Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
పండగ వేళ అందంగా కనిపించాలా?.. అయితే ఇలా చేయండి!
దసరా పండగ దగ్గరికొచ్చేస్తుంది. ప్రస్తుతం దేవి శరన్నవరాత్రులు కూడా జరుగుతున్నాయి. పూజలు, వ్రతాలు అన్నీ చేస్తూ ఉంటాము కదా. అలాంటి సందర్భంగా అందంగా, కాంతి వంతంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అందుకోసం చాలా మంది బ్యూటీ పార్లర్లకు వెళ్లి రకరకాల ఫేసియల్ చేయించుకుంటూ ఉంటారు. అయితే ప్రతి ఒక్కరికీ తగిన బడ్జెట్, సమయం ఉండకపోవచ్చు. అలాంటి వారు ఇంట్లో దొరికే వస్తువులతోనే మంచిగా ఫేసియల్ చేసుకోవచ్చు. చెప్పాలంటే సమయం ఆదా అవడంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుంది. పైగా క్షణాల్లోనే కాంతి వంతంగా, అందంగా కనిపించొచ్చు. అయితే ఆ ఫేసియల్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
చర్మం శుభ్రం చేసుకోవాలి:
ఇంట్లోనే ఫేసియల్ చేసుకోవడానికి ముందుగా మీ చర్మాన్ని నీటిగా శుభ్రం చేసుకోవాలి. అందుకోసం రెండు టేబుల్ స్పూన్ పాలు తీసుకొని అందులో చిటికెడు ఉప్పుని కలపాలి. తరువాత కాటన్ తీసుకొని.. ముందుగా కలిపి పెట్టుకున్న పాల మిశ్రమాన్ని ముఖాన్ని బాగా రుద్దాలి. తరువాత సున్నితంగా మసాజ్ చేయాలి. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ముఖం మీదున్న పాలు ఆరిపోయాక.. సాధారణ నీటితో శుభ్రం చేసుకుంటే సరి. మీ ముఖం ఎలాంటి మురికి లేకుండా క్లీన్ అవుతుంది.

ఎక్స్ ఫోలియేట్ చేయండి:
ఇంట్లోనే ఫేసియల్ చేసుకోవాలంటే ముందు మీ చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడం చాలా ముఖ్యం. ఇలా చేయడానికి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ శనగ పిండిగిలో ఒక స్పూన్ తేనె పోసి.. బాగా కలుపుకొని, ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల ఉంచి అది ఆరిపోయాక నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. అంతే.. ఇది మీ చర్మం లోపల ఉన్న మురికిని క్లీన్ చేస్తుంది. తద్వారా మీ చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.
ముల్తానీ మట్టితో ఫేస్ ప్యాక్ వేసుకోవడం:
చర్మం కాంతివంతంగా మారిపోవాలంటే ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ ను మించింది ఏదీ లేదని చెప్పుకోవచ్చు. ఇందుకోసం ముల్తానీ మట్టిలో సరిపడా రోజ్ వాటర్, గ్లిజరిన్ కలిపి బాగా కలుపుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకొని, 15 నిమిషాలు ఆగి గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి. అంతే.. మీ ముఖం మిల మిలా మెరిసిపోతుంది.
టోనర్ రాయండి:
ముల్తానీ మట్టితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కున్న తరువాత మీ ఫేస్ కు టోనర్ అప్లై చేయడం చాలా ముఖ్యం. అందుకోసం ఒక దోసకాయను ముక్కలు ముక్కలుగా చేసి, మిక్సీ పట్టాలి. అనంతరం దాని నుంచి వచ్చిన రసాన్ని ముఖానికి రాసుకొని, పది నిమిషాల పాటు ఆరిపోయాక.. సాధారణ నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.
మాయిశ్చరైజర్ వాడడం:
పైన చెప్పిన ఫేసియల్ పూర్తయ్యాక ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకుంటే, ఇది ముఖానికి కావాల్సిన తేమను అందించడంతో పాటు, చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. ప్రతిరోజూ రాత్రి మాయిశ్చరైజర్ రాసుకొని, ఉదయాన్నే క్లీన్ చేసుకుంటే చర్మం కాంతి వంతంగా మారడంతో పాటు మృదుగా తయారవుతుంది. ఈ విధంగా పండగ వేళ ఇంట్లోనే ఫేసియల్ చేసుకొని, ఎంచక్కా అందంగా కనిపించొచ్చు.



Click it and Unblock the Notifications
