Latest Updates
-
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026 -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా?
సమ్మర్ లో జిడ్డు చర్మానికి గుడ్ బై చెప్పే హోంమేడ్ ఫేస్ ప్యాక్స్
సమ్మర్ ఒకవైపు వేడిగాలులు, ఉక్కపోత, మండే ఎండలు, దాహం వంటి రకరకాల సమస్యలు ఇబ్బంది పెడతాయి. దీనికి తోడు శరీరమంతా బంక బంకగా మారిపోతుంది. అలాగే ఫేస్ గురించి చెప్పనక్కరలేదు. ఎందుకంటే.. ఈ వేడి కారణంగా.. ఎన్ని సార్లు ఫేస్ వాష్ చేసినా.. జిడ్డు కారుతూనే ఉంటుంది. ఎన్ని సన్ స్క్రీన్ లోషన్స్, ఎన్ని క్రీమ్స్ వాడినా.. జిడ్డు మాత్రం వదిలిపెట్టదు.
సాధారణంగా ఆయిలీ స్కిన్ ఏ సీజన్ లో అయినా సమస్యే. ఇక సమ్మర్ ఇది మరింత ఇబ్బందికి గురిచేస్తుంది. బయటకు వెళ్లినా, ఇంట్లోనే ఉన్నా కూడా చర్మం జిడ్డుకారుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యతో బాధపడేవాళ్లు హోంమేడ్ ఫేస్ ప్యాక్స్ ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ హోంమేడ్ ఫేస్ ప్యాక్స్ ఉపయోగించడం వల్ల ఆయిల్ ఫ్రీగానే కాకుండా.. చర్మానికి తాజా లుక్ ని ఇస్తూ.. హెల్తీగా ఉండటానికి సహాయపడతాయి.
ఈ సమ్మర్ సీజన్ లో ఆయిల్ స్కిన్ కి గుడ్ చెప్పడానికి మీ ముందు చక్కటి సింపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఆలస్యం చేయకుండా.. ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ ప్రయత్నించి చూడండి. తేడా మీకే తెలుస్తుంది. ఈజీగా తయారు చేసే ఈ ఫేస్ ప్యాక్స్ ఏంటో ఇప్పుడే చూసేద్దామా..

ముల్తానీ మట్టి
ముల్తానీ మట్టికి, రోజ్ వాటర్ మిక్స్ చేసి.. పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్ ని ముఖానికి మెడకి అప్లై చేయాలి. బాగా ఆరిన తర్వాత ఐస్ క్యూబ్ తో మసాజ్ చేసి.. శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల ఆయిలీ స్కిన్ నివారించవచ్చు.

ఓట్ మీల్, అలోవెరా స్క్రబ్
అలోవెరాలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ అలర్జిటిక్ గుణాలు ఉండటం వల్ల ఇది ఆయిలీ స్కిన్ ని నివారిస్తుంది. గుప్పెడు డ్రై ఓట్స్, అలోవెరా జెల్ తీసుకుని బాగా మిక్స్ చేసి ఫేస్ కి మసాజ్ చేయాలి. 5 నిమిషాల పాటు మసాజ్ చేశాక 15 తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

బియ్యం పిండి
2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ తేనె, కొంచెం దోసకాయ జ్యూస్ లేదా దోసకాయముక్కలు యాడ్ చేయాలి. కుకుంబర్ జ్యూస్ ఎక్కువగా తీసుకుని.. బాగా పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే జిడ్డు వదిలి.. గ్లోయింగ్ స్కిన్ పొందుతారు.

టమోటా
టమోటా గుజ్జు తీసి, కొంచెం బియ్యం పిండి, 1 టీస్పూన్ తేనె కలపి.. బాగా పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. ఫ్రెష్ లుక్ మీ సొంతమవుతుంది.

ఆరంజ్ పీల్
నారింజ తొక్కలను బాగా ఎండబెట్టి పొడి చేయాలి. ఈ పౌడర్ కి పెరుగు కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి శుభ్రం చేసుకుంటే.. చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

ఆరంజ్ గుజ్జు
3 టేబుల్ స్పూన్ల శనగపిండి, నారింజ గుజ్జు కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఒకవేళ అవసరమైతే.. ఆరంజ్ జ్యూస్ ఉపయోగించవచ్చు. ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. జిడ్డు వదిలిపోతుంది.

స్ట్రాబెర్రీ
కొన్ని స్ట్రాబెర్రీలు తీసుకుని.. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పెరుగు కలిపి.. పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. ఆయిలీ స్కిన్ కి గుడ్ బై చెప్పవచ్చు. అలాగే.. ఇది మీకు కూలింగ్ ఫీలింగ్ ఇస్తుంది.

బంగాళదుంప
బంగాళదుంప రసం తీసి.. నిమ్మరసం కలపాలి. ఈ రెండింటిని 2 టేబుల్ స్పూన్ల శనగపిండికి కలపాలి. ఈ పేస్ట్ ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

అరటిపండు
బాగా పండిన అరటిపండును గుజ్జులా తయారు చేసుకోవాలి. కొన్ని పుదీనా ఆకులను పేస్ట్ చేసి కలపాలి. ఒక టీస్పూన్ తేనె, కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. వీటన్నింటిని బాగా మిక్స్ చేసి అప్లై చేసి ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

మామిడిపండు
బాగా పండిన మామిడిపండు గుజ్జు తీసి స్మూత్ పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై బాగా మసాజ్ చేయాలి. 10 నిమిషాలు ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం పొందవచ్చు.



Click it and Unblock the Notifications