Latest Updates
-
బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకునేలా క్రిస్పీ సొరకాయ బజ్జీలు.. టీ, కాఫీలోకి ఆ మజానే వేరు.! -
రిలేషన్షిప్లో ఉన్నారా.. మీపై ఉన్నది ప్రేమా లేక వ్యామోహమా.. ఎలా తెలుసుకోవాలంటే.! -
టేస్టీ మంచూరియానే కాదు, కరకరలాడే అప్పాలు సైతం రెడీ.. క్యాబేజ్‌తో ఇలా ఈజీగా చేసేయండి.! -
ఈ సారి రెండు తేదీల్లో వరలక్ష్మీ వ్రతం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వ్రత ప్రాముఖ్యత.! -
ప్రెగ్నెన్సీలో వీటి లోపంతోనే విపరీతమైన క్రేవింగ్స్.. వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే.! -
కుబేర మొక్క.. మనీ ప్లాంట్ అనుకుంటే పొరపాటే.. ఇది మీ ఇంట్లో ఉంటే కనకవర్షమే.! -
పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీగా.. పొరలు పొరలుగా వచ్చే బెల్లం ఖాజా మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
కరకరలాడే చికెన్ ముక్కలు, ఘాటైన మసాలా.. చెట్టినాడ్ చికెన్ పాప్‌కార్న్‌తో ఈవెనింగ్ సూపర్! -
పోషకాల గని ఈ బీట్ రూట్ ఉప్మా..మజ్జిగతో కలిపి ఇలా చేస్తే టేస్ట్ కేక! -
చుండ్రు వల్ల జుట్టు రాలిపోతోందా? అయితే మీరు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు
మెరిసే చర్మం కోసం ప్రతి ఒక్కరూ పాటించాల్సిన 2023 బ్యూటీ రిజల్యూషన్స్
న్యూ ఇయర్ వచ్చేస్తుంది కాబట్టి ఈ 2023 మొదటి నుండి సౌందర్యానికి సంబంధించి వీటిని అలవాటు చేసుకుంటే ఆరోగ్యకరమైన, మెరిసే అందం మీ సొంతం అవుతుంది.
పాత సంవత్సరం దాదాపు పూర్తయింది. కొత్త సంవత్సరం రాబోతుంది. న్యూ ఇయర్ వచ్చిందంటే చాలా మంది రిజల్యూషన్స్ తీసుకుంటారు. కొందరు రోజూ జిమ్‌కు వెళ్లాలని, ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించాలని తీర్మానాలు తీసుకుంటారు. ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి ఒక్కరూ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తీసుకుంటారు. ఆరోగ్యంతో పాటు సౌందర్యం కూడా ముఖ్యమే. మహిళల విషయానికి వస్తే అందం ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

న్యూ ఇయర్ వచ్చేస్తుంది కాబట్టి ఈ 2023 మొదటి నుండి సౌందర్యానికి సంబంధించి వీటిని అలవాటు చేసుకుంటే ఆరోగ్యకరమైన, మెరిసే అందం మీ సొంతం అవుతుంది.

ఎక్కువ నిద్రపోవడం
ఆరోగ్యానికి తగినంత నిద్ర పొందడం చాలా ముఖ్యం. చర్మ ఆరోగ్యానికి కూడా నిద్ర చాలా అవసరం. కంటి నిండా నిద్ర లేకపోతే కళ్లు ఉబ్బుతాయి. కంటి చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి. ముఖం పాలిపోయినట్లుగా కనిపిస్తుంది. ముఖం కళ కోల్పోయి నిస్తేజంగా మారుతుంది. డార్క్ సర్కిల్స్, డల్ స్కిన్ ఇలాంటి చాలా సౌందర్య సమస్యలు వస్తాయి. రోజూ 7 నుండి 8 గంటల పాటు కంటినిండా నిద్రపోతే ఆరోగ్యంగా ఉండటంతో పాటు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

ఎక్కువ నీరు తాగడం
ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి హైడ్రేటెడ్‌గా ఉండటం కీలకం. ఆరోగ్యకరమైన చర్మానికి నీరు చాలా అవసరం. ఇది టాక్సిన్స్ ను బయటకు పంపి చర్మ కణాలను హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. తగినంత నీరు తాగకపోతే చర్మం నిస్తేజంగా కనిపిస్తుంది. చర్మం తేమ కోల్పోయి పొడిబారుతుంది. మనుషులు, చేసే పనులను బట్టీ రోజుకు యావరేజీగా 8 గ్లాసుల నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఆరోగ్యకరమైన కొవ్వులు తినడం
శరీరంలోని మిగిలిన భాగాల మాదిరిగానే, చర్మం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం వల్ల ప్రయోజనం పొందుతుంది. ఆహారంలో ఎక్కువ పండ్లు, కూరగాయలు, ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చుకోవాలి.

రోజూ సన్‌స్క్రీన్ వాడటం
చర్మాన్ని సంరక్షించుకోవడానికి రోజూ సన్‌స్క్రీన్ రాసుకోవడం చాలా ముఖ్యం. చలికాలంలో కూడా మీ చర్మ సంరక్షణ దినచర్యలో సన్‌స్క్రీన్ తప్పనిసరిగా ఉండాలి. ఇది సూర్య కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. ఎక్కువ SPF ఉన్న సన్‌స్క్రీన్ లోషన్ వాడాలి.

క్రమం తప్పకుండా ఎక్స్‌ఫోలియేట్ చేయడం
వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా కనిపిస్తుంది. ఇది కణాల టర్నోవర్‌ను వేగవంతం చేస్తుంది. మూసుకుపోయిన చర్మ రంధ్రాలను ఓపెన్ చేస్తుంది.

రెగ్యులర్ చెక్-అప్‌లు
చర్మ క్యాన్సర్‌గా మారే అవకాశం ఉన్న పుట్టుమచ్చలు లేదా మచ్చల కోసం కనీసం సంవత్సరానికి ఒకసారి చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించడం అలవాటు చేసుకోవాలి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ముఖం మాత్రమే కాకుండా శరీరమంతా పర్యవేక్షించడం చాలా ముఖ్యం.
మూసుకుపోయిన రంద్రాలను తొలగించడంలో సహాయపడటానికి సౌందర్య నిపుణులతో రెగ్యులర్ ఫేషియల్ చేయించుకోవడం కూడా మంచిదే.



Click it and Unblock the Notifications