Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ అద్భుతమైన లెమన్ ఫేస్ ప్యాక్స్ ను మీరు ప్రయత్నించాలి
నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. అలాగే, వీటిలో కొన్ని ముఖ్యమైన మినరల్స్ తో పాటు విటమిన్స్ కూడా లభ్యమవుతాయి.
అయితే, నిమ్మను కేవలం ఆరోగ్య ప్రయోజనాలకే పరిమితం చేయకూడదు. దీనిలో సౌందర్యాన్ని పెంపొందించే గుణాలు కూడా అధికం. ఈ విషయం మీకు తెలుసా? అవును, మీరు చదివింది నిజమే. నిమ్మని మాస్క్స్ రూపంలో అలాగే ప్యాక్స్ రూపంలో వాడితే యౌవనమైన ఆలాగే అందమైన చర్మం మీ సొంతమవుతుంది.

స్కిన్ ట్యాన్, బ్లేమిషెష్, డ్రై స్కిన్ వంటి సాధారణ చర్మ సమస్యలు మనందరికీ పరిచయమే. అయితే, వీటన్నిటికీ ఆల్ ఇన్ వన్ పరిష్కారంగా ఈ ఎండాకాలంలో నిమ్మకాయను ప్రయత్నించవచ్చు. ఈ సిట్రిక్ ఫ్రూట్ ని ఎండాకాలంలో చర్మసౌందర్యానికి వినియోగిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఎండాకాలం, నిమ్మకాయలు విరివిగా లభ్యమవుతాయి. కాబట్టి, ఈ సారి నిమ్మకాయలను తీసుకువచ్చినప్పుడు నిమ్మతో తయారుచేసే ఫేస్ ప్యాక్స్ ను ప్రయత్నించి చూడండి.
అయితే, నిమ్మను సౌందర్య ప్రయోజనం కోసం ఎలా వాడాలా అన్న సందేహంలో ఉన్నారా? అయితే, దిగులు చెందకండి. మీ ప్రశ్నకు ఈ ఆర్టికల్ సమాధానంగా పనికి వస్తుంది. నిమ్మ ద్వారా చర్మానికి అందే ప్రయోజనాల గురించి ఈ ఆర్టికల్ వివరంగా తెలుపుతుంది. నిమ్మను ప్యాక్స్ అలాగే మాస్క్స్ రూపంలో వాడి అందమైన చర్మాన్ని ఎలా పొందాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

నిమ్మ మరియు హనీ ఫేస్ ప్యాక్:
నిమ్మలో విటమిన్ సి లభ్యమవుతుంది. అలాగే ఇందులో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు తోడ్పడతాయి. నిమ్మను తీసుకోవడం ద్వారా చర్మం ఆరోగ్యంగా అలాగే కోమలంగా ఉంటుంది. చర్మాన్ని కాంతివంగా మార్చేందుకు నిమ్మను ఏ విధంగా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొంత నిమ్మను గ్రేట్ చేసుకుని తేనెలో కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేయండి. పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తరువాత వాష్ చేసి తడిని తుడవండి. ఈ రెమెడీని వారానికి రెండు సార్లు పాటిస్తే మంచి ఫలితం పొందవచ్చు.
కావలసిన పదార్థాలు:
2-3 టేబుల్ స్పూన్ల నిమ్మరసం
1 టేబుల్ స్పూన్ సోర్ క్రీమ్
ఎలా వాడాలి :
ఈ పదార్థాలని బాగా కలిపి ఒక పేస్ట్ లా తయారుచేసుకోండి. ఈ పేస్ట్ ను మెడపై అలాగే ముఖంపై అప్లై చేసుకోవాలి. పదిహేను నిమిషాలపాటు అలాగే ఉండనివ్వాలి. పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో ఈ పేస్ట్ ను తొలగించుకోవాలి. ఈ మాస్క్ మీ చర్మాన్ని కోమలంగా మర్చి హైడ్రేట్ చేస్తుంది. ఆ విధంగా, డ్రై నెస్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

నిమ్మ మరియు గ్రామ్ ఫ్లోర్ ప్యాక్
ఈ మాస్క్ మీ చర్మాన్ని శుభ్రంగా అలాగే స్మూత్ గా ఉంచేందుకు తోడ్పడుతుంది. ఆయిలీ స్కిన్ పై యాక్నే సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మాస్క్ అనేది ముఖంపై నున్న అదనపు నూనెను తొలగించేందుకు తోడ్పడుతుంది.
కావలసిన పదార్థాలు:
3 టేబుల్ స్పూన్ల నిమ్మరసం
1 టేబుల్ స్పూన్ బటర్ మిల్క్
2 టేబుల్ స్పూన్ల గ్రామ్ ఫ్లోర్
ఎలా వాడాలి:
పైన చెప్పబడిన పదార్థాలని బాగా కలిపి పేస్ట్ లా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని మెడపై అలాగే ముఖంపై అప్లై చేయాలి. 30 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ ఆయిలీ స్కిన్ కలిగిన వారికి చక్కగా ఉపయోగపడుతుంది. చర్మాన్ని యవ్వనంగా మారుస్తుంది.

నిమ్మ మరియు ఎగ్ వైట్ ఫేస్ ప్యాక్:
ఈ ప్యాక్ మీ చర్మానికి ఈవెన్ టోన్ ని అందిస్తుంది. సన్ ట్యాన్ ను తొలగిస్తుంది. ట్యాన్ అనేది డెడ్ స్కిన్ సెల్స్ వలన ఏర్పడే సమస్య. ఈ ప్యాక్ ద్వారా డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. చర్మం ప్రకాశవంతంగా అలాగే కాంతివంతంగా మారుతుంది.
కావలసిన పదార్థాలు:
1 టేబుల్ స్పూన్ నిమ్మరసం
1 టేబుల్ స్పూన్ ఎగ్ వైట్
1 టేబుల్ స్పూన్ పెరుగు
ఎలా వాడాలి:
ఈ పదార్థాలని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖంపై అలాగే మెడపై అప్లై చేయండి. ఈ మాస్క్ ను 20 నిమిషాలపాటు అలాగే ఉంచి ఆ తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఈ మాస్క్ చర్మంలోని సహజ కాంతిని వెలికి తీయడానికి తోడ్పడుతుంది. ఈ రెమెడీను వారానికి రెండు సార్లు పాటిస్తే ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు.

నిమ్మ మరియు ఆలివ్ ఆయిల్ ఫేస్ ప్యాక్
ఈ మాస్క్ అనేది బ్లేమిషెస్ ని తగ్గించేందుకు తోడ్పడుతుంది.
కావాల్సిన పదార్థాలు:
1 టీస్పూన్ నిమ్మరసం
2 టేబుల్ స్పూన్ల తేనె
1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్
ఎలా వాడాలి:
ఈ పదార్థాల్ని బాగా కలిపి చిక్కటి మిశ్రమంగా చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అలాగే మెడపై అప్లై చేసుకోండి. దాదాపు ముప్పై నిమిషాలపాటు అలాగే ఉండనివ్వండి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. మీది ఆయిలీ స్కిన్ అయితే ఆలివ్ ఆయిల్ ని అవాయిడ్ చేయండి.



Click it and Unblock the Notifications