Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
హోం మేడ్ బాడీ స్ర్కబ్ :డ్రై స్కిన్ కేర్ టిప్స్
వింటర్ లోనే కాదు.. వింటర్ సీజన్ చివరి రోజుల్లో కూడా చర్మ సమస్యలు ఎదురవుతాయి. చర్మం డల్ గా, పొడిబారిపోయి తీవ్ర ఇబ్బందికి గురిచేస్తుంది. చలికాలం కాస్త ఆహ్లాదంగా ఉన్నా.. చర్మ సంరక్షణ విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకోవాలి. అప్పుడే మీరు మెచ్చిన అందం మీ సొంతమవుతుంది.
జలుబు, పొడి చర్మం సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గాలిలో తడి లేకపోవడం వల్ల మీ చర్మం పొడిబారుతుంది. మీరు ముందుగానే జాగ్రత్త తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. చర్మం పొడిబారి తీవ్ర ఇబ్బందికి గురిచేస్తుంటే.. కొన్ని రకాల న్యాచురల్ స్క్రబ్స్ తయారు చేసుకుని వాడితే.. మంచి ఫలితం ఉంటుంది. పొడిచర్మం ద్వారా వేధించే.. దురద, పొక్కులు సమస్య నుంచి ఈ స్క్రబ్స్ ద్వారా బయటపడవచ్చు.
కేవలం సబ్బు ఉపయోగించి మీ చర్మం నుంచి మలినాల్ని, డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడం అంత ఈజీ కాదు. కాబట్టి పొడిచర్మాన్ని స్మూత్ గా మార్చుకునే అద్భుతమైన హోం మేడ్ స్క్రబ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా మీ చర్మం కోల్పోయిన తేమను అందిచడం ఈజీ అవుతుంది. హోంమేడ్ స్ర్కబ్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

తేనె, ఉప్పు
పొడిబారిన చర్మానికి తేనె చక్కటి పరిష్కారం. అయితే ఉప్పు, తేనెతో తయారు చేసిన స్క్రబ్ ఉపయోగిస్తే.. పొడిచర్మానికి అద్భుతమైన పరిష్కారం. సముద్రపు ఉప్పు, తేనెను బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై సున్నితంగా స్క్రబ్ చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది.

బాదాం, కార్న్ ఫ్లోర్
బాదం, కార్న్ ఫ్లోర్ స్క్రబ్స్ డ్రై స్కిన్ కి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బాదాం పొడి, కార్న్ ఫ్లోర్, జొజొబా ఆయిల్, చక్కెర, కొబ్బరి నూనె తీసుకుని బాగా కలపాలి. అందులోకి తేనె లేదా నిమ్మ రసం కలిపి.. 5 నిమిషాలపాటు స్క్రబ్ చేసుకుంటే మంచి పలితం ఉంటుంది.

కొబ్బరినూనె
వెనీలా ఎక్స్ ట్రాక్ట్, కొబ్బరి నూనె సమానంగా తీసుకోవాలి. అందులోకి కాస్త పంచదార మిక్స్ చేసి.. కాసేపు స్క్రబ్ చేసి.. తర్వాత శుభ్రం చేసుకోవాలి.

పాలు, బేబీ ఆయిల్
పాలు, బేబీ ఆయిల్ చర్మాన్ని స్మూత్ గా మార్చేస్తాయి. 5 కప్పుల గోరువెచ్చని నీటిలో ఒక కప్పు పాలు కలపాలి. అందులో పాదాలను 5 నిమిషాలు ఉంచాలి. తర్వాత చక్కెర, ఉప్పు, బేబీ ఆయిల్ కలిపిన మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేయాలి. కాసేపు బాగా మసాజ్ చేసి శుభ్రం చేసుకోవాలి.

రోజ్ పెటల్స్
ఒక జార్ తీసుకుని కొబ్బరినూనె, గులాబీ రెక్కలు, పంచదార కలపాలి. జోజోబా లేదా ఆల్మండ్ ఆయిల్ కూడా కలపాలి. వాడే ముందు బాగా స్మాష్ చేసి ఉపయోగించాలి.

ఉప్పు, నూనె
రాళ్ల ఉప్పు, అర కప్పు బాదం నూనె, ఆలివ్ నూనె 2టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. దానికి 1 స్పూన్ వాము పువ్వు, తులసి ఆకులు, నిమ్మ రసం కలపాలి. మిశ్రమాన్ని బాగా కలపాలి.శరీరమంతా మర్దనా చేసుకోవాలి.

కాఫీ
కాఫీ పొదలు ఏమి శీతాకాలంలో పొడి చర్మం చికిత్స తేలికపాటి శరీరం స్క్రబ్స్ ఉన్నాయి? టేక్ ½ కప్ తాజాగా మరిగించి కాఫీ గ్రౌండ్ మరియు పిప్పరమెంటు బిళ్ళ నూనె, వనిల్లా సారం, ఆలివ్ నూనె మరియు గోధుమ చక్కెర తో అది కలపాలి. మీ శరీరం తేమగా మరియు అన్ని పైగా వర్తిస్తాయి. బాగా శుభ్రం చేయు.



Click it and Unblock the Notifications