Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
ఈ హోం మేడ్ మాస్క్ ల తో సాగిన చర్మాన్ని బిగుతుగా మార్చుకోండి
చర్మ కండర కణజాలం క్షీణించడంతో చర్మం సాగినట్టు కనిపిస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ చర్మసాగుదల జరగడమనేది అనివార్యమైన ప్రక్రియేమికాదు. అసలు నిజమేమిటంటే, చర్మం సాగడమనేది కేవలం ముసలి వయస్సువారికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది.
ప్రస్తుత పరిస్థితుల్లో యవ్వనంలో ఉన్నవారు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. చర్మం సూర్యకాంతికి అధికంగా బహిర్గతం అవ్వడం వలన దానిలో ఉండే ఎలాస్టిన్ మరియు కొల్లాజన్ అనే ప్రొటీన్లు దెబ్బతిని చర్మాన్ని సాగినట్టు చేస్తాయి. సిగరెట్ల పొగ మరియు వాయు కాలుష్యం వంటి అనేక ఇతర కారణాల వల్ల కూడా చర్మం సాగి ముడుతలు ఏర్పడతాయి.
మీలో ఈ సమస్యను ఎదుర్కొంటున్న చాలా మంది సహజమైన పరిష్కారాలకై వేచి చూస్తున్నారా? అయితే మీరు సరైన చోటుకే వచ్చారు!

చర్మం బిగుతుగా మారడానికి మన ఇంటి వద్ద ఆచరించ తగ్గ చిట్కాలను మీకోసం ఇప్పుడు చెప్పబోతున్నాం. ఈ సులువైన చిట్కాలను మీరు ఇంట్లో దొరికే వస్తువులతోనే తేలికగా పాటించగలరు. అవి ఏంటో వాటిని ఎలా పాటించాలో తెలుసుకుందాం!

1. కాఫీ:
కాఫీలో ఉండే కెఫిన్ చర్మంలో ఉండే అదనపు తేమను తొలగించి బిగుతుగా మారుస్తుంది.
కావాల్సిన పదార్థాలు:
పావు కప్పు కాఫీ పొడి
పావు కప్పు బ్రౌన్ షుగర్
మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్
అర టీ స్పూన్ దాల్చినచెక్క పొడి

వాడే పద్ధతి:
ఒక గిన్నెలో పైన చెప్పిన పదార్థాలన్నీ బాగా కలపాలి. కొబ్బరినూనె కనుక గడ్డకట్టినట్లైతే కరిగించి వాడండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి వలయాకారంలో మృదువుగా మర్దన చేయాలి. తరువాత కొన్ని నిమిషాల పాటు అలా వదిలేయండి. చివరకు గోరువెచ్చని నీటితో కడిగేయండి. దీనిని వారానికి రెండు సార్లు వాడండి.

2. టొమాటో:
టొమాటో చర్మానికి సహజ టోనర్ గా పనిచేసి చర్మం బిగుతుగా మారడానికి సహకరిస్తుంది. దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
ఒక టొమాటో
దూది ఉండ

వాడే పద్ధతి:
ఒక టొమాటోను పిండి దానిలోని రసాన్ని వెలికితీయండి. ఆ రసంలో దూది ఉండను ముంచి ముఖంపై సున్నితంగా అద్దండి.పది పదిహేను నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లని నీటితో కడిగేయండి. ఇలా రోజుకు రెండు సార్లు చేయండి. ఇది చర్మాన్ని బిగుతుగా మార్చడానికి చాలా తేలికైన ఉపాయం.

3. బొప్పాయి:
దీనిలో ఉండే విటమిన్ A మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని నునుపుగా మరియు మృదువుగా మారుస్తాయి.బొప్పాయి లో ఉండే ఎంజైములు చర్మం సాగడాన్ని అరికడతాయి.
కావలసిన పదార్థాలు:
బాగా మగ్గిన బొప్పాయి
1-2 టేబుల్ స్పూన్ల వరిపిండి

వాడే పద్ధతి:
బొప్పాయిని చిన్నచిన్న ముక్కలుగా కోసి బ్లెండ్ చేయండి. దీనికి వరిపిండిని కలిపి ముద్దగా చేయండి. ఈ పేస్టును ముఖంపై వేళ్ళను పైదిశగా కదుపుతూ మర్దన చేసుకోండి. ఇలా పదిహేను నిమిషాల పాటు చేయండి. తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితముంటుంది.

4. గ్రుడ్డులోని తెల్లసొన:
గ్రుడ్డు తెల్లసొనలో ఉండే ప్రోటీన్ చర్మం యొక్క ఎలాస్టిసిటీని పెంపొందిస్తుంది. ఇది మృతకణాలను తొలగించి చర్మానికి సహజ మెరుపునిస్తుంది.
కావలసిన పదార్థాలు:
ఒక గ్రుడ్డు తెల్లసొన
రెండు టేబుల్ స్పూన్ల తేనె

వాడే పద్ధతి:
గుడ్డు తెల్లసొనను తేనెను బాగా కలపాలి. దీనిని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. తరువాత నీటితో కడిగేయండి. ఇలా నెలకి మూడు సార్లు చేస్తే బిగుతైన చర్మం మీ సొంతం.

5. అరటి పండు:
అరటి పండ్లలో ఉండే ఖనిజాలు మరియు విటమిన్లలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నందున, బాగా మగ్గిన అరటి పండ్లను చిదిమి చర్మం బిగుతుగా మారడానికి వాడవచ్చు.
కావలసిన పదార్థాలు:
బాగా మగ్గిన అరటి పండు
రెండు లేదా మూడు స్పూన్ల నిమ్మరసం

వాడే పద్ధతి:
గుజ్జుగా చేసిన ఒక మగ్గిన అరటి పండుకు కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. దీనిని ముఖానికి రాసుకుని పది నిమిషాలు ఆరనివ్వండి. తరువాత నీటితో కడిగేయండి. మంచి ఫలితాల కోసం వారానికి రెండు సార్లు వాడండి.



Click it and Unblock the Notifications











