Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
నల్లటి బొగ్గుతో తెల్లగా నిగనిగలాడే చర్మ రహస్యం
చార్కోల్.. ! దీన్ని బొగ్గు అని పిలుస్తారు. గుర్తుందా చార్కోల్.. ? ఒకప్పుడు దీన్ని పళ్లు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించేవాళ్లు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో దీన్నే టూత్ పౌడర్ గా వాడతారు. అంతేకాదు.. పూర్వపు పద్ధతులకు మేకప్ చేసి.. ఇప్పుడు చార్కోల్ పేస్ట్ లు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. మరి దీన్ని మన పూర్వీకులు ఊరికే వాడిఉంటారా ? మంచి ఫలితాలు చూసే ఉంటారు కదూ ? అయితే ఇది కేవలం పళ్లు తెల్లగా మార్చడానికే కాదు.. మిమ్మల్ని అందంగా మార్చడానికి కూడా ఉపయోగపడుతుందంటే నమ్మలేరు కదూ !!
ప్రకాశవంతమైన చర్మ సౌందర్యాన్ని అందించే ఫ్రూట్ జ్యూసులు
బొగ్గుని చర్మంపై రుద్దడం వల్ల.. మిమ్మల్ని థ్రిల్ చేసే రిజల్ట్స్ ఉంటాయని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. అంతేకాదు రెగ్యులర్ గా దీన్ని బ్యూటీ సీక్రెట్ గా ఉపయోగించవచ్చని సూచిస్తున్నారు. దీన్ని చర్మంపై రబ్ చేయడం వల్ల టాక్సిన్స్ తొలగిపోయి.. డీప్ క్లెన్సర్ లా పనిచేస్తుంది.
పసుపు రంగు దంతాలను నివారించే ఉత్తమ పదార్థాలు
బొగ్గుని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే.. అనేక బ్యూటీ బెన్ఫిట్స్ పొందవచ్చని స్టడీస్ చెబుతున్నాయి. పాయిజన్ తీసుకున్న వాళ్లకు యాక్టివేటెడ్ చార్కోల్ ని.. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కి ఉపయోగిస్తారు. మెరిసే చర్మానికి, ఆరోగ్యకరమైన జుట్టుకి.. చార్కోల్ ఎలా ఉపయోగపడుతుంది.. ఎలాంటి ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుందా ? ఐతే ఇప్పుడే ఈ ఆర్టికల్ లోకి ఎంటర్ అయిపోండి..

ముఖంపై గుంతలు
చార్కోల్ ని ఫేస్ మాస్క్ లా అప్లై చేస్తే.. చర్మంపై ఉన్న దుమ్ము, ధూళి తొలగిపోయి, ముఖంపై ఉన్న గుంతలు కనిపించకుండా మాయం చేస్తుంది. అలాగే ముఖానికి ఫ్రెష్ లుక్ తీసుకొస్తుంది. ఒకవేళ స్ర్కబ్ చేస్తే.. డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.

జిడ్డు చర్మానికి
మీది ఆయిలీ స్కిన్ అయితే.. యాక్టివేటెడ్ చార్కోల్ ఉపయోగిస్తే.. జిడ్డు వదిలిపోవాల్సిందే. ఈ మిశ్రమంతో ఫేస్ కి మాస్క్ అప్లై చేస్తే.. అదనపు ఆయిల్ తొలగించి.. చర్మాన్ని స్మూత్ గా మారుస్తుంది. వారానికి ఒకసారి లేదా రెండుసార్లు మాస్క్ వేసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.

యాక్నే
యాక్నే తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటే.. చార్కోల్ చక్కటి పరిష్కారం. ఒకవేళ అక్కడక్కడ మొటిమలు ఉంటే.. అవి ఉన్న ప్రాంతంలో మాత్రమే ఈ చార్కోల్ అప్లై చేయండి. లేదా ముఖానికి మొత్తం అప్లై చేసినా ప్రాబ్లమ్ ఉండదు.

డీప్ క్లీన్
యాక్టివేటెడ్ చార్కోల్ ఉన్న సోప్స్ కానీ, ఇంకేదైనా ఫేస్ వాష్ లు గానీ ఉపయోగించడం వల్ల చర్మానికి మంచి క్లెన్సింగ్ లా ఉపయోగపడుతుంది. కానీ రోజూ ఉపయోగించకపోవడం మంచిది.

చర్మ సమస్యలు
చర్మంపై ఏదైనా గాట్లు, లేదా వంటచేసేటప్పుడు కోసుకుపోవడం వంటి సమస్యలు ఎదురైనప్పుడు ఆ గాయం త్వరగా మానడానికి యాక్టివేటెడ్ చార్కోల్ మంచి ఉపశమనం కలిగిస్తుంది. చార్కోల్ పేస్ట్ ని గాయంపై అప్లై చేస్తే.. ఇన్ఫెక్షన్ కాకుండా నివారించవచ్చు. అలాగే వాపు, నొప్పుని కూడా వెంటనే తగ్గిస్తుంది. బొగ్గు పొడి, నీళ్లు కలిపి పేస్ట్ లా మిక్స్ చేసి అప్లై చేయడమే.

జుట్టుకి
చార్కోల్ ని జుట్టుకి అప్లై చేస్తే.. జిడ్డు, దుమ్ము, టాక్సిన్స్ తొలగిపోతాయి. చర్మంపై ఎలా పనిచేస్తుందో అలాగే.. జుట్టుపైనా పనిచేస్తుంది. కావాలంటే.. చార్కోల్ ఉన్న షాంపూలు ఉపయోగిస్తే సరిపోతుంది. లేదంటే.. రెగ్యులర్ షాంపూకి ఒక టీస్పూన్ యాక్టివేటెడ్ చార్కోల్ కలిపి వాడిత సరిపోతుంది. అయితే చార్కోల్ ఎక్కడ లభిస్తుందా అని ఆలోచిస్తున్నారా ? చార్కోల్ పౌడర్ లేదా టాబ్లెట్స్ మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి.

ఒత్తైన జుట్టుడి
జుట్టు పలుచగా మారిందంటే.. రెగ్యులర్ షాంపూకి బదులు యాక్టివేటెడ్ చార్కోల్ షాంపూ ఉపయోగించడం మంచిది. ఇది జుట్టులో ఉండే డర్ట్ తొలగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

స్కాల్ఫ్ ప్రాబ్లమ్స్
తలలో చుండ్రు, దురద, జిడ్డుదనం, వంటి సమస్యలకు చక్కటి పరిష్కారం చార్కోల్. స్కాల్ఫ్ ట్రీట్మెంట్ గా దీన్ని ఉపయోగించవచ్చు. చేయాల్సిందల్లా ఒక్కటే మీ రెగ్యులర్ షాంపూలో కాస్త చార్కోల్ కలిపితే సరిపోతుంది.
చూశారుగా చార్కోల్ పవర్ ఫుల్ బ్యూటీ బెన్ఫిట్స్. చార్కోల్ పౌడర్ లేదా టాబ్లెట్స్ తీసుకుని.. ఇంట్లో పెట్టుకోండి. ఎలాంటి సమస్యకైనా చక్కగా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications