Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
Nidhi Agarwal: కుర్రకారు చూపు తిప్పుకోనివ్వని అందాల ‘నిధి’అదిరేటి డ్రస్సులపై మీరూ ఓ లుక్కేయండి.
ఈ డ్రస్సుల్లో నిధి అగర్వాల్ సొగసుల ‘నిధి’ని పెంచేసింది. ఆ ఔట్ ఫిట్స్ పై మీరు కూడా ఓ లుక్కేయండి.
ఇస్మార్ట్ శంకర్లో రామ్ తో కలిసి రీల్ లైఫ్ లో రచ్చ రచ్చ చేసిన అందాల 'నిధి'.. ఇప్పుడు రియల్ లైఫ్ లోనూ తన అందచందాలతో కుర్రాళ్ల మతి పోగొడుతోంది. లేటెస్ట్ గా తన ఇన్ స్టాగ్రామ్ లో కొత్త కొత్త డ్రస్సులలో సరికొత్తగా కనిపిస్తూ యువకుల గుండెల్లో గూడు కట్టుకుంటోంది.

అంతే కాదు తన అందాల డోసును మరింత పెంచేసి.. అదిరే అందాల 'నిధి' అనిపించుకుంటోంది. అంతేకాదు ఎక్స్ పోజింగ్ కూడా చేస్తూ.. తాను ఏ హీరోయిన్ కు తక్కువ కాదని నిరూపిస్తోంది. ఇటీవలే టాలీవుడ్ లో సక్సెస్ సాధించిన ఈ అందాల భామ బాలీవుడ్ లో అడుగుపెట్టింది.

ఇక తన ఏ డ్రస్సు ధరించినా.. అందుకు తగ్గట్టు మ్యాచింగ్ జ్యువెలరీతో.. పాలమీగడ వంటి మేని ఛాయతో.. కళ్లు పేలిపోయేంత బ్యూటీతో అందరి చేత ఔరా అనిపించుకుంటోంది. అంతేకాదు అప్పుడప్పుడు క్లీవెజ్ షోతో తాను నిజంగా అమ్మాయేనా.. లేక అజంతా, ఎల్లోరా శిల్పమా అన్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిధి అగర్వాల్ తన గ్లామర్ ఔట్ ఫిట్స్ తో కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తన మత్తు కళ్లతో మన్మథ బాణాలు వదులుతూ అందరినీ మైమరిచిపోయేలా చేసేస్తోంది. ఇది చూసినా సినీ ఫ్యాన్స్ ఇన్నాళ్లు ఈ అందాల నిధి మన మధ్యే ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.

కొంటెగా చూస్తే..
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో రామ్ తో కలిసి నటించడంతో ఈ అందాల ‘నిధి' ఒక్కసారిగా వెలుగులోకొచ్చింది. ఆ తర్వాత ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. అయితే తను రీల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ లోనూ ఫ్యాషన్లో ఏ మాత్రం వెనుకబడలేదని.. రోజురోజుకు తన బ్యూటీ డోసు పెంచుకుంటూ.. ప్రతి ఒక్క క్షణాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోవడం మొదలుపెట్టింది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫొటోను షేర్ చేస్తూ.."No bird soars too high if he soars with his own wings"ఈ క్యాప్షన్ పెట్టింది. ఈ డ్రస్సుకు తగ్గట్టు మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకుని అందమైన బుట్టబొమ్మలా ఫోజిచ్చింది. దీంతో కుర్రకారుకు పిచ్చేక్కిపోతోంది.

బ్లాక్ సారీలో..
ఇలా తను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం వల్ల, ప్రస్తుతం తనకు స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వస్తున్నాయి. ఈ కన్నడ బ్యూటీ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన కూడా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక్కడైతే అచ్చమైన తెలుగమ్మాయిల చీర కట్టుకుని.. కనిపించి.. కనిపించని నడుముతో, క్లీవెజ్ షోతో.. కొంటె చూపుతో అందరినీ ఫిదా చేస్తోంది.

ఎల్లో డ్రస్ లో..
ఇక్కడ చూశారా.. ఎల్లో కలర్ డ్రస్సులో అందమైన పువ్వుతో తన అందాల ‘నిధి'ని మరింత పెంచుకుంది. అంతేకాదు ఈ డ్రస్సుకు తగ్గట్టు గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ మ్యాచింగ్ జ్యువెలరీ వేసుకుని ఫ్యాషన్లో తాను ఏ మాత్రం తగ్గేదే లే అనే చూపులతో ప్రతి ఒక్కరినీ కవ్వించేలా చూస్తోంది.

వైట్ డ్రస్సులో..
ఈ వైట్ కలర్ డ్రస్సులో పాల మీగడలా తేలిపోతూ.. పచ్చని అందాల మధ్య అందాల హంసలా.. అజంతా శిల్పంలా కనిపిస్తోంది నిధి అగర్వాల్. ఇక్కడ తన చిరునవ్వుతో.. ఓర చూపుతో కుర్రకారు చూపు తిప్పుకోనివ్వడం లేదు.

బోల్డ్ గా..
మొదట్లో అందాల ‘నిధి'ని అందరూ ట్రెడిషనల్ అమ్మాయి అనుకున్నారు. కానీ తాను కూడా బోల్డ్ అని.. ఈ ఫొటో ద్వారా నిరూపించింది. ఇక్కడ చూశారా నిధి అగర్వాల్ ఎంత బోల్డ్ గా కనిపిస్తుందో.. హై హీల్స్, గ్రీన్ కలర్ స్కర్ట్ వేసుకుని.. లూజ్ హెయిర్, అందమైన జ్యువెలరీతో తన సొగసుతో ప్రతి ఒక్కరికీ కైపు ఎక్కిస్తోంది.

సింపుల్ లుక్..
అందాల ‘నిధి' కేవలం ఔట్ ఫిట్స్ పైనే కాదు.. తన అందంపైనా ఫోకస్ పెడుతుందని ఈ ఫొటో చూస్తే తెలుస్తుంది. ఇక్కడ చూడండి సింపుల్ లుక్ తో.. పెదాలపై లైట్ లిప్ స్టిక్.. దానికి సరిగ్గా సూటయ్యే పింక్ కలర్ చెవిపోగులతో మరింత అందంగా కనిపిస్తోంది.

పచ్చని చీరలో..
ఇక్కడ చూశారా.. పచ్చని అందమంతా అందాల నిధి వద్దే దాగి ఉందా అన్నంతలా మెరిసిపోతోంది. తన పచ్చని చీరకు మ్యాచింగ్ బ్లౌస్, గోల్డ్ కలర్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ తో ధగధగలా మెరిసిపోతోంది ఈ బ్యూటీ. ఇక తన ఫేసుపైనా చెరగని చిరునవ్వు.. కాటుక కళ్లతో యూత్ ను మైమరిచిపోయేలా చేస్తోంది.

వరుసగా ఆఫర్లు..
ఇలా తన అందచందాలతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ కన్నడ బ్యూటీకి తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ మంచి ఆఫర్లే వస్తున్నాయి. అప్పుడప్పుడు హాట్ ఫొటోలతో అదరగొట్టే నిధి అగర్వాల్ తన ఫాలోయర్స్ ను సైతం అమాంతం పెంచేసుకుంది. ఇప్పటికే తన ఇన్ స్టాలో కోటిన్నరకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు. తన హాట్ ఫోటో షూట్లతో తన ఫాలోయర్స్ ను రోజురోజుకు పెంచుకుంటూ పోతోంది.
All Images Credited to : Instagram



Click it and Unblock the Notifications