Latest Updates
-
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు!
సమ్మర్ లో చర్మాన్ని కూల్ గా ఉంచే ఫ్రూటీ ఫేస్ ప్యాక్స్...
వేసవిలో ఎండల కారణంగా, వాతావరణంలో వేడి కారణంగా... శరీరంలో ఉష్ణోగ్రతలో మార్పుల కారణంగా అధిక వేడి, చెమటల వల్ల చర్మం కమిలిపోవడం, స్కిన్ రాషెస్ వస్తుంటాయి. ఈ అసౌకర్యమైన భావను ముఖ్యంగా చర్మలోని రంధ్రాలు మీద తీవ్రప్రభావం చూపుతుంది.
వేసవిలో ఇలా చెమట, వేడి వల్ల తెరచుకొన్న చర్మ రంద్రాల్లో దుమ్ము, ధూళి చేరి మొటిమలు, మచ్చలు, బొబ్బలకు దారితీస్తుంది. ఇటువంటి అసౌకర్యమైన..ఇబ్బందికర పరిస్థితిని దూరం చేసుకోవాలంటే...సమ్మర్లో చర్మానికి కూలింగ్ ఎఫెక్ట్ ను అందించే కూలింగ్ పదార్థాలతో ఫేస్ ప్యాక్ లను వేసుకోవాలి,
వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల, శరీరంలోని నీరు ఎక్కువగా చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది. కాబట్టి, రెగ్యులర్ డైట్ లో కొన్ని లిక్విడ్స్ ఉన్నఆహారాలను చేర్చుకోవడం చాలా అవసరం. వేసవిలో తీసుకొనే లిక్విడ్ పదార్థాలు పెంచడం వల్ల వేసవిలో ఎలాంటి స్కిన్ రాషెస్ రాకుండా నివారించుకోవచ్చు .
నీరు చర్మాన్ని శుభ్రం చేస్తాయి. కాబట్టి, వేసవిలో కనీసం మూడు, నాలుగు సార్లు ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల బ్యూటిఫుల్ గా కనబడుతారు. అలాగే, వేసవిలో కూల్ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల వేసవి వేడిని ఎదుర్కోవచ్చని బ్యూటీ ఎక్సపర్ట్ సూచిస్తున్నారు . ఈ హాట్ సీజన్ లో మీకు ఇష్టమైన 7 కూల్ ఫేస్ ప్యాక్ ను కూడా వారు సూచిస్తున్నారు.
ఈ కూల్ ఫేస్ ప్యాక్ లను అప్లై చేసినప్పుడు , వెంటనే మీ చర్మం కూల్ గా ఫీలవడాన్ని..తక్షణ మార్పును మీరు గమనిస్తారు . మరి కూల్ ఫేస్ ప్యాక్ ఏంటో ఒక సారి చూద్దాం...

1. కుకుంబర్ ఫేస్ ప్యాక్:
ఇది వండర్ ఫుల్ వాటర్ బేస్డ్ వెజిటేబుల్ చర్మానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది . వేసవిలో తక్కువగా చెమట పట్టాలంటే , కుకుంబర్ ఫేస్ ప్యాక్ కు ప్రాధాన్యత ఇవ్వండి. ఇది చర్మ రంద్రాలు తెరచుకొనేలా చేసి కూల్ గా అనుభూతి కలిగిస్తుంది.

2. వాటర్ మెలోన్ ఫేస్ ప్యాక్:
ఈ రెడ్ ఫ్రూట్ ఎక్కువ ఎనర్జీని అందిస్తుంది . సమ్మర్ లో హీట్ ను బీట్ చేయాలంటే వాటర్ మెలోన్ తో ఫేస్ ప్యాక్ వేసుకోండి . వాటర్ మెలోన్ గుజ్జును ఫేస్ కు ప్యాక్ లా వేసుకోవడం వల్ల చర్మానికి చల్లగా ఉంటుంది . తర్వాత రోజ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.

3. ఆరెంజ్ ఫేస్ ప్యాక్:
సిట్రష్ ఫేస్ ప్యాక్ ను ఏదీ బీట్ చేయలేవు . ఎందుకంటే వీటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇది చర్మంను ఫ్రెష్ గా..చల్లని అనుభూతికి గురిచేస్తుంది . ఆరెంజ్ గుజ్జును ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి . ఆరెంజ్ జ్యూస్ కు కొద్దిగా నిమ్మరసం జోడించి మసాజ్ చేయడంవల్ల సమ్మర్ టాన్ నివారించబడుతుంది.

4. మస్క్ మెలోన్ ఫేస్ ప్యాక్:
మస్క్ మెలోన్ మంచి వాసన కలిగి ఉంటుంది. ఇది ఒక బ్లిస్ ఫుల్ ఫ్రూట్ . ఇది చర్మానికి గ్రేట్ గా సహాయపడుతుంది . మస్క్ మెలోన్ ఫేస్ ప్యాక్ చర్మానికి మంచి గ్లో అందిస్తుంది మరియు స్కిన్ కంప్లెక్షన్స అందిస్తుంది. మస్క్ మెలోన్ మెత్తగా చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల స్కిన్ కంప్లెక్షన్ పెరుగుతుంది . మరియు చర్మం కూల్ గా మార్చుతుంది.

5. గ్రేప్ ఫేస్ ప్యాక్:
పర్పుల్ గ్రేప్ బెస్ట్ సమ్మర్ ఫ్రూట్ . దీన్ని ఫేస్ ప్యాక్ గా ఉపయోగించుకోవచ్చు . గ్రేప్ గుజ్జుేలో విటమిన్స్, అధికంగా ఉండటం వల్ల చర్మం మరింత కూల్ గా ఫీలవుతుంది . ఇంకా ఈ ఫేస్ ప్యాక్ వల్ల మొటిమలు మరియు మచ్చలు నివారించబడుతాయి.

6. కొబ్బరి నీళ్ళతో ఫేస్ ప్యాక్:
వేసవిలో ఎక్కువ చెమటలు పడుతున్నట్లైతే కొబ్బరి నీళ్ళతో ముఖం కడుక్కోవడం చాలా మంచిది. ఇది శరీరానికి అంతర్గతంగానే కాదు, బహిర్గతంగా కూడా మంచి కూలింగ్ ఎఫెక్ట్ ను అందిస్తుంది . ఈ ఫ్రూట్ పల్ప్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. కాబట్టి, దీన్ని నిర్లక్ష్యం చేయకండి.

7. స్ట్రాబెర్రీ ఫేస్ ప్యాక్:
గుప్పెడు స్ట్రాబెర్రీస్ ను మెత్తగా పేస్ట్ చేసి ఫేస్ ప్యాక్ గా వేసుకోవాలి . ఈ చిన్న ఫ్రూట్స్ ఉండే గుణాలు చర్మరంద్రాలను తెరచుకొనేలా చేసి బ్లాక్ హెడ్స్ ను మరియు వైట్ హెడ్స్ ను తొలగిస్తుంది.



Click it and Unblock the Notifications