Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
Skin Care Tips: వేసవిలో ఈతకు వెళ్తున్నారా? ఈ చర్మ సమస్యలతో జాగ్రత్త!
వేసవిలో చాలా మంది స్విమ్మింగ్ కు వెళ్తుంటారు. వేడి వాతావరణంలో కాసేపు అలా నీటిలో ఈత కొడితే ఆహ్లాదానికి ఆహ్లాదం, ఆరోగ్యం కూడా. అయితే స్విమ్మింగ్ చేసేటప్పుడు నీటిలో మునిగిపోకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో.. చర్మ సంరక్షణకు కూడా అంతటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
నీటిలో ఉండే క్లోరిన్ వల్ల చర్మ సమస్యలు తలెత్తుతాయి. చికాకుగా అనిపించడం సహా దురద, ర్యాషెస్ వస్తాయి. మీరు కూడా ఈ ఎండాకాలంలో స్విమ్మింగ్ చేయాలని అనుకుంటుంటే ఎలాంటి చర్మ సంరక్షణ చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స్విమ్మింగ్ పూల్ వాటర్ వల్ల వచ్చే చర్మ సమస్యలు:
పొడి చర్మం:
స్విమ్మింగ్ పూల్ లో దిగడం వల్ల వచ్చే అతి సాధారణమైన సమస్య చర్మం పొడిబారడం. దీని వల్ల దురద కూడా పెడుతుంది.
దద్దుర్లు:
పూల్‌లో క్లోరిన్ వేస్తుంటారు. దీని వల్ల చర్మం దురద పెడుతుంది. కొంతమందిలో దద్దుర్లు కూడా వస్తాయి. కెమికల్ సెన్సిటివిటీ ఉన్నవారిలో దద్దుర్లు ఎక్కువగా బాధిస్తాయి.
చర్మ మంట:
స్విమ్మింగ్ పూల్‌లో ఎక్కువ సేపు ఈత కొడితే చర్మం మంటపుడుతుంది. అయితే ఇది కొత్తలో మాత్రమే ఉంటుంది.
ఎలాంటి స్కిన్ కేర్ రొటీన్ పాటించాలంటే..
1. మాయిశ్చరైజర్ వాడాలి:
స్విమ్మింగ్ పూల్ వల్ల వచ్చే చర్మ సమస్యల నుండి మాయిశ్చరైజర్ చాలా కాపాడుతుంది. పూల్‌కి వెళ్లే ముందు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి, ఇది చర్మంపై ఓ పొరను ఏర్పరుస్తుంది. దీని వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. ఈత కొట్టడానికి ముందు చర్మంపై డైమెథికాన్, గ్లిజరిన్, నూనెలు, పెట్రోలేటమ్ ఉన్న మాయిశ్చరైజర్ ను వాడాలని డెర్మటాలజిస్టులు సూచిస్తున్నారు.
2. సన్‌స్క్రీన్ మర్చిపోవద్దు:
చర్మంపై మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత సన్‌స్క్రీన్‌ను అప్లై చేయాలని గుర్తుంచుకోండి. పూల్‌కు వెళ్లే కనీసం 20 నిమిషాల ముందు వాటర్ ప్రూఫ్ సన్‌స్క్రీన్‌ని ఉపయోగించాలని వైద్యుల సూచిస్తున్నారు.
3. కంటి కింద సన్‌స్క్రీన్:
చాలా మంది కళ్ల కింద సన్‌స్క్రీన్ అప్లై చేస్తుంటారు. కానీ దానిని కింద అప్లై చేయడం మానుకోవాలి. బదులుగా మంచి స్విమ్మింగ్ గ్లాసెస్ వాడటం మంచిది.
4. స్విమ్మింగ్ క్యాప్:
చర్మంతో పాటు జుట్టు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. స్విమ్మింగ్ పూల్‌లోకి దిగే ముందు స్విమ్మింగ్ క్యాప్ తొడుక్కోవడం మర్చిపోవద్దు. పూల్‌లో ఉండే క్లోరిన్ వల్ల జుట్టు పాడవకుండా ఉండాలంటే క్యాప్ ధరించాల్సిందే.
5. స్నానం చేయాలి:
ఈత కొట్టిన తర్వాత పూల్‌లోని క్లోరిన్ చర్మంపై పేరుకుపోతుంది. అందుకే ఈత కొట్టిన తర్వాత స్నానం చేయాలని అంటారు. చర్మాన్ని శుభ్రం చేయడానికి తేలికపాటి క్లెన్సర్‌ని ఉపయోగించడం మంచిది.
6. మాయిశ్చరైజర్:
స్నానం చేసిన తర్వాత కూడా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.
ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు స్మిమ్మింగ్ కు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆ సమయంలో వేడిమి ఎక్కువగా ఉండి సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.



Click it and Unblock the Notifications
