రీట్మెంట్
చలికాలంలో చలి లేదా మంచుకు పెదాలు పగలడం, కాళ్ళు చేతులు కూడా ఎక్కువగా పగుళుతుంటాయి.మరి అందుకు కోకనట్ ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది. మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. మరి కోకనట్ ఆయిల్ ను సెన్సిటివ్ పెదాల మీద అప్లై చేయాలి.

సన్ బర్న్ నివారిస్తుంది
వేసవి సీజన్ లో ఎండ వేడికి చర్మం కమలడం జరుగుతుంటుంది. అలా జరగకుండా స్కిన్ టోన్ కలర్ ఫుల్ గా కాంతివంతంగా ఉండాలంటే కొబ్బరి నూనె గ్రేట్ గా సహాయపడుతుంది. సన్ బర్న్ అయిన ప్రదేశంలో కొద్దిగా కొబ్బరి నూనె అప్లై చేసి చూడండి అద్భుతమైన ఫలితాలను మీరు గమనించవచ్చు.

డియోడరెంట్
కోకనట్ ఆయిల్ ను శరీరంలో ఎక్కడ ఉపయోగించినా ఎలాంటి హాని ఉండదు. చంకల్లో కొబ్బరి నూనెను అప్లై చేయడం చెమట వాసన రాకుండా ఉంటుంది. అయితే దీన్ని అప్లై చేయడానికి జిడ్డుగా లేదా ఇబ్బంది కరంగా ఫీలైతే కోకనట్ ఆయిల్ ను షీ బటర్, ఆరో రూట్, బేకింగ్ సోడా మరియు కోకనట్ ఆయిల్ తో మిక్స్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇది యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది

హ్యాండ్ అండ్ ఫీట్ కేర్:
కొద్దిగా కొబ్బరి నూనెను చేతుల్లో వేసుకొని కూటికల్స్ మీద అప్లై చేసి మర్ధన చేయడం వల్ల మీ చేతి వేళ్ళ మరియు గోళ్ళు ఆరోగ్యంగా మరియు స్ట్రాంగ్ గా కనబడుతాయి. అదేవిధంగా డ్రై మరియు క్రాక్డ్ హీల్స్ కూడా నయం చేయబడుతాయి . కొద్దిగా కొబ్బరి నూనె కాళ్ళకు అప్లై చేసి మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

లిప్ ప్రొటెక్టర్
కొబ్బరి నూనె పెదాలను తేమగా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. పెదాలు సాఫ్ట్ గా తేమగా, పింక్ గా మార్చుతుంది.

జుట్టుకు హైడ్రేషన్
కఠినమైన గాలులు, వేడి వాతావరణం, చల్లని వాతావరణంలో జుట్టును మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంది. అలాంటప్పుడు జుట్టుకు కొబ్బరినూనె చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ముఖ్యంగా డ్యామేజ్ మరియు డాండ్రప్ మరియు హెయిర్ లాస్ ను నివారించడంలో కొబ్బరి నూనె ఉత్తమమైనది. జుట్టును సాప్ట్ గా షైనీగా మార్చడంతో పాటు జుట్టును స్ట్రాంగ్ గా ఉంచుతుంది.



Click it and Unblock the Notifications











