Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పీలింగ్ స్కిన్ నివారించే సింపుల్ హోం రెమిడీస్
మనం చర్మం రక్షణ కవచం లాంటిది. మన శరీరంలోకి సూక్ష్మజీవులు ప్రవేశించకుండా, ఎండ, వాన, గాలి, వేడి, కాలుష్యం తట్టుకొనేందుకు ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. చర్మం యొక్క బయట లేయర్ ఎపిడెర్మిస్, మద్యలేయర్ ను డెర్మిస్, లోపలి లేయర్ ను హైపోడెర్మిస్ అని పిలుస్తారు. స్కిన్ అవుటర్ లేయర్ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొత్త కణాలను మార్పు చేసుకుంటుంది.
అలాంటి సందర్భాల్లో శరీరం నుంచి చర్మం పీక్కుపోయినప్పుడు, లేదా తొలగిపోయినప్పుడు, చర్మం ఎక్కువగా పీక్కుపోతుంది. కొన్ని సందర్భాల్లో యూవీ కిరణాలు చర్మం మీద నేరుగాపడినప్పుడు, చర్మం యొక్క అవుటర్ స్కిన్ తొలగిపోతుంది.
పొడి చర్మం కలవారికి కూడా ఈ పీలింగ్ స్కిన్ సమస్య సహజంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాతావరణంలో మార్పులు, స్కిన్ ఇన్ఫెక్షన్, స్కిన్ అలర్జీ, స్కిన్ క్యాన్సర్, ఎక్జిమా, విటమిన్ లోపం వంటి కారణాల వల్ల కూడా పీలింగ్ స్కిన్ సమస్య ఏర్పడుతుంది.
ఇలా జరిగినప్పుడు, చర్మం మందపడటం, చర్మంలో రాషెస్, చర్మం దురదపెట్టడం, చర్మం ఇన్ఫ్లమేషన్ లక్షణాలుగా గుర్తించాలి. ఈ స్కిన్ సమస్యను నివారించుకోవడానికి కొన్ని నేచురల్ పదార్థాలు గ్రేట్ గా సహాయపడతాయి. మరి అవేంటో తెలుసుకుందాం..

ఆలివ్ ఆయిల్:
ఆలివ్ ఆయిల్ చర్మానికి, హెయిర్ కు ఏవిధంగా పనిచేస్తుందో మనకు తెలుసు. ఈ ఎసెన్షియల్ ఆయిల్ పీలింగ్ స్కిన్ నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఆలివ్ ఆయిల్ ను నేరుగా చర్మానికి అప్లై చేసి, కొద్దిసేపు అలాగే వదిలేసి, తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ పద్దతి మూడు, నాలుగు సార్లు రిపీట్ చేయడం మంచిది.

గ్రేప్ సీడ్ ఆయిల్:
పీలింగ్ స్కిన్ నివారించడానికి గ్రేప్ సీడ్ ఆయిల్ గ్రేట్ గా పనిచేస్తుంది. గ్రేప్ సీడ్ ఆయిల్ ను సమస్య ఉన్నప్రదేశంలో అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజులో మూడు నాలుగు సార్లు చేస్తుంటే పీలింగ్ స్కిన్ సమస్యను నివారించుకోవచ్చు

కీరదోసకాయ:
కీరదోసకాయను స్కిన్ ఫ్రెండ్ గా సూచిస్తారు. ఎందుకంటే ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది . పీలింగ్ స్కిన్ ను నివారిస్తుంది . కీరదోసకాయను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి . 15 నిముషాలు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

గందం, పసుపు, తేనె:
ఈ మూడు పదార్థాలు ఒక్కోదానికి ఒక్కో లక్షణం కలిగి ఉన్నాయి. ముఖ్యంగా పీలింగ్ స్కిన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి . ఈ మూడింటిని మిక్స్ చేసి , ఈ పేస్ట్ ను చర్మానికి అప్లై చేయాలి . కొద్దిసేపు అలాగే వదిలేసి, తర్వాత కడిగేసుకోవాలి.

బొప్పాయి:
బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి . పీలింగ్ స్కిన్ నివారించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. కొన్ని బొప్పాయి ముక్కలను మెత్తగా మ్యాష్ చేసి. చర్మం మీద అప్లై చేయాలి. అలాగే ఉంచి, కొద్దిసేపటి తర్వాత కడిగేసుకోవాలి. కొద్దిగా మార్పు వచ్చే వరకూ దీన్ని ఫాలో అవ్వొచ్చు.

ఆపిల్స్:
ఈ హెల్తీ ఫ్రూట్ లో పీలింగ్ లక్షణాలను నివారించే గుణాలున్నాయి. పీలింగ్ స్కిన్ నివారించడానికి ఇది ఒక సులభ మార్గం. ఆపిల్ ను మొత్తగా పేస్ట్ చేసి చర్మానికి అప్లై చేయాలి . అప్లై చేసిన కొద్దిసేపటి వరకూ అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications