Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
బెల్లం ద్వారా కలిగే సౌందర్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
బెల్లం ద్వారా కలిగే సౌందర్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
పోషకాలు అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా కలిగి ఉండటం చేత ఫ్రీ ర్యాడికల్స్ పై పోరాడి ఏజింగ్ ని వాయిదా వేసే సామర్థ్యం బెల్లంలో సమృద్ధిగా ఉంది. ఇది డార్క్ స్పాట్స్ మరియు బ్లేమిషెస్ ను తగ్గించేందుకు సమర్థవంతంగా పనిచేస్తుంది.
బెల్లంలో లభించే విటమిన్ సి మరియు ఐరన్ అనేది ఫ్రిజ్జీ హెయిర్ సమస్యను తొలగించి హెయిర్ ను మేనేజబుల్ గా చేస్తుంది. ఇంతకు ముందు లేనంత దృఢంగా మారుస్తుంది. మన డైలీ బ్యూటీ రొటీన్ లో బెల్లాన్ని ఏ విధంగా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్లోయింగ్ స్కిన్ కోసం:
బెల్లంలో లభించే గ్లైకోలిక్ యాసిడ్ అనేది చర్మకాంతిని మెరుగుపరిచేందుకు తోడ్పడుతుంది.
కావలసిన పదార్థాలు:
2 టేబుల్ స్పూన్ల బెల్లం పొడి
2 టేబుల్ స్పూన్ల తేనే
కొన్ని చుక్కల నిమ్మరసం
ఎలా వాడాలి:
బెల్లాన్ని క్రష్ చేసి మెత్తటి పొడిగా చేసుకోవాలి. అందులోకి రా హనీని అలాగే నిమ్మరసాన్ని జోడించాలి. ఈ పదార్థాలన్నిటినీ బాగా కలపాలి. ఈ పేస్ట్ ను క్లీన్స్ చేసిన ముఖం అలాగే మెడపై అప్లై చేయాలి. ఐదు నుంచి పది నిమిషాల వరకు ఈ ప్యాక్ ను అలాగే ఉంచాలి. ఆ తరువాత నార్మల్ వాటర్ తో రిన్స్ చేయాలి.

యాక్నే మరియు పింపుల్స్ నుంచి ఉపశమనం కొరకు :
అవును బెల్లమనేది మొండి మొటిమల నుంచి ఉపశమనానికి తోడ్పడుతుంది.
కావలిసిన పదార్థాలు
బెల్లం పొడి
నిమ్మరసం
ఎలా వాడాలి:
ఒక టేబుల్ స్పూన్ బెల్లం పొడిలో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని జోడించాలి. అలాగే నిమ్మరసం బదులు కొన్ని చుక్కల నీళ్లను కూడా జోడించవచ్చు. ఈ ప్యాక్ ను ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయాలి. కొద్ది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఈ ప్రాసెస్ ను ప్రతి రోజూ పాటిస్తే వేగవంతమైన ఫలితాలను పొందవచ్చు.

ముడతలను తగ్గించేందుకు:
బెల్లంలో లభించే గ్లైకోలిక్ యాసిడ్ అనేది చర్మం ఎలాస్టిసిటీను పెంపొందిస్తుంది. తద్వారా ఫైన్ లైన్స్ మరియు ముడతల నుంచి ఉపశమనం లభిస్తుంది.
కావలసిన పదార్థాలు:
1 టీస్పూన్ బెల్లం పొడి
1 టీస్పూన్ బ్లాక్ టీ
1 టీస్పూన్ ద్రాక్ష రసం
చిటికెడు పసుపు
కొన్ని చుక్కల రోజ్ వాటర్
ఎలా వాడాలి:
కొంత బ్లాక్ టీను మరిగించుకుని చల్లారేవరకు పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలోకి, కాస్తంత బెల్లం పౌడర్, గ్రేప్ జ్యూస్, బ్లాక్ టీ, పసుపు అలాగే కొన్ని చుక్కల రోజ్ వాటర్ ను జోడించాలి. వీటన్నిటినీ స్మూత్ పేస్ట్ లా తయారుచేయాలి. ఈ ప్యాక్ ను ముఖంపై అప్లై చేసుకుని 20 నిమిషాల వరకు అలాగే ఉండనివ్వాలి. ఆ తరువాత సాధారణ నీటితో వాష్ చేయాలి.

బ్లేమిషెస్ మరియు పిగ్మెంటేషన్ ను తగ్గించేందుకు
పిగ్మెంటేషన్, బ్లేమిషెస్ మరియు డార్క్ స్పాట్స్ కి చెందిన మీ ఇబ్బందులన్నీ ఈ ప్యాక్ తో తొలగిపోతాయి.
కావలసిన పదార్థాలు:
1 టీస్పూన్ బెల్లం పొడి
1 టీస్పూన్ టమాటో జ్యూస్
కొన్ని చుక్కల నిమ్మరసం
చిటికెడు పసుపు
ఎలా వాడాలి:
ఒక శుభ్రమైన పాత్రను తీసుకుని అందులోకి బెల్లం పొడిని వేయాలి. ఆ తరువాత అందులోకి టమాటో జ్యూస్ తో పాటు కొన్ని చుక్కల నిమ్మరసాన్ని జోడించాలి. ఇప్పుడు చిటికెడు పసుపును జోడించి పదార్థాలన్నిటినీ బాగా కలపాలి. ఈ ప్యాక్ ను 15 నిమిషాల పాటు ఉండనిచ్చి ఆ తరువాత సాధారణ నీటితో శుభ్రపరచాలి.

సిల్కీ హెయిర్ కోసం
బెల్లంలో లభించే విటమిన్ సి అనేది హెయిర్ ను స్మూత్ గా, సిల్కీగా అలాగే దృఢంగా మార్చేందుకు తోడ్పడుతుంది.
కావలసిన పదార్థాలు
2 టేబుల్ స్పూన్ల బెల్లం పొడి
1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి
1 లేదా రెండు టేబుల్ స్పూన్ల పెరుగు
ఎలా వాడాలి:
బెల్లం పొడి, ముల్తానీ మట్టి మరియు తాజా పెరుగును కలిపి ఒక ప్యాక్ ను తయారుచేయండి. ఈ ప్యాక్ ను స్కాల్ప్ పై అలాగే హెయిర్ పై అప్లై చేసి సర్కులర్ మోషన్ లో కొద్ది నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయండి. పదిహేను నిమిషాల తరువాత సాధారణ నీటితో ప్యాక్ ను తొలగించండి. ఈ రెమెడీను వారానికి ఒకసారి పాటిస్తే మెరుగైన ఫలితాలను పొందగలుగుతారు.



Click it and Unblock the Notifications
