Latest Updates
-
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
కేవలం ఏడు రోజుల్లో పెళ్లి కళ పొందడానికి.. అమేజింగ్ టిప్స్..!!
పెళ్లి చేసుకోబోతున్నారంటే.. ఫుల్ బిజీగా ఉంటారు. షాపింగ్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ని ఆహ్వానించడంతో పాటు.. రకరకాల పనుల్లో చాలా బిజీగా గడపాల్సి ఉంటుంది. అలాగే.. ముఖంలో గ్లో గురించి కూడా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. పెళ్లి సమయంలో.. పెళ్లి కూతురిగా అందరినీ ఆకట్టుకోవడం అంత సులువైన విషయం కాదు.
చర్మం నిర్జీవంగా కనిపించడం, కళ్లు అలసిపోవడం, జుట్టు డల్ గా మారడం వంటి సమస్యలు రాకుండా.. జాగ్రత్త పడాలి. పెళ్లికి ఇంకా 30 రోజులు ఉన్నాయంటే.. మీ ముఖంలో మ్యాజికల్ గ్లో తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదు. అదే 15 రోజులు ఉన్నాయంటే.. గ్లోయింగ్ స్కిన్ తీసుకురావడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. అదే.. ఏడు రోజులే ఉంటే.. చాలా వేగంగా.. గ్లోయింగ్ స్కిన్ పొందేలా జాగ్రత్త పడాలి.
అందంగా, ఎట్రాక్టివ్ కనిపించాలంటే.. ముందు ప్రశాంతంగా ఉండాలి. ముఖ్యమైన పనులు వేగంగా చేసుకోవాలి. ముఖ్యంగా ఎనిమిది గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. బంధువులు, ఫ్రెండ్స్ బాధ్యతలు వేరేవాళ్లకు అప్పగించాలి. అలాగే.. ఏడు రోజులపాటు.. కొన్ని చిట్కాలు ఫాలో అయితే.. బ్రైడల్ గ్లో మీ సొంతమవుతుంది.

కొత్త ప్రొడక్ట్స్ కి నో చెప్పడం
పెళ్లికి వారం ఉంది అన్నప్పుడు ఎట్టిపరిస్థితుల్లో కొత్త ప్రొడక్ట్స్ చర్మంపై ప్రయత్నించకండి. ఇవి ఇన్ల్ఫమేషన్, చర్మం పగుళ్లకి కారణమవుతాయి. అలాగే న్యాచురల్ పదార్థాలు ఉపయోగించి మెరుగైన ఫలితాలు పొందడం మంచిది.

పోషకాహారం
ఆరోగ్యం బావుంటేనే.. అందం మీ సొంతమవుతుంది. కనీసం ఈ ఏడు రోజులు షుగరీ, సార్చీ ఫుడ్స్ కి దూరంగా ఉండండి. ముఖ్యంగా సోడా వంటివి తీసుకుంటే.. చర్మం పేలవంగా, నిర్జీవంగా మారుతుంది. కాబట్టి తాజా కూరగాయలు, స్మూతీస్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఇవి చర్మంలో ఎలాస్టిసిటీని పెంచుతాయి. రేడియంట్ గ్లో అందిస్తాయి.

ఎక్స్ ఫోలియేట్
డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడం వల్ల చర్మంలో కొత్త మెరుపు సొంతమవుతుంది. కెమికల్స్ ఉండే.. ఎక్స్ ఫోలియేటర్స్ కంటే.. ఇంట్లోనే తయారు చేసుకునే ఈ స్క్రబ్ చర్మానికి ఎలాంటి హాని చేయదు.

కావాల్సిన పదార్థాలు
1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి
1 టీ స్పూన్ తేనె
అర టీస్పూన్ పసుపు
అర కప్పు తాజా పెరుగు

తయారు చేసుకునే విధానం
బియ్యం పిండి, పెరుగు, పసుపు ఒక గిన్నెలో కలుపుకోవాలి. తేనె కూడా కలిపి బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు శరీరానికి పట్టించాలి. ఆరిన తర్వాత.. చల్లటి నీళ్లు చల్లుకోవాలి. ఇప్పుడు గుండ్రంగా.. స్క్రబ్ చేసుకుని.. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత బాడీ లోషన్ అప్లై చేయాలి.

చర్మానికి బొప్పాయి
బొప్పాయిలో పపైన్ ఉంటుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ నేచర్ ఉంటుంది. ఇది.. కాంప్లెక్షన్ ని బ్రైట్ గా మారుస్తుంది. మాయిశ్చరైజర్ ని బ్యాలెన్స్ చేస్తుంది.

కావాల్సిన పదార్థాలు
పండిన బొప్పాయి
1 టీస్పూన్ గంధం పొడి
1 టీస్పూన్ తేనె

తయారు చేసుకునే విధానం
బాగా పండిన బొప్పాని మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. గంధం, తేనె కలుపుకోవాలి. అన్నింటినీ బాగా పేస్ట్ చేసుకుని.. చర్మానికి పట్టించాలి. 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు రోజ్ వాటర్ అప్లై చేయాలి.

కళ్లకు
కళ్ల చుట్టూ ఉండే చర్మం చాలా సున్నితంగా, పలుచగా ఉంటుంది. అలాగే.,. ఏజింగ్ సంకేతాలను ఎక్కువగా చూపిస్తాయి. కాబట్టి.. ప్రతి రోజూ రాత్రి పడుకోవడానికి ముందు.. ఎసెన్షియల్ ఆయిల్ తో మసాజ్ చేసుకోవాలి. ఇది.. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే వాడిన టీ బ్యాగ్ కళ్లపై పెట్టుకోవడం వల్ల కళ్ల కింద వలయాలు తగ్గిపోతాయి.



Click it and Unblock the Notifications
